జ్యోతిషం: భార్యాభర్తల కలయిక కుదురుతుందా?

1. రాజేంద్రబొట్ట - తమ మనవడు (రిషిక్‌ చెల్లింగి) జనన కాలదోషం గురించి అడిగారు, అర్కన్‌ సాస్‌(యూ.యస్‌.ఏ)

మీ కుమారుడికి జనన కాలందోషాలలో రవి5లో, 6లో శుక్రుడు ఉండటం బాలారిష్ట దోషం, రెండోది మీ మనవడు చిత్తనక్షత్రం 3వపాదం ఇది కూడా శాంతిచేయవలసిన నక్షత్రమే. వీటన్నింటికీ శాంతి హోమ దానాదులు చేసుకోండి.

2. హరిప్రసాద్‌ వర్మ పెన్మెస్ట, భీమవరం, వివాహం

లగ్నకేతు ,7వ రాహువు 8వ అధిపతి కుజుడు 2లో ఉండటం, ఇవన్నీ వివాహాటంకాలు, గోచారంలో గురుడు మరొక సంవత్సరం తర్వాత సహకరిస్తాడు. శుక్రుడిలో శుక్రుడి దశ నడుస్తుంది. ముందు పైన చెప్పిన గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి. వివాహానికి మేం ఇచ్చిన శ్లోకాన్ని చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

3. చైతన్య హరి కిషన్‌మెల్ల చెరువు, తెనాలి, కెరియర్‌

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటం కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

4.చిన్నయాచారి కల్డారి, 06/10/1980, పుట్టిన సమయం, చోట్లు రాయలేదు, వివాహం ,ఉద్యోగం

సింహరాశి అని రాసారు దాన్ని బట్టి చెపుతున్నాం, మీకు ఉద్యోగం దొరుకుతుంది, వివాహానికి బలం ఉంది. మిగిలిన ప్రశ్నలకు వివరాలు పంపండి.

5. వంశీకృష్ణ గోగిరెడ్డి, పుల్లయపల్లి (నెల్లూరు) ప్రేమవివాహం అవుతుందా?

మీరు పుట్టిన సమయం చోట్లు రాయలేదు. వాటిని పంపితే చెప్పగలం

6. సిహెచ్ రమణ మూర్తి, కాకినాడ, సెటిల్‌మెంట్‌

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి .ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

7. కర్ర మల్లేశ్వరరావు, పుట్టినచోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం,(1978)ఆర్థిక సమస్యలు

రాహువు8లో , 2లో కేతువు, 6లో కుజుడు, వ్యయాధిపతి శని 7లో, 8వఅధిపతి బుధుడి దశలో కేతువు అంతర్దశ నడుస్తుంది. గోచారంలో ఏలినాటి శని చివరిదశలలో ఉంది 5న్నర సంవత్సరాలనుంచీ శని పీడ ఉంది. దీన్ని వివరించడానికి పేజీలు సరిపోవు. ఒక్కమాటలొ చెప్పాలంటే సగానికి పైగా మీ పొరపాట్లే ఎక్కువ, కొంత కౌన్సిలింగ్‌ అవసరం కానీ పైన చెప్పిన గ్రహాలకి దానాలు ఎక్కువ చేస్తుండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

Ask Your Astrologer: he clears your doubts

8. శ్రీనివాసరావు, సింద్రాబాద్‌, తిరిగి ఉద్యోగం పొందగలనా? ఏరంగంలో?

తప్పకుండా పొందుతారు, గోచారం వచ్చేసంవత్సరం సెప్టెంబర్‌ తర్వాత బాగవుతుంది. దశాబలం 2017 సంవత్సరం వరకు కొంత ఓపిక పట్టాలి, మీకు శని సంబంధంగా సేవారంగం, కంఫ్యూటర్‌ రంగంలో రాణించగలుగుతారు.

9. చెన్నాప్రగడ కనక ప్రసాద్‌, నర్సాపురం, కెరియర్‌

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

10. బాల ఐశ్వర్య.సిహెచ్‌, భార్యాభర్తల కలయిక కుదురుతుందా?

మీ జాతకంలో వివహభావాధిపతి గురుడు వ్యయంలో ఉన్నాడు, 2లో 8వ అధిపతి కుజుడున్నాడు, దశ బాగాలేదు, మీ భర్త జాతకానిదీ అదే పరిస్థితి, 8వ అధిపతి శుక్రుడు లగ్నంలో ఉండి 7ని చూస్తున్నాడు, వివాహాధిపతి 8వ శధిపతి నక్షత్రం పైన ఉన్నాడు. 2012 సెప్టెంబర్‌ నుండి ఆయనకి ఇలా మారింది. గోచారం బాగున్నా చేయగలిగింది చాలాకష్టమైన పని. పైన చెప్పిన గ్రహాలకి శాంతి పూజచేసుకొని, దానాలు చేస్తూండండి. ''ఆపదాం అపహర్తారం, దాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం'' అనే శ్లోకం ఎక్కువసార్లు చదవండి.

11. కె.రాంబాబు ఆచారి, లక్కసాని పల్లి, ప్రభుత్వోద్యోగం వస్తుందా,

పుట్టిన సమయం రాయకుండా చెప్పడం కుదరదు.

12. నైమిషా కుమారి, పి,హైదరాబాద్‌ ,ప్రేమవివాహం అవుతుందా?

మీకు ప్రేమవివాహం అయ్యే అవకాశం ఉంది.

13. ధరణి, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, విదేశగమనం,

మీకు విదేశాలకి వెళ్లె అవకాశం లేదు.

14. కాటం రెడ్డి రామలింగం, కర్నూలు, కెరియర్‌

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

15.విష్ణు శర్మ యలమంచిలి

మీరు పుట్టిన చోటుని 2015గా ఇచ్చారు సరిచూసుకోండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+