జ్యోతిష్కుడ్ని అగడండి: జవాబులు చదవండి

1.సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి ` రాయచోటి ` ఆర్థిక స్థితి

వృత్తిస్థానంలో శనిరాహువులుండటం వల్ల ఆర్థికస్థితి కొంత తక్కువగా ఉండటం,చేసేపనులు ఆశించిన ఫలితాలివ్వకపోవటం వంటివి జరుగుతాయి ,కానీ అన్నీవాటి ఫలితమే అనుకోవటం తప్పు.దానధర్మాలు ,పుణ్యకార్యాలుకూడా కొంత మంచి ఫలితాల్నిస్తాయి.ప్రస్తుతం రాహువుదశనడుస్తుంది.కొంత ఇబ్బందికాలమే దాన్నిదాటాలి,మీవృద్ధి కొంత మెల్లిగా ఉంటుంది.

2.సీతారామయ్య ` కేసప్రగడ ` కెరియర్‌

లైఫ్‌ సెటిల్‌మెంట్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.(మీరనుకున్నవన్నీ సెటిల్‌మెంట్స్‌ కావు) ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

3.యస్‌.శివకృష్ణ ` పుట్టినచోటు కానీ,నక్షత్రం కానీ రాయలేదు `కెరియర్‌

పుట్టిన వివరాలు రాయలేదు. నక్షత్రంకూడారాయలేదు ,దేని ఆధారంగా చెప్పాలి? పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి పంపండి.

Ask your astrologer: he replies

4.యం.నాగ అయ్యప్ప ` విదేశ గమనం,ఇల్లు

మీకు విదేశాలకు వెళ్లడానిఅవకాశం ఉంది,స్వంత యింటికి కూడా యోగం ఉంది,కొంత ఆలస్యంగా కొంత ఎక్కువఖర్చుతో ఉంది.

5.శిష్టా రామకిషోర్‌ ` ముమ్మిడివరం ` అప్పుల ఇబ్బంది

పుట్టిన వివరాలు రాయలేదు. నక్షత్రంకూడారాయలేదు ,చెప్పడం కుదరదు.

6.కోటేశ్వరరావు ` భరణినక్షత్రం `

మీరు చర్చనీయాంశాలైన పెద్దప్రశ్నలు 3,4అడిగారు. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.నియమావళి చదివి పంపండి .కానీ గోచారరీత్యానీకు అష్టమ శనిప్రభావం ఎక్కువుంది.దానికి పరిహారం చేసుకోండి.

7.యస్‌.జ్యోతినాథ్‌ రెడ్డి ` వివాహం

మీకు ఒక వ్యక్తితో ప్రేమవ్యవహారమ్నుట్టు,ఆఅమ్మాయితోనే మీకు వివాహమవుతుందా అని అడిగారు.మీమీ జాతకాలలో ప్రేమవివాహాలకవకాశాలున్నయా లేవా అనేది జ్యోతిష్కుడు చెప్పగలడు కానీ ఆఅమ్మాయేనాకాదా చెప్పలేడు,మీరు 2జాతకాలను ఇచ్చిపంపితే అవికలిసాయో లేదో చెప్పగలం కానీ నిర్ణయం మాత్రం మీదే.దానికి పుట్టిన వివరాలు పూర్తిగా పంపాలి లేదా జ్యోతిష్కున్ని నేరుగా కలిస్తే మంచిది.

8. జక్కమషెట్టి వెంకటలక్ష్మి ` పిఠాపురం ` ద్వితీయవివాహం

2015` 2016 వరకూ మీకు అనుకూలసమయముంది ప్రయత్నించవచ్చు

9.రామచంద్ర మహిపాల్‌ `

పుట్టిన చోటు,సమయాలు రాయలేదు (ప్రభుత్వోద్యోగం,వివాహం గురించి) పుట్టిన వివరాలు పంపండి.ప్రశ్నకూడా స్పష్టంగా రాయండి .వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

10.గుంటమడుగు తులసీరామ్‌ ` తులారాశి `పుట్టిన చోటు,సమయాలు రాయలేదు

మీరిచ్చిన రాశినిబట్టి మీకు వివాహానికి కొంతకాలంఉంది,విదేశాలకు అవకాశం ఇప్పుడు తక్కువగా ఉంది.ఏలినాటి శనికి పరిహారం చేసుకోండి.

11.భాస్వంత్‌ పడాల ` శ్రీవాణి మేడబాయిన (వివాహపొంతన)

వీరికి వివాహ పొంతన కుదిరింది.అవికలిసాయో లేదో చెప్పగలం కానీ నిర్ణయం మాత్రం మీదే. ఇంకా సందేహాలుంటే జ్యోతిష్కున్ని నేరుగా కలిస్తే మంచిది.

12.గణేష్‌ అల్లెంకి ` నాస్‌పూర్‌ ` కెరయర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.యమావళి చదివి పంపండిఏదైనా ఒక ప్రశ్న అడగండి.

13.నమ్మి వీరవేంకట సతీష్‌రాజు ` రాజమండ్రి ` వివరాలు

మొదట మీవివరాలు అడిగారు మకరలగ్నం, సింహరాశి, పుబ్బ నక్షత్రం3వ పాదం, రెండోది మీ ఉద్యోగం, ప్రతీవారికీ ఉద్యోగం ఉంటుంది.కానీ మీ ఉద్యోగం విషయంలో మీసమస్యఏంటీ మాత్రం అడగలేదు.

14.విశ్వనాథం ` 1979 ఆర్థిక ఇబ్బందులు ` పుట్టిన వివరాలివ్వలేదు

కానీ మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నది అర్థమైంది కానీ వివరాలులేకుండా చెప్పడం కష్టం,వీలైనంత దానధర్మాలు,కనకధారవంటి స్త్రోత్ర పారాయణలు మీకు మీరుగా చేస్తూ ఉండండి.

15.రఘురాములు ` చెన్నై

మీరు చర్చనీయాంశాలైన పెద్దప్రశ్నలు 3,4 అడిగారు పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.నియమావళి చదివి పంపండిఏదైనా ఒక ప్రశ్న అడగండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+