విదేశాలకు వెళ్లే చాన్స్ ఉందా?: జ్యోతిష్కుడి జవాబు

1.రవీంద్ర, మదనపల్లి నుండి వీరికుమార్తెకు పుత్రసంతానంగురించి అడిగారు.

రెండవసంతతి కొడుకా?కూతురా ? చెప్పడం చాలా కష్టమైన, ఎక్కువ సమయం తీసుకొనే పని, అలాంటివి చెప్పకూడదు కూడా. సుబ్రహ్మణ్యారాధన చేస్తూండండి, మంచి ఫలితాలు కనబడుతాయి.

2. గురివిరెడ్డి.యమ్‌, పులివెందుల, కెరియర్‌

మీరు ప్రస్తుతం బాగుంది అన్నారు, గత 6 సంవత్సరాలుగా ఇబ్బందులకు పాప గ్రహదశే కారణం, మీకు చంద్రునికి ప్రీతిగా బియ్యం (అన్నదానాల దగ్గర ఇవ్వాలి) పాలు, పెరుగు వంటివి వీలైన ప్రతీసారీ దానం చేయండి.

3.ఆచ్యుతరామారావు గోటేటి,పాలకొల్లు,కెరియర్‌

కెరియర్‌ని పూర్తిగా పరిశీలించి చెప్పబడదనే విషయం పదేపదే మీకు చెపుతున్నాం, ఉచితంగా చేసే సేవలాగా చెపుతున్నాం అంతేకానీ పూర్తిగా చెప్పాలంటే అందరికీ ఎలా చెప్పొచ్చు? ఏదైనా ఒకచిన్న సందేహం అడగండి, లేదా జ్యోతిష్కున్ని కలవాల్సిందే.

Ask your astrologer: Issues clarified

4. మాన్య (వీరి సోదరిమాధవీలత గారి విదేశగమనం గురించి అడిగారు)కర్నూల్‌.

మీ సోదరికి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఆగస్టు తర్వాత కొంత, 2016 ఫిబ్రవరి తర్వాత పూర్తి అనుకూలతలు వస్తాయి.

5.రామ్‌ (అంజిరెడ్డి,ఇమెయిల్‌) వినుకొండ,కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

6.సౌజన్య (వీరికుమారుని విదేశగమనం గురించి అడిగారు)

మీరు పుట్టిన సమయం ఇవ్వలేదు, నక్షత్రం కూడా రాయలేదు కనుక పేరుని బట్టి ప్రస్తుతం మీ గ్రహబలాలను చూస్తే 2016 లోపు మీ అబ్బాయికి విదేశాలకువెళ్లే గ్రహానుకూలత ఉంది.

7.షరీఫ్‌ఖాన్‌(పేరు రాయలేదు ఇమెయిల్‌ను బట్టి రాశాము)

జాతకరీత్యా చంద్రునికి పరిహారం చేసుకోవాలి. ఆగస్టు తర్వాత కొంత బాగుంటుంది కానీ 2016 ఫిబ్రవరి తర్వాత పూర్తి అనుకూలతలు వస్తాయి. మీకు ఏలినాటి శని ప్రభావం కొంత ఇబ్బంది పెట్టినా మంచి భవిష్యత్తు ఉంది. ఏలినాటి శనికి కూడా పరిహారం చేసుకోవాలి .శుభమస్తు.

8. యమ్‌.వై,డి.లత (పేరురాయలేదు ఇమెయిల్‌ను బట్టి రాసాము) వీరికుమార్తె ద్వితీయ వివాహం

మీ కుమార్తె జాతకంలో విడిపోయేంత స్థాయి దోషాలు లేవు,బహుష అబ్బాయి జాతకంలో ఉండవచ్చు ఐతే ఈసారి జాతకాలు చూసి చేసుకోండి. 2016 మార్చి తర్వాత మంచిదశ వస్తుంది. రాహువుకి ప్రతీవారం మినుప పిండి వంటలు దానం చేయిస్తూండండి. కారం వంటలు దానం చేయిస్తూండండి. కుజ రాహువులకు పరిహారం చేసుకోండి. శుభం జరుగుతుంది.

9. స్వాతి గుర్రం, మీరు పుట్టిన చోటు రాయలేదు, మ్యారేజ్‌ మ్యాచింగ్‌.

మీ ఇద్దరి పుట్టిన వివరాలూ ఇవ్వండి.

10.ప్రశాంత్‌ బొల్లిముంత, సికింద్రాబాదు, కుమారుని చదువు

మీ కుమారుని పుట్టిన వివరాలు పూర్తిగా ఇవ్వలేదు, కానీ నక్షత్రాన్ని బట్టి ఏల్నాటి శనివల్ల కొన్ని దుర్వ్యసనాల వల్ల కొంత ఏకాగ్రత పాడవుతుంది. రాహు, శనులకు దానాలు పరిహారాలు చేసుకోండి.

11.తిరుపతి,కరీంనగర్‌, విదేశగమనం

మీకు విదేశగమనానికి గ్రహానుకూలతలేదు కష్టంమీద కొంత ఫలిస్తుంది.

12. సత్యనారాయణ అల్లం, ఖమ్మం, సంతానం

మీ జాతకంలో సంతాన అనుకూలతలు తక్కువగా ఉన్నాయి, మీభార్య వివరాలు కూడా పంపండి. పరిశీలిస్తే పరిష్కారం చెప్పొచ్చు.

13. సుబ్రహ్మణ్యం (పుట్టిన చోటురాయలేదు)కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

14. మనోహర్‌ సింగ్‌, ఒరిస్సా, ఉద్యోగం

మీకు 2016 ఫిబ్రవరి దాటాక ఉద్యోగంలో అనుకూలతలు వస్తాయి. రాహువుకి అప్పటిదాకా దానాలు చేస్తుండండి.

15. కృష్ణ (పుట్టిన చోటురాయలేదు) వివాహం

మీకు 5,7 అధిపతులు 8లో ఉన్నారు, పాపగ్రహాల దృష్టి వల్లకొంత ఆలస్యమవుతుంది, అంతేకానీ మీకసలు కాదు అనే సమ్యలేదు. రాహు, కుజులకు దాన పరిహారాలు చేసుకోండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+