జ్యోతిష్యుడి జవాబు: వివాహం అవుతుందా?
1. యామిని యంచర్ల , సూర్యాపేట,వివాహం
వివాహభావాధిపతి బలహీనపడ్డాడు,మీలగ్నమూబాగాలేదు వివాహం కుదరక పోవటంలో మీ పాత్రకూడా ఉంది, మాంగల్యదోషం కాదు కానీ మీది వివాహ బలహీనత ఉంది. రాహు, కుజ, రవి లకు దానపరిహారాలు చేసుకోండి, వివాహానికి ప్రత్యేక ప్రార్థనని చేస్తూండండి. అవన్నీ నవగ్రహాలపరిహారాలు అనే ఆర్టికల్‌లో అందించాం.
2.గంటి సోమరామశర్మ, తెనాలి, ట్రాన్స్‌ఫర్-
ఇప్పుడు మీకు ప్రయత్నం చేస్తే ట్రాన్స్‌ఫర్‌కి అవకాశం ఉంది.
3. ధర్మవీర్, నిజామాబాద్, వివాహం
మీకు వివాహభావం బాగుంది, కానీ ప్రస్తుతం కొంత సమయం పడుతుంది, మరొక సంవత్సరం తర్వాత వరకూ ఆగాలి, గురుడికి దానపరిహారాలు చేసుకోండి, వివాహానికి ప్రత్యేక ప్రార్థనని చేస్తూండండి. అవన్నీ నవగ్రహాలపరిహారాలు అనే ఆర్టికల్‌లో అందించాం.
4. బంటి,హైదరాబాద్, చదువు
మీకు ఇంజనీర్ చదివితే బాగానే ఉంటుంది, అందులోనూ అన్నీ కాదు సివిల్ వంటివాటికే మంచిది. మీరు ఏది చదివేదీ చెప్పలేదు, రాహు,కుజులకి దానాలు ఎక్కువగా చేస్తూనే ఉండాలి.
5. లాస్యప్రియ, విజయవాడ, కెరియర్
భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాలా విషయాలుంటాయి. పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
6. సీతారాం, సికింద్రాబాద్, వివాహం
కుజదోషం ఉంది, వివాహభావానికి సంబంధం ఉన్నది, కొంత సమస్య ఉంటుంది. 5వభావానికి కూడా ఉంది, సంతానదోషం కూడా ఉంది, కుజ, బుధ, శుక్రులకి పరిహారాలు దానాలు చేసుకోండి.
7.బద్రినాథ్, సికింద్రాబాద్, కుమారునికి పేరు
య అనే అక్షరంలో సరి సంఖ్యలో పేరుపెట్టుకోండి, మీ కుమారునికి బాలారిష్టదోషం ఉంది. చంద్ర, శనులకి దానాలు పరిహారాలు చేసుకోండి.

8. కౌశిక్‌వర్మ, యు.యస్,ఉద్యోగం
మీకు దశ బాగా నడవటం లేదు. శని,బుధులకి దానాలు చేస్తూండండి.
9. షర్మిల, విడాకులు
విడాకుల గురించి మేం చెప్పేదికాదు, మీరు మీ పెద్దలని సంప్రదించి అడగండి, మీకు మీరు ఆలోచించండి, జ్యోతిష్కున్ని అడిగితే విడిపోవడానికి మేం ఏంచేయగలం?
10. నరేందర్ గుట్ట, యలమంచిలి, ఉద్యోగం
మీకు ఉద్యోగం రాదు అనే మాటలేదు, ఖచ్చితంగా వస్తుంది కానీ మీసమస్య ఏంటో చెప్పలేదు, మీకు గోచారంలో ఏలినాటి శని నడుస్తున్నా దశ మంచిదే నడుస్తుంది. మీరు ప్రయత్నంచేయండి. కిందిస్థాయి నుంచి పైకొచ్చే ప్రయత్నం చేయండి.
11.అలీబాషా, కెరయర్
మా వెబ్ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు. ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచన ప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒకప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
12.ధనలక్ష్మి,,బీదర్, విదేశగమనం
మీకు విదేశగమనానికి అవకాశం ఉంది.
13.మహేశ్వరి, కుజదోషం అంటే ఏంటి.?
ఒక వ్యక్తి పుట్టినప్పటి జాతకచక్రంలో 1,2,4,7,8,10,12 భావాలలో ఉంటే దాన్ని కుజదోషం అంటారు.అది 7వ భావానికి సంబంధముంటేనే వివాహానికి ఇబ్బంది కలుగజేస్తాడు. వివాహపరంగా కుజదోషం ఒక అంశమే కానీ పెద్ద సమస్యకాదు.
14. విక్రమ్‌సింగ్, గోదావరిఖని, విదేశీగమనం
మీకు విదేశ గమనానికి అవకాశం లేదు
15.ఆర్.వి.నాగార్జున, వివాహం
మీరు వివాహం అని శీర్షిక పెట్టి వదిలేశారు. అందులో ఏంకావాలి?చెప్పలేదు. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి, కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications