జ్యోతిషం ఏమంటోంది: రెండో పెళ్లి సమస్యనా?

1. కాపకాయల జ్యోతి, పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం, ఉద్యోగం

ముందు మీకు వృత్తికారకుడు కుజుడు 2లో శనితో కలిసున్నాడు. గోచారం బాలేదు. వచ్చేసెప్టెంబర్‌ తర్వాత కొంత బాగవుతుంది. పైన చెప్పిన గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి, అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం .శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూండండి.

2. శివకుమార్‌, 18-2-1992, పుట్టిన సమయం చోటు ఇవ్వలేదు,

పేరుని బట్టి చెప్పాలంటే టీచింగ్‌ వంటివి, మేనేజ్‌ వంటివి మంచిది.

3. ఉదయ్‌కుమార్‌ రాయబారపు, ద్వితీయ వివాహంలో సమస్యలు

మీకు 7వ అధిపతి చంద్రుడు 8వఅధిపతైన రవినక్షత్రం మీద 9వభావంలో ఉన్నాడు. ఇది కొంత సమస్యాకరం. గోచారమూ అంత బాగాలేదు. మీరు కొంత అర్థంచేసుకోవాలి, మరికొంత పై గ్రహాలకి దానం చేసుకోవాలి.

4. దామెర్ల పద్మజా రాణి

వచ్చేసంవత్సరం ఫిబ్రవరి వరకూ ఆగాలి. మీ జాతకంలో 5లో కేతువున్నాడు, వ్యయాధిపతి కుజుడు 2లో ఉన్నాడు, గోచారం అసలు బాగాలేదు. పైన చెప్పిన గ్రహాలకి దానాలు చేస్తూండాలి.

5. సురేంద్రబాబు తిప్పన, నెల్లిమర్ల

మీరు అడిగిన ప్రశ్నలో స్పష్టత లేదు. ముందు ఒక అంశంలో ఏం అడగాలో తేల్చుకోండి. అంటే ఉదాహరణకి వివాహం అన్నారు. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. ఇలాగ ఒక ప్రశ్న అడగండి. మా వెబ్‌ సైట్‌ సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు. ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాంగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

6. శ్రీనివవాస్‌, మిర్దొడ్డి, సినీరంగం ఎలా ఉంటుంది?

మీకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది, మీకు సినీరంగం ఉపయోగపడుతుంది కానీ అంతగా రాణించలేరు.

7. ఆల్లు మురళీధర్‌ రెడ్డి

ప్రశ్న రాయలేదు.

 Ask your astrologer: issue will be clarified

8. నరేష్‌ పొట్ల ,10/01/1991, నక్షత్రం, పుట్టినసమయం, చోటురాయలేదు

వివరాలు పంపితే జాతకం చూసి చెప్పగలం. కానీ పంపలేదు కనక దానాలుచేస్తూండండి, శ్రీ రాజమాతంగ్యైనమ: అని జపం చెస్తూండండి.

9. రవికుమార్‌, కుమార్తె మ్యారేజ్‌ మ్యాచింగ్‌

మీ కూతురు వివరాలు చూశాంయ మ్యాచింగ్ కలిసింది, మేం ఎవ్వరి వివరాలైనా రహస్యంగానే ఉంచుతాము, దానికి మీరు కంగారు పడవలసిన అవసరంలేదు.

10. సుష్మ,

వివరాలివ్వలేదు. పేరాలకొద్దీ ప్రశ్నలడిగారు. ఒకసారి కింద నియమాలు చదివి మీప్రశ్న పంపండి

11. సుంకు బ్రహ్మయ్య, నక్షత్రం, పుట్టినసమయం, చోటు రాయలేదు.

ఉద్యోగం, కోర్టు అని రాసారు ఆ విషయాలలో ఏం అడగదల్చుకున్నారో రాయలేదు. జవాబుల కింద సూచనలు పూర్తిగా చదివి పంపండి.

12. కిరణ్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

13. ఉదయ్‌ భాను, మహబూబ్‌ నగర్‌, వివాహం

మీకు మాంగల్యదోషం ఉంది కానీ కంగారువద్దు. కుజ, శనులకి దానాలు పరహారాలు చేసుకుంటే చాలు. అంటే ఏంచేయాలో కింద నవగ్రహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

14. జితేందర్‌, ఏరత్నం మంచిది

మీరు వివరాలివ్వలేదు కానీ మీ పేరుని బట్టి కెంపు ధరించవచ్చు.

15. శ్రీలత, ఆదిలాబాద్‌, ప్రభుత్వోద్యోగం

మీకు జాతకరిత్యా ప్రభుత్వోద్యోగానికి అవకాశం లేదు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+