జ్యోతిషం: అమావాస్యనాడు పుడితే దోషమా?

1. అనిల్‌కుమార్‌ సుదాబతుల, అమావాస్యనాడు పుడితే దోషమా?

అమావాస్యనాడు పుడితే జననదోషం అంతే దానికి చిన్న శాంతి చేసుకోవచ్చు, జననకాల దోషములు మీకు లేవు దాని గురించి ఆలోచన వదిలేయండి.

2.శ్రీహరిప్రసాద్‌, రేపల్లె, వివాహం, ఉద్యోగం

వాటిగురించి చెప్పమంటే అందులో చాలా ఉంటాయి. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు ( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు (ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

3.యం.రమణకుమార్‌, హైదరాబాద్‌,ఉద్యోగం.

మీకు అక్టోబర్‌ తర్వాత ఉద్యోగానుకూలత ఉంటుంది. మీకు గోచారంలో 7వశనివల్ల ప్రతికూలత ఎదురౌతుంది. శనికి పరిహారం చేసుకోండి.

Ask your astrologer: issues will be dealt

4.లక్ష్మీ ప్రసన్న, ఉద్యోగం, భవిష్యత్తు.

ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు(ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు మేం ప్రశ్నలడగానికి ఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

5.చింతపల్లిశ్రీనివాసు,గుంటూర్‌ ,ఉద్యోగం

8వ అధిపతి దశ నడుస్తుంది, గోచారం ఆగస్ట్‌ తర్వాత బాగవుతుంది. 2016 జూన్‌ తర్వాత కొంత మంచి ఫలితాలుంటాయి, శని,కేతువులకి దానపరిహారాలు చేస్తూండండి.

6. బందరు పాండురంగారావు, ప.గో, ప్రేమవివాహం

ప్రేమవివాహం గురించి సందేహముందన్నారు ఏం సందేహమో చెప్పలేదు. ఐతే మీ జీవితంలో ప్రేమ వివాహమౌతుందా లేదా అని అడగదల్చుకున్నారా? మరి అది అడగలేదు, ఏంకావాలో చెప్పలేదు, అది చెప్పాలన్నా మీరు పుట్టిన సమయం రాయలేదు.

7.శ్రీనివాస్‌ సుంకర, వెబ్‌సైటేవారికి అడిగిన సందేహం

మీరు మేం ప్రశ్నలడగానికి ఒక ఆర్టికల్‌ లో అందించాం. ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.మీరివ్వాల్సిన వివరాలుకూడా అందులోనే పొందు పరిచాం.

8.సత్యసేను(కిరణ్‌ కుమార్‌,సత్యవతిల గురించి)

మీరిచ్చిన అబ్బాయి, అమ్మాయి జాతకం చూసి మీ ఇద్దరికీ మ్యాచింగ్‌ అవుతుందో లేదో చెప్పొవ్చు. విడివిడిగా జాతకాలు చూసి ప్రేమవివాహమం అవుతుందో లేదో చెప్పలేం కానీ అదే వ్యక్తితో అవడాన్ని మేం చెప్పేదికాదు.
దానికీ మీరు వివరాలు సరిగ్గా పంపలేదు.

9. జయరాం బొడ్డెడ, విశాఖ పట్టణం, ప్రమోషన్‌

మీకు ఏల్నాటి శని దశ నడుస్తుంది దానికి పరిహారం చేసుకోండి. అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. ఆగస్ట్‌ తర్వాత ప్రయత్నించండి. శుభం.

10. మన్నె ప్రశాంత్‌ రెడ్డి, శ్రీకాకుళం, భవిష్యత్‌,వివాహం

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

11.ఆటపాక కేశవులు, నెల్లూర్‌, కెరియర్‌

భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.ముందు మేం ప్రశ్నలడగానికి ఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి.చదివి మీప్రశ్న పంపండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

12. యం.శ్రీనివాస్‌, అమలాపురం, ఇంటర్‌నెట్‌ వ్యాపారి.

మీరు పుట్టిన సమయం ఇవ్వలేదు గనక మీ నక్షత్రాన్ని బట్టి కొంత చెప్పొచ్చు, ఐతే మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి లేక మీదగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి. మీరిచ్చిన సింహ రాశి ప్రకారం 2016 తర్వాత కొంత బాగౌతుంది.రాహుకేతువులకి పరిహారాలు చేసుకొని దానాలు చేసుకోండి.

13. గంగిరెడ్డి. యన్‌,నాగబసమ్మ, మ్యారేజ్‌ మ్యాచింగ్‌, కడప

మీ జాతకాలు మ్యాచింగ్‌ కలిసింది. ఐతే ఇద్దరికీ సంతాన బలహీనత ఉన్నది. వీలైతే మానుకోవడం మంచిదని సలహా.

14. కారం శ్రవణ్‌, పుట్టిన సమయం, చోటు రాయలేదు.

వివరాలివ్వకుండా ఇవి చెప్పడంకుదరదు,కనీసం నక్షత్రం కూడాలేదు.

15.శ్రీనివాసరావు,శ్రీలక్ష్మి లదాంపత్యసమస్య ,తాడేపల్లిగూడెం

మీరేచెప్పారు దాంపత్యంలో అవగాహనాలోపం అని అన్నారు జాతకంలో కుడా చంద్రుడు 6,8 లల్లో ఉన్నారు ఒకరి వల్ల మరి ఒకరికి ఒకేరకమైన సమస్యలుంటాయి. నా సూచన ఒకటే మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకొని తేల్చుకోండి. ఒకరికోసం మరొకరు తగ్గండి. ప్రతీదానికి ప్రణాళిక వేసుకోండి. దాని ప్రకారం నడుచుకోండి. ‘ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం,భూయో భూయో నమామ్యహం' అనే శ్లోకం ఎక్కువసార్లు జపిస్తూండండి. సంపదలో 20 శాతం దానాలకి పుణ్యకార్యాలకి వాడండి. శుభం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+