జ్యోతిష్కుడి జవాబులు: పాపగ్రహాల దశ
1.నరసింహాచారి మేదిడ ,ఖమ్మం
సమయం1.30గా తీసుకున్నాం కానీ మీరు ఏయమ్‌నా పియమ్‌నా చెప్పలేదు ఏయమ్ గాతీసుకుని చెపుతున్నాం .మీకు సెప్టెంబర్ వరకు గ్రహస్థితి బాగాలేదు, అర్ధాష్టమ శనికి పరిహారం చేసుకోండి.
2.బొప్పన ఉదయభాస్కర్
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే ఏదైనా ఒక ప్రశ్న అడగండి.నియమావళి చదివి మీ ప్రశ్న పంపండి. భవిష్యత్తులో మీరు ఏం తెల్సుకోవాలనుకుంటున్నారో అడగండి.
3. శివల దేవిశ్రీ ,దేవరకొండ ,వివాహం
మీకు వివాహపరంగా ఏ దోషమూలేదు కానీ అనుకూల దశ నడవటంలేదు వచ్చే సంవత్సరం వివాహం
అవుతుంది.

4.బొగ్గల శశికుమార్
పుట్టిన సమయం,చోటు రాయలేదు .కానీ రాశని బట్టి గోచారంలో అష్టమ రాహువు ద్వితీయ కేతువు ఇబ్బందిదాయకులు వీరికి పరిహారం చెసుకోండి ఈ సంవత్సరాంతంలో మంచి ఫలితాన్నిపొందుతారు.
5. సాంబనాయుడు, గుంటూరు, వివాహం , భవిష్యత్తు
పదేపదే చెప్పేమాటలే మళ్లీ చెప్తున్నాం. దయచేసి నియమావళి చదివి మీ ప్రశ్న పంపండి. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు ఏం తెలుసుకోవాలి, `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇదివేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
6.శివరామకృష్ణ దేవినేని
ప్రశ్నఅడిగారు వివరాలు మరిచారు
7. అరుణ్ తేజ.డి వివాహం (ప్రేమవివాహమేనా)
మీ జాతకం వివరాల్లో పుట్టిన చోటు రాయలేదు. హైదరా
బాదుగా తీసుకుని చెపుతున్నాం. మీకు 5,7 అధిపతులు కలిసి 4లో ఉన్నారు ప్రేమవివాహానికి ఎక్కువ అవకాశాలున్నాయి కానీ కుటుంబంలో సమస్యలుంటాయి.
8.సుందరం ` కర్ణాటక ` ట్రాన్స్‌ఫర్
మీకు ఇప్పుడు ట్రాన్స్‌ఫర్‌కి మంచిసమయంకాదు ,మరొక సంవత్సరం నర ఆగాలి కుజ,శనులకు శాంతి పరిహారాలు చేసుకోండి.
9.మాచర్ల జగదీశ్ ,విజయనగరం నుంచి రాసారు
ఇన్ని ప్రశ్నలకు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వేదిక ఇదికాదు మీకు తెలిసిన జ్యోతిష్కున్ని
కలవండి. మీరెంతకాలం బతికేదీ మీ కుటుంబీకుల జీవితాలన్నీ చెప్పడానికి కుదరదు దానికిది వేదిక కాదు. పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని
లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
10. కరిచేటి లక్ష్మీనారాయణ, కొమ్మినేనివారిపాలెం, విదేశం
మీకు విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది కానీ ఏం పని మీద అనేది మీరు ఉద్యోగపరంగా చదువుపరంగా అని అడగలేదు.ఇక పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదికమాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
11. కె.చెంచుమనోహర్,వెంకటగిరి
కెరయర్ ఇలాంటి వివరాలు పూర్తిగా చెప్పడానికిది వేదిక కాదు. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
12. ఏవియస్ యన్ కె యస్ యన్ రాజు (రాజు దంతులూరి)
మీకు విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది.
13. సుమేధ ,నిజామాబాదు,వివాహం
మీకు 7,8 వ అధిపతులు 8లో ఉండటం మాంగళ్య దోషం అంటారు. దానికి పరిహారం చేసుకోండి సరిపోతుంది. అంతకు మించి మీ జాతకంలో గండాలేమీ లేవు .
14.అనూష చల్ల ,విజయవాడ,సంతానం
మీకు మీ భర్తకు సంతాన లోపాలు జాతకాల పరంగా లేవు. కానీ పాపగ్రహాల దశ నడుస్తుంది. వచ్చే జనవరి దాకా ఆగాలి.
15.కొమండూరి వేణు ,తూగో, విదేశం
మీకు విదేశగనానికి అవకాశం తక్కువగా ఉంది.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications