మీ ప్రశ్నలకు జ్యోతిష్కుడి జవాబులు ఇలా..

1.పరమశివయ్య ఆవుల,గుంటకల్‌,వివాహం

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి? కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా? స్పష్టంగా రాయండి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.నియమావళి చదివి మీ ప్రశ్న పంపండి.

2. విశ్వేశ్వరన్‌, తమిళనాడు, సమాచారం

మీ కుమారుని వివరాల ప్రకారం - పుట్టినపుడు బాలారిష్టమున్నది, 9లోరాహువున్నాడు. దానికి పరిహారం చేసుకోవాలి. వే అనే అక్షరంతో మొదలయ్యే సరి సంఖ్య గల పేరు పెట్టుకోండి.

3. హర్షవర్ధనరెడ్డి సందడి, మబ్బుచింతల కెయర్‌

కుటుంబం ఆరోగ్యం, సంపద వీటి గురించి మీకు సమస్యేంటో, ఏం అడగదల్చుకున్నారో చెప్పలేదు. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.నియమావళి చదివి మీ ప్రశ్న పంపండి.

4.అభిలాష్‌, పావని- వీరిసంతానం గురించి

పావనిగారి పుట్టిన సమయం ఇవ్వలేదు. ఉదయం 8గంటలుగా తీసుకుని చెపుతున్నాం. పావనికి 5వ అధిపతి రాహువుతో, అభీలాష్‌కి 5వ అధిపతి కేతువుతో కలిసున్నాడు. ప్రస్తుతం మీకు అనుకూల సమయమే నడుస్తుంది. రాహుకేతువులకు పరిహారం చేసుకోండి. సుబహ్మణ్యారాధన చేస్తూండండి.

Ask Your astrologer: Issues dealt april

5.సురేష్‌వర్మ బొల్లమట్టిని, కరీంనగర్‌, ప్రమోషన్‌

2016 ఫిబ్రవరిలో మీకు ప్రమోషన్‌ వస్తుంది లేదా వేరే ఉద్యోగంలోకి చేరతారు.

6.నరేంద్రకుమార్‌ గర్వాందుల, గోదావరిఖని, విదేశగమనం

మీకు విదేశాలకు వెళ్లె అవకాశం ఉంది. ఇక మీ కెరయర్‌ మొత్తం చెప్పడం కుదరదు. ఇది కేవలం ఏదైనా ఒక ప్రశ్నకుసూచనలిచ్చే వేదిక మాత్రమే.

7. రామకృష్ణ 1986,కెరియర్‌

మీరు పుట్టిన వివరాలు పూర్తిగా ఇవ్వలేదు. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

8.క.నాయుడు, చిత్తూరు, వివాహం

జాతకరీత్యా 7వ అధిపత పాపగ్రహంతో కలిసి 2లో ఉన్నాడు. 8 వఅధిపతి 7ను చూడటం వివాహానికి ఆటంక కారకాలు. 7లో పాపగ్రహం ఉంది. సూర్య, కుజ, శని, గురులకు పరిహారం చేసుకోండి.జులై తర్వాత గురుబలంతొ వివాహానుకూలతలిస్తుంది

9. ఆనంద్‌ గుండ,నాగార్జునసాగర్‌,ఉద్యోగం

2017లోమీకు మంచి ఉద్యోగం వస్తుంది. అప్పటివరకు దొరికిన దాంట్లోనే కష్టపడండి.

10. రామేశం, కాకినాడ, వాస్తుదోషం

వీధిపోటున్నచోట పెద్ద గోడకట్టి ఎరుపు రంగు వేయించాలి లేదా పెద్ద చెట్టుపెంచాలి. లేకపోతే నల్లరాతి గణపతి విగ్రహం స్థాపించాలి. అసలు మీది వీధి పోటోకాదో చూపించండి. తర్వాత తేల్చుకోండి, చెప్పుడు మాటలు వినకండి.

11. కృష్ణప్రసాద్‌, కెనడా, ప్రమోషన్‌

మీకు మరో రెండేళ్లవరకూ ప్రమోషన్‌ రావడం కష్టం,రాహువుకి పరిహారం చేసుకోండి.

12.రమేష్‌ బొమ్మిసెట్టి, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

13. సుధాదేవి పి,విజయవాడ,దాంపత్యసమస్య

మీకు కొంత ప్రతికూలదశ నడుస్తుంది కానీ మీభర్తజాతకవివరాలుకూడా పంపితే సరైన పరిష్కారం చెప్పొచ్చు.

14.గిరీశం,హైదరాబాద్‌,వ్యాపారం, మీకు
షేర్ల వ్యాపారాలకిది మంచికాలం కాదు.

15.సంజీవని,బొబ్బర్లంక,సంతానం

మీ జాతకంలో సంతాన దోషాలేమీలేవు, మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూండండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+