జ్యోతిషం: కుజ దోషం ఉందంటారా?

1.వెంకటరత్నకిషోర్‌, నున్న, ఉద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగావకాశాలు తక్కువగా ఉన్నాయి. ఐతే కంఫ్యూటర్‌ వంటి ఉద్యోగం మీకు వస్తుంది.

2.అజయ్‌ కుమార్‌, మందమర్రి, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగావకాశాలు ఉన్నాయి. ఐతే ఆటంకాలు ఆలస్యం అయ్యే అవకాశాలూ ఉన్నాయి. శని గ్రహానికి, కుజునికి పరిహారాలు దానాలు చేసుకుంటే మంచిది.

3.రమేష్‌ కృష్ణ, సూర్యాపేట, వివాహం

మీకు ఈ ఏడాది వివాహం జరుగుతుంది.

4. వి.ధనుంజయ, బెల్లరి, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగం దొరుకుతుంది. కంఫ్యూటర్‌ సంబంధ ఏ వృత్తైనా మీకు లాభదాయకంగానే ఉంటుంది.

5.నరేంద్రగుప్త, తమిళనాడు, జననదోషం

మీరిచ్చిన వివరాల ప్రకారం మీ కుమారునికి జనన కాలగండాలు దోషాలు లేవు.

6.రాకేష్‌ శర్మ ప్రఖ్య, సూర్యాపేట, విదేశగమనం

మీకు విదేశానికి వెళ్లే అవకాశం ఉంది, మరొక రెండేళ్లలో జరుగుతుంది. కాకపోతే గట్టిగా ప్రయత్నించండి.

Ask your astrologer: Issues will be clarified

7.లక్ష్మణ్‌రెడ్డి గోగిరెడ్డి, శీర్షవాడ,

భవిష్యత్తు గురించి సమస్యలన్నారు అవేంటో రాయలేదు. మా వెబ్ పత్రిక సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు. ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

8.కృష్ణమూర్తి, ఆమనగల్లు, స్వంత యిల్లు,

మీరు తప్పకుండా కొంటారు.

9.నాగేంద్ర, పుట్టిన చోటు, సమయం రాయలేదు

జాతకం పంపమన్నారు వివరాలివ్వకుండా ఎలా. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చినషరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

10.నాగేంద్రరెడ్డి, పెనుగొండ, ఉద్యోగం

ఏలినాటి శని నడుస్తుంది, అనుకూల సమయముంది. ఆగస్ట్‌ తర్వాత ప్రయత్నిస్తుండండి. పరిహారం అంటే ఏంచేయాలో నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

11. శ్రీనివాసరావు బందరు,పుట్టిన సమయం ఇవ్వలేదు. జగ్గయ్యపేట, కెరియర్‌, సెటిల్‌మెంట్‌

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

12.బుద్ధిరాజు శ్రీనివాసుగారు, వీరి కుమారుడు శ్రీహర్ష ఆరోగ్యం గురించి అడిగారు

మీ కుమారుని జాతకంలో రోగాధిపతి శని, 8వ అధిపతి కుజుని నక్షత్రంపై ఉన్నాడు. శనిలో రవి నడుస్తున్నాడు. శనికి, రవికి పరిహారం చేయండి,2018-19 మధలో రాహువుకి పరిహారం చేసుకోండి. వారానికోసారి శనికి ప్రీతిగా దానపరిహారాలు చేస్తూండండి. అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

13.హిమబిందు, బోయినపల్లి, కుజదోషం

మీకు కుజ దోషం లేదు.

14.రమేష్‌ గుప్త,కర్ణాటక

పేరాల కొద్దీ ప్రశ్నలడిగితే చదవడానికే సమయం పడుతుంది, ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

15.సూర్యనారాయణ శర్మ, కుమార్తె సంతానం గురించి

మీకుమార్తె తోపాటు అల్లుని జాతకం కూడా చూడాలి. వివరాలు పంపండి.

సందేహాలకు సమాధానాలు: పాఠకులకు విన్నపం

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+