జ్యోతిషం: వివాహ యోగం ఉందా?
1. హర్షవర్ధనరెడ్డి, తిరుపతి, విదేశగమనం
మీకు విదేశగమనానికి అవకాశం ఉంది.కానీ మీకుమారుని చదువు అనిఅడిగారు అతని వివరాలు పంపండి అతని చదువు గురించి మీ సందేహం ఏంటి రాయండి.(గమనిక:మీరు పునర్వసు4వపాదం అనిరాసారు. కానీ వివరాల ప్రకారం పుష్యమి 3పాదం ఐంది)
2.శ్రావ్య పాపసాని,గుంటూరు, వివాహం
మీకు జూన్ 2016 నుండి 2017 జూన్ వరకు మకు వివాహానుకూల సమయం అన్నివిధాలా ఉంది. కానీ మీకు జాతకరిత్యా 8వ,7వ అధిపతులిద్దరూ 5లో ఉన్నారు సంతానం వివాహానికి సమస్యల్నిస్తాయి, దానికి
కుజ, బుధ, గురు, శుక్ర,శనులకి పూజ శాంతిపరిహారాలు చేసుకోండి.
3.గంగాధరరరావు, హైదరాబాదు, వ్యాపారం
మీరు వ్యాపారం చేసుకోవడం మంచిదే.
4.గంటి సుబ్బారాయుడు, నాయుడుపేట, వివాహం
మీకు జాతకంలో ఎలాంటి దోషాలు లేవు. మీకు వివాహానికి మంచికాలం నడుస్తుంది. ప్రయత్నించండి. మంచి ఫలితాన్నిపొందుతారు.
5.రమేష్‌గుప్త, పుట్టిన చోటు రాయలేదు, ఉద్యోగం
మీకు వచ్చేఏడాది ఫిబ్రవరిలో గ్రహాలపీడ తగ్గుతుంది. ఆ తర్వాత ప్రమోషన్ వస్తుంది. ఆలోపు ఉన్నా అది ఇబ్బందికారకమై ఉంటుంది.
6. వినోద్‌కుమార్ యలమర్ల, రత్నధారణ
మీరు మీజాతకాన్ని బెట్టి వజ్రం, పగడం ధరించవచ్చు.
7. శివరామకృష్ణ, కోటగిరి, స్వగృహం
మీకు జాతకరీత్యా స్వగృహంపొందే అవకాశం ఉంది.

8.నమ్రత దేవి, బొల్లారం, వివాహం
మీకు మాంగళ్యదోషం లేదు, సంతాన దోషమూలేదు. ఇతరుల చెప్పుడు మాటలు వినకండి.కళ్యాణమస్తు.
9.సంజీవని చల్ల, పుట్టిన చొటు రాయలేదు
వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలం ఉందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
10.యాదగిరి, వీధిపోటు
వీధిపోటు ఇంటికేకానీ వ్యాపారానికుండదు. అలాఉంటే అడ్డంగా చెట్లుపెంచడం, గోడకట్టి ఎర్రరంగు వేయడం, వినాయక విగ్రహం పెట్టడం వంటివి చేయాలి.
11. జగన్ కుమార్, వేములవాడ, ద్వితీయ వివాహం
మీకు ఇప్పటికే వివాహం విడాకులైందంటున్నారు కనుక ఈసారి కొంత జాతకాల్నిపరిశీలించుకొని చేసుకోండి. మంచి జరుగుతుంది. కుజ,శనులకి పరిహారాలు చేసుకోండి.
12. ఉదయభాను, కెరియర్
భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
13.చంద్రమౌళీశ్వర్, శ్రీశైలం
మీరిచ్చిన వివరాలననుసరించి తూర్పు, దక్షిణాలు మంచివి మిగిలిన దిక్కులు మంచివి కావు.
14. హరితేజ, కుమారునికి పేరు
మఖనక్షత్రాన్ననుసరించి మ అనే అక్షరం సరిసంఖ్యలో పేరు పెట్టుకోండి.
15. సంజీవకుమార్, కెరియర్, సంతానం
మీరిద్దరి వివరాలుంటే తప్ప సంతానంగురించి చెప్పలేం. ఇక కెరియర్ గురించి అడిగారు. అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications