మీ ప్రశ్నలకు జ్యోతిష్కుడి జవాబులు: చదవండి
1. గోపీకృష్ణ కెపిసి, పశ్చిమగోదావరి ఆర్థిక ఇబ్బందులు
కేతువు దుష్ప్రభావం తప్ప అంతా బాగుంది తప్పకుండా మీరు మంచి వృద్ధి పొందుతారు.
2. సీతారాముడు, కృష్ణా జిల్లా, ఉద్యోగస్థితి.
మీ జాతకంలో ఉద్యోగ కారకుడు శుక్రుడు 8లో ఉన్నాడు కేతువు నక్షత్రం మీద ఉన్నాడు. 2017 వరకు నడుస్తుంది. అదీ 8వ అధిపతితో కలిసున్నాడు. 3లో కేతువు, ఉన్నాడు. నవాంశలో వ్యయంలో న్నాడు. సర్వాష్టకవర్గులో 30 గుణాలతో ఉద్యోగ భావం ఉన్నా గోచార శని బలహీన పడ్డాడు. మొత్తానికి శని కేతువుల అనుకూలత లేదు . ప్రస్తుతం పరిస్థితి మరో ఏడాదివరకూ బాగాలేదు . సూర్యుడి 8వ స్థితి,శని స్థితిలు మాటవిలువ తగ్గటం అవమానం అపనింద, స్థానభ్రంశం సూచిస్తున్నాయి. ఇప్పుడున్న స్థితి మీకు ఇబ్బందుల్నే ఇస్తుంది. ఐతే ఈ గ్రహాలకి శాంతి దాన పరిహారాలు చేసుకోండి. శ్రీరాజమాతంగ్యై నమ: అనే మంత్రం జపించాలి. ఆపదాం అపహర్తారం....శ్లోకం చదువుతూ ఉండండి చాలా వరకు ఇబ్బందులు తగ్గి, సఖ్యత కలుగుతుంది
3. విశ్వనాథ్. కాకినాడ ప్రభుత్వోద్యోగం
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశమ లేదు.
4. చిరంజీవి, రంగారెడ్డిఆర్థిక స్థితి
మీకు గోచార శని బాగాలేదు, జాతకంలో శని వ్యయాధిపతితో కలిసున్నాడు, 8వ అధిపతి గురుడి దశలో శని అంతర్దశా ఫలితంగా కొంత సమస్యా యుతంగా ఉంటుంది, గురు,కుజ,శని గ్రహాలకి దానాలు శాంతి పరిహారాలు చేసుకుంటూండండి. అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
5. సూర్య నారాయణ, హైదరాబాద్, విదేశం
విదేశాలకి అవకాశం మీకు జాతకరీత్యా లేదు.
6. శ్రీనివాసు.చోటు రాయలేదు, ప్రేమవివాహం
మీకు ప్రేమ వివాహం జరుగుతుంది.

7. బిట్టు, ధర్మ పురి, వివాహం
8వఅధిపతి చంద్రుడు, రాహువునక్షత్రంమీద 7లో ఉన్నాడు. ఇది వివాహసమస్య కారకం. ఆలస్యం, దాంపత్యంలో గొడవలు, వంటివి ఉంటాయి.
8.నారాయణ, సికింద్రాబాదు, ఉద్యోగం
ఉద్యోగ కారకుడు బుధుడు 2లో ఉన్నాడు రాహువు నక్షత్రం మీద ఉన్నాడు. 9లో కేతువున్నాడు. ఐతే ఇది కొంత లాభాన్ని కలిగించేలా 9వ అధిపతి రవితో కలిసున్నాడు. గోచారంలో గ్రహబలం బాగుంది, పైన చెప్పిన గ్రహాలకి శాంతి పరిహారాలు చేసుకుంటూ ప్రయత్నించండి. అంటే ఏం చేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
9. జగదీష్, అమెరికా, ధనం కావాలంటే ఏంఏయాలి
కనక ధారాస్తోత్రం, లక్ష్మీ నామావళి చదువుతూ ఉండండి.
10. శ్రీనివాసు, తిరుపతి, కుమార్తెకి ఏ పెరు పెట్టాలి?
న అనె అక్షరంతో బేసి సంఖ్యలో పేరు పెట్టుకోవాలి.
11. ఏవివరాలు ఇవ్వకుండా ఉద్యోగం గురించి ప్రశ్న అడిగినవారు
ఇరివెంటి రాఘవేందర్
తిరుమాల్ పులి
ఇందూరు స్వప్న
కన్ప్యూజన్
సింగిటి నరేందర్, భీమ్‌గల్
సురేష్ రెడ్డి, సమయం సరిగ్గారాయలేదు
12. కెరియర్ గురించి / భవిష్యత్తుని గురించి రపశ్నలడిగినవారు
మహేంద్ర కోరిమ్, 2-6-2001
శ్రీనివాసు గర్నేడి, 27-12-1980
సిద్ధార్థ గుర్రం, 24.07.1991
గెద్ద అనిల్ కుమార్ 24-06-1995
కామర్తి రమేష్-15.09.198
సబాస్టియన్. ఏ 06/02/2009
బస అశోక్ కుమార్ 05-11-1988
మా వెబ్ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని, సూచనలు చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications