పాఠకుల ప్రశ్నలకు జ్యోతిష్కుడి సమాధానాలు ఇలా
1.మధుకిరణ్ ఉట్ల, పుట్టినచోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం
వివాహభావం నవాంశలో బాగా లేకపోవడం వల్ల కావచ్చు, వివాహ ఆలస్యం, దశ రవిలో శని బాగాలేదు,
2. కాలేశ్వరరావు, రాజమండ్రి, వివాహం
మీరు మీ పుట్టి నసమయం పంపండి, లేదా నక్షత్రం పంపితే ఇప్పటి వివాహ బలం చెప్పవచ్చు. కానీ గురుబలం కొంత ఉంది. రాహు, రవి, శనిలకి దానాలు చెస్తూండండి. వివాహానికి మేం ఇచ్చిన శ్లోకం చదువుతూండండి. అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
3. కిరణ్‌కుమార్, హైదరాబాద్, కుమార్తె గురించి
పేరాల కొద్దీ రాసి మీరు చివరికి అడగదల్చుకుంది, కెరియర్. మా వెబ్ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయంగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాలా విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.
4. మధుసూధన్‌రావు, రొంపిచర్ల, పుట్టిన సమయం రాయలేదు
విదేశగమననానికి ప్రేమపెళ్లికి కచ్చితంతా మీరు సమయం రాయాలి, కానీ మీరు సింహరాశి అని చెప్పారుకనక కొంత చెప్పవచ్చు, వచ్చే ఫిబ్రవరిత ర్వాత కొంత మెరుగవుతుంది, గురుబలం కొంత ఉంది కానీ రాహుకేతువులకి దానాలు పరిహారాలు చేస్తుండండి.

5. రాజు విశ్వకర్మ, హైదరాబాద్, వివాహం
మీకు 7వఅధిపతి కుజుడు 8లో ఉన్నాడు, రాహువులో శని దశలో నడుస్తుంది. గోచారంలో గురుబలానికి మరొక సంవత్సరం ఆగాలి, పైన చెప్పిన గ్రహాలకి శాంతి దానాలు చేస్తూండండి. వివాహానికి మేం ఇచ్చిన శ్లోకం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
6. జయచంద్ర ఆనమనేని, చిత్తూరు, వివాహం, భవిష్యత్తు
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయంగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.
7. నాగార్జునరావు డబ్బుగొట్టు, ప్రకాశం, ప్రభుత్వోద్యోగం
మీకు ప్రభుత్వోద్యగానికి కొంత అవకాశం ఉంది కానీ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి, శ్రీ రాజమాతంగ్యైనమ: అని జపిస్తూండండి.
8. శ్రావణ్ బిట్ల, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం
మీ జాతకంలో ప్రేమకి అవకాశం ఉంది అది వివాహం వరకు వెళ్లపోవచ్చు, చాలా ఆటంకాలున్నాయి.
9. రవీంద్రనాథ్‌రెడ్డి(రెడ్డప్పరెడ్డి) ఉద్యోగం
పుట్టిన వివరాలు ఏవీ ఇవ్వలేదు.
10. రాజా.డి(రజినికాంత్), వరంగల్, ఆర్థికపరిస్థితి, ఆరోగ్యం
మీకు శనిదశలో శని అంతర్దశ నడుస్తుంది. 2014 ఏప్రిల్ నుండి 2017మే వరకు ఉంటుంది, కిందటి సంవత్సరం అక్టోబర్ నుండి ఏలినాటి శని దశ చివరికొచ్చింది మరొక రెండు సంవత్సరాలుంటుంది. మొత్తానికి శనిరాహుకేతువులకి దాన పరిహారాలు అవసరం. వాటివల్లే అన్ని ఇబ్బందులు తగ్గుతాయి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
11. పుల్లెల రమణ, దుబాయ్, కుమారుడి పేరు
అనూరాధ నక్షత్రం కాబట్టి న,అనె అక్షరంతో సరి సంఖ్యలో పేరు పెట్టుకోండి. జననకాల దోషాలు లేవు. శుభం.
12. శిరీష, హైదరాబాద్, ప్రేమవివాహం అవుతుందా
మీకు జాతకరీత్యా ప్రేమవివాహానికి అవకాశాలు లేవు.
13. శ్రీనివాస రావు, మఖనక్షత్రం వివాహానికి బలం ఉందా?
గురుబలం ఉంది కానీ అర్ధాష్టమ శని, రాహుకేతువుల ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నయి, వాటికి దానాలు చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
14. వి.వి.కె ప్రసాద్, కుమారుని పైచదువులు, కాకినాడ
మీ అబ్బాయికి తప్పక మంచి చదువులకి అవకాశం ఉంది, మంచి ఉద్యోగం కూడా బాగుంది. గురు,శనులకి దానాలు ఎక్కువగా చేస్తూండండి.
15. విమల్, కర్ణాటక, కెరియర్
భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications