రెండో పెళ్లి ఇలా ఏమిటి?: జ్యోతిష్కుడి మాట
1.శ్రీహరి.పి 7204777226 ` వివాహం, ఉద్యోగం, విదేశం
మీకు విదేశ గమనానికి అవకాశం ఉంది,కానీ కొంత ఆలస్యంగా ఉంది.2017 లోపు మీరు వివాహం, ఉద్యోగం, విదేశ గమనంలో మంచిఫలితాలు పొందుతారు.జులైలోపు మీకు ఉద్యోగావకాశం ఉంది ప్రయత్నించండి.
2.రామారావు ` ప.గో ` వివాహం
మీకు కుజదోషం ఉంది కానీ అది మీరనుకున్నంత ప్రమాద కారిణికాదు.కుజుడికి పరిహారం చేసుకోండి.
3.రంగనాథ్ 8985762476 రాజమండ్రి
ద్వితీయవ వివాహజీవితం మీ జీవితంలో 7వభావాన్ని పాపగ్రహాలు చూడుట వల్లనేమో ఇబ్బంది కలిగింది. ఐతే ఒకసారి జరిగే దోషాన్ని తెలుసుకుని దిద్దుకోవాలి .కానీ ఆ జీవితానికి ఇద్దరిదీ చూడాలి. ఈవయసులో మీరు పరిపక్వంగా ఆలోచించుకోండి ,దానధర్మాలు పుణ్యకార్యాలు చేస్తూండండి అంతా మంచే జరుగుతుంది.
4.రాజ్.1233 మెయిల్ నుండి వచ్చింది (పేరు రాయలేదు)
మీరి ఇచ్చిన సమయంలో ఉదయమో సాయంత్రమో సరిగా రాయకుండా చెప్పడం చాలా కష్టం. దయచేసి వివరాలు స్పష్టంగా పంపండి.
5.మేరీ బాల ` దేవరకొండ `
మీకు కుజదోషం లేదు.దానివల్ల మీకు వచ్చే ఇబ్బందీలేదు.
6.రాజేష్ మేకల `
పుట్టిన సమయం ,చోటు,నక్షత్రం రాయలేదు (మీ పేరును బట్టి) ఇపుడు ఏలినాటిశని నడుస్తున్నది.కానీ గురుబలం ఉంది జూబ్‌లోపు మంచి ఫలితం పొందవచ్చు. శనికి ప్రీతిగా దానాలు పూజలు చేయించుకోండి.

7.నరేష్ రెడ్డి ` కుమార్తెకు పేరు `
మీరిచ్చిన వివరాలను బట్టి మీకుమార్తె జాతకంలో ఏదోషాలులేవు ,ఇక మేరు ప అనే అక్షరంతో పెట్టుకోండి. బేసి సంఖ్యలో ఉండాలి.
8. ఆరాధన పుట్ల ` కొత్తగూడెం ` చదువు
మీరు ఇంజనీరింగ్ వంటి చదువులు చదవితే మంచిదే అది మీకు యోగిస్తుంది.
9.అప్పారావు ` వ్యాపారారంభం `
మీకు ఈ నెలలో ప్రారంభంచేసుకోవచ్చు. మధుకర్ ,అనూష ల వివాహానికి ముహూర్తం. మీరిచ్చిన వివరాలప్రకారం 29,30 తేదీలు వీరి జాతకాలప్రకారం మంచి ముహూర్తకాలం. ఆసమయంలో వివాహం చేసుకోవచ్చు.
10.సుదర్శన్ ఎల్ల ` జగిత్యాల ` ఉద్యోగం
మీరకు ఉద్యోగస్థానం బాగానే ఉంది మీకువ్యక్తిత్వంలో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అన్నీ జాతకాలతో నే తీరవు తప్పక పెద్దల సూచనలుకూడా పాటించండి.
11.సర్వేశం ఎలమంచిలి ` కడప `విదేశ గమనం
మీకు ఈసంవత్సరం విదేశగమనానికి అవకాశం లేదు.వచ్చేరెండు సంవత్సరాలలో ప్రయత్నించండి.
12.సంపత్‌కుమార్ .హెచ్ ` జుబ్లిహిల్స్` వ్యాపారం
మీకు గోచారం బాగాలేదు మరొక సంవత్సరంలో బాగవుతుంది.రాహుకేతువులకు పరిహారం చేసుకోండి.
13.కుమారస్వామి ` దుబాయ్ `
కుమారుని భవిష్యత్ గురించి ఏవిషయంగా ఏం అడగదల్చుకున్నదీ చెప్పలేదు
14. హన్మంతరావు .బి ` విజయవాడ ` వివాహం
మీ జాతకంలో మాంగల్యదోషం ఉంది దానికి పరిహారం చేసుకోండి దానివల్ల సమస్యలుంటాయికాని ప్రమాదాలుండవు అధి గండంకాదు మీ మనసులోంచి ఆలోచన తీసేయండి.
15.రమణ ` కెరియర్ `
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.నియమావళి చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications