పాఠకుల సందేహాలకు జ్యోతిష్కుడి జవాబులు

1. వనిత ముధిగులం, (భర్త రవికాంత్‌ ఉద్యోగం గురించి) పుంగనూర్‌

దశమంలో కేతువు వల్ల సామాన్య రాబడి ఉంటుంది, కానీ బుధ శుక్రులు, 8వ అధిపతి రవితో కలిసున్నాడు. నవాంశలో వుఋత్తి కారకుడు బాగున్నాడు, 2017 - 18 లో ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది. రవికి దానాలు చేస్తూండాలి. శ్రీరాజమాతంగ్యై నమ: అనే మంత్రం జపిస్తూ ఉండండి.

2. మస్తాన్‌ రెడ్డి నంది, 26-07-1979 విదేశ గమనం.

పుట్టిన సమయం ఇవ్వండి, లేదా నక్షత్రం పంపండి.

3. పూజిత, ప్రభుత్వ ఉద్యోగం, ప్రేమ వివాహమేనా ?

పుట్టిన సమయం ఇవ్వండి, లేదా నక్షత్రం పంపండి.

4. శ్రావణి, వివాహం, ఉద్యోగం

జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి. పుట్టిన సమయం, చోటు రాయండి, ప్రశ్నలలో స్పష్టంగా ఒక అంశాన్ని అడగండి,

5. వై. రాజేష్‌, ఉద్యోగం

పుట్టిన చోటు, సమయం పంపండి, ప్రశ్న తెలుగులో పంపండి.

6. మదన పల్లి సతిష్‌ కుమార్‌ రెడ్డి, రామాపురం, ప్రభుత్వ ఉద్యోగం

ప్రభుత్వోద్యోగం ఒక్కటే కాదు వృత్తి పరంగా ఏది చేసినా మంచిగా సాధిస్తారు మీరు . వృత్తి కారకుడు శని నవాంశలో వర్గో త్తమలో ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి చాలా ఆటంకాలు ఉన్నాయి, ఐతే సాధిస్తారు దానం జపం చేస్తూండండి. గురు, కుజ, శుక్ర గ్రహాలకి దానాలు చేస్తూండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూండండి.

7. వడ్డి బాలచంద్రం, అనంతపురం, ప్రేమవివాహం అవుతుందా ?

ప్రేమ వివాహానికి అవకాశం చాలా చాలా తక్కువగా ఉంది, ఒకవేళ ప్రేమ జరిగినా ప్రేమ వివాహం జరగదు.

 Ask your astrologer: he will answer

8. సి.హెచ్‌. నరేష్‌, మహబూబ్‌ నగర్‌, గవర్న మెంట్‌ జాబ్‌

పుట్టిన వివరాలు పూర్తిగా ఇవ్వలేదు.

9. పితానీ రుద్ర వీర నాగ ప్రసాద్‌, రాజోలు, ప్రభుత్వోద్యోగం, ఆర్థిక స్థితి

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది, కానీ రవి ఉచ్ఛలో ఉన్నాడు. ప్రయత్నించండి ఫలించవచ్చు. ఇప్పుడు వృత్తి కారకుని దశ నడుస్తుంది. మరొక రెండు సంవత్సరాలు ప్రయత్నించండి. వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా స్థిరత్వానికి మంచి సమయం ఇదే. కుజ, శని, చంద్రులకి దానాలు పరిహారాలు చేసుకోండి. మరకతం ధరంచండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

10. యాదగిరి, కొమురవెళ్లి. ప్రేమ వివాహం అవుతుందా ?

మీకు ప్రేమ వివాహం అవుతుంది.

11. మొగిలి శెట్టి చిరంజీవి, ఒంగోల్‌, సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌.

సమయం రాయలేదు .

12. ఆర్‌.పి. సుమ శర్మ, హైదరాబాద్‌, అమెరికా వెళతానా ?

మీకు అమెరికాకి వెళ్లే అవకాశం ఉంది.

13. తొగరు రంజిత్‌ రెడ్డి, కరీం నగర్‌, ఫెళ్లి ఏ సంవత్సరంలో ?

మీకు 7వ దశాధిపతి బుధుడి దశే నడుస్తుంది కానీ, రాహువు అంతర్దశ నడుస్తుంది. శని,శుక్ర, రాహు గ్రహాల దుష్ప్రభావం ఎక్కువగా ఉంది. 2017 ఏప్రిల్‌ దాటాలి. ఈ గ్రహాలకి దానాలు చేస్తూ మేం వివాహానికి ఇచ్చిన శ్లోకం చదువుతూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

14. నరసింహ శెట్టి, కెరియర్‌.

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

15. వర్మ రాజేందర్‌, కొత్త పల్లె ,

ప్రశ్న అడగలేదు. పుట్టిన సమయం చెప్పలేదు.

సందేహాలకు సమాధానాలు: పాఠకులకు విన్నపం

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+