పెళ్లికి ఆటంకమా: జ్యోతిషం ఏమంటోంది?

1.వినోద్‌ కుమార్‌, నిజామాబాద్‌, వృత్తా? ఉద్యోగమా?

మీకు 2012లో ధననష్టానికి ఇబ్బందులకి ఏలినాటి శని కారణం. ఇప్పుడు ఏలిన్నాటి శనితో సమస్య తీరింది. కానీ గోచారం బాగా లేదు. 2016 మార్చినుంచి కొంత మెరుగవుతుంది. కానీ జాతకంలోనే వృత్తిస్థానంలో 8వ అధిపతి చంద్రుడుండటం సమస్య సూర్యచంద్రబుధ గ్రహాలకు పరిహారాలు చేసుకొని దానాలు ప్రతీవారం చేస్తూనే ఉండాలి.

2.ప్రశాంత్‌.యస్‌.ఆర్‌, వృత్తి, సంతానం

మేము ప్రతీ జాతకాన్ని స్పష్టంగా పరిశీలించి మాత్రమే నిర్ధారణకి వచ్చి సమాధానం అందిస్తాం. మీరు అడిగిన రెండు ప్రశ్నలకి.పుట్టిన సమయం, చోటు రాయాలి.

3.చెన్నకేశవరావు తుమ్మల, గన్నవరం, వివాహం

మీది కర్కాటక లగ్నం, మృగశిర నక్షత్రం, మిథునరాశీ. మీ జాతంలో వివాహ ఆటంకాలు కలిగించే పరిస్థితులున్నాయి. ముందు వాటని దిద్దుకొని ప్రయత్నించండి. శని కేతువు నక్షత్రంపై ఉండి 7వ భావాధిపతి కావడం. 2లో కేతువుండటం. వక్రగురుని చేత 7వభావం చూడబడటం ఇవన్నీ ఆటంకాలే. ముందు వీటికి పరిహారాలు చేసుకోండి. పరిహారాలు చేసుకొని దానాలు వివాహం అయ్యేదాకా ప్రతీవారం చేస్తూనే ఉండాలి. మీకిప్పుడు గురుబలం ఉంది. ఆగస్టు దాకా ప్రయత్నించండి.

4.వెంకటేశ్వర్లు, పుట్టిన చోటు రాయలేదు. ఉద్యోగం, విదేశం.

మేము ప్రతీ జాతకాన్ని స్పష్టంగా పరిశీలించి మాత్రమే నిర్ధారణకి వచ్చిసమాధానం అందిస్తాం. మీరు అడిగిన రెండు ప్రశ్నలకి పుట్టిన సమయం, చోటురాయాలి.

5. గోవిందర్‌రెడ్డి, ప్రమోషన్‌

మీకు వచ్చే నెలనుండి 6నెలల కాలం అంతా ప్రమోషన్‌కి అనుకూలత కాలం నడుస్తుంది.

6. హరిసింగ్‌, బొలారం, కెరియర్‌

భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాలా విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

7.ఇస్మాయిల్‌, పేరు మార్పిడి.

పేరుమార్పుచేసినంత మాత్రాన జీవితాలు మారవు. మన లోపాలు మనశక్తి తెలుసుకొని ప్రవర్తిస్తే అన్నీ మారుతాయి.

Ask your astrologer: He will advise

8. దేవిక , సికింద్రాబాద్‌, వివాహం

మీకు జాతకంలో మాంగల్య దోషామే కాదు ఏ దోషమూ లేదు. అనవసరంగా మీరు అందరి మాటలు వినకండి.

9.ప్రియదర్శిని గజవాడ ,కుమారుని పేరు

అనూరాధన నక్షత్రం ఐంది కనుక (న) అనే అక్షరం పైన పేరు పెట్టుకోవాలి.

10. సూర్యనారాయణ శర్మ, కైరియర్‌.

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం. అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

11. శ్రీనివాస్‌, నిజామాబద్‌, ప్రభుత్వ ఉద్యోగం

మీకు జాతకరీత్యా ప్రభుత్వోద్యోగం రావడానికి అవకాశం ఉంది.

12.సుమన్‌ మూర్తి, ముహూర్తాలు

అక్టోబర్‌ వరకూ ముహూర్తాలు లేవు. మీరు గృహప్రవేశాలు చేయడం మంచిది కాదు.

13.నరసింహాచారి, మరణసూతకం

ఏటి సూతకం పాటించి తీరాలి. ఆ సంవత్సరంలో గుడులకు వెళ్లకూడదంటే దానర్థం. పెద్దలకి ప్రీతిగా దానాలు చేయాలని అర్థం.

14. విశ్వనాథ్‌, కుప్పం, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి గ్రహానుకూలత తక్కువగా ఉంది.

15.కె.వి.యం.శర్మ, ఒంగోలు, కెరియర్‌.

మీరు పుట్టిన వివరాలు ఇవ్వలేదు ప్రశ్న ,అంతగా అర్థం కాకుండా రాస్తే ఎలా?

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+