ప్రేమ పెళ్లా, కాదా: జ్యోతిషం ఏం చెబుతోంది?

1.ఆర్‌.పాలకొండ్రాయుడు,కడప,కెరియర్‌

మీరు మీ భవిష్యత్‌, వివాహాల విషయంగా సమస్య ఏమిటో చెప్పలేదు. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీ ప్రశ్న పంపండి. ఇలాంటివి జ్యోతిష్కున్ని ప్రత్యక్షంగా అడగాలి.

2.హేమసుందర్‌ గూడూరు.

మీకు ప్రమోషన్‌కి సెప్టెంబర్‌ తర్వాత రావచ్చుదాటితే 2 సంవత్సరాలు ఆలస్యమవుతుంది. మీకు స్వంతిల్లు కూడా కష్టం మీద ఆలస్యంగా ఉంది. సమస్యలతో పొందుతారు.

3. వియస్‌యస్‌యన్‌ మూర్తి, పేదపట్నం, తూగో

మీరు ప్రశ్నని పేరాలకొద్దీ రాసారు. తెలుగులో కూడా రాయలేదు. మీ కుటుంబీకుల మొత్తం సభ్యుల వివరాలిచ్చి ప్రశ్నలడిగారు. అసలు మా వెబ్‌సైట్‌ద్వారా ఉచిత జ్యోతిష సూచనలు అందించడానికి అందరినీ సమన్వయ పరచుకోవాలి ఒకరి గురించే ఎక్కువ సేపు కేటాయించలేం. ప్రతీజాతకాన్ని పరిశీలించడం శ్రమతో కూడినది ఐనా మేము ఖచ్చితంగానే సేవలందిస్తున్నాము. ఇది ఎక్కువ మంది గురించి పూర్తి జాతకాన్ని గురించి చెప్పే వేదిక కాదు.లేదా మీకు తెలిసిన జ్యోతిష్కున్ని కలవండి.

4.కె రామకృష్ణ, మచిలీపట్ణం, వివాహం, ఆరోగ్యం

మీకు 8వ అధిపతి శని 7ని చూస్తున్నాడు, అందుకే ఆలస్యం జరుగుతుంది. శనికి ప్రీతిగా పనివారికి సహాయం చేయడం, సంపాదనలో 15 నుండి 20శాతం ధనాన్ని ధర్మాలకి పుణ్యకార్యాలకి ఖర్చుచేస్తూండండి. రాహువు 6లో ఉన్నాడు, గురుడు చూస్తున్నాడు వీటికి దానాలు పరుహారాలు చేస్తూండండి. క్రమంగా పరిస్థితులు మెరుగౌతాయి.

5.సాయికిరణ్‌ గండ్ల,

ఏ వివరాలూ ఇవ్వకుండా జాబ్‌ కోసం అన్నారు. అలా చెప్పడం సాధ్యం కాదు.

6. అనూష యల్లవుల, వివాహం, ఉద్యోగం

మీకు సెప్టెంబర్‌ తర్వాత వివాహ, ఉద్యోగాలకు అనుకూలత ఉంది, మీకు ప్రేమ వివాహంకన్నా అరేంజేడ్‌ మ్యారేజ్‌ అవడానికే అవకాశాలున్నాయి. మీకు 7వఅధిపతి 8లో ఉన్నాడు అదీ కుజుడు (మామగళ్యదోషం ) దీనికి శాంతి పూజ చేసుకోండి. కారం వస్తువులు, కందిపప్పు ప్రతీవారం దానం చేస్తూండాలి.

7. దాలి నాయుడు (రాజం,శ్రీకాకుళం)

మీరు ప్రశ్నని పేరాలకొద్దీ రాసారు. తెలుగులో కూడా రాయలేదు. నంబర్లకొద్దీ ప్రశ్నలడిగారు. అసలు మావెబ్‌సైట్‌ద్వారా ఉచిత జ్యోతిషసూచనలు అందించడానికి అందరినీ సమన్వయ పరచుకోవాలి ఒకరిగురించే ఎక్కువ సేపుకేటాయించలేం.ప్రతీజాతకాన్ని పరిశీలించడం శ్రమతోకూడినది. మీకు దగ్గరలో ఉన్న జ్యోతిష్కుడిని కలవండి.

Ask your astrologer: issues will be soved

8.రామ్‌ కుమార్‌ ,వివాహ ధర్మసందేహం (జ్యేష్ఠులు పెళ్లి చేసుకోవచ్చా)

వధువు జ్యేష్ట పుత్రిక `1
వరుడు జ్యేష్ఠ పుత్రుడు `1
వధువు జ్యేష్ఠనక్షత్రం కలవ్యక్తి `1
వరుడు జ్యేష్ఠ్ఠనక్షత్రం కలవ్యక్తి `1
పెళ్లి జరిగే మాసం జ్యేష్ఠమాసం `1
పెళ్లి జరిగే రోజు ` జ్యేష్ఠ నక్షత్రమున్న రోజు `1
ఇలాంటిక్రమంలో ఏరెండైనా కలవచ్చుకానీ 3కానీ ఆపైన రాకూడదు.(జ్యేష్ఠాత్రయం త్యజేత్‌)

అమ్మాయి అబ్బాయి జ్యేష్ఠులు కావచ్చు కానీ (వధువు కానీ వరుడుకానీ జ్యేష్ఠనక్షత్రం కల వ్యక్తి కాకూడదు, పెళ్లి జరిగే మాసం జ్యేష్ఠ మాసం కాకూడదు. పెళ్లి జరిగే రోజు జ్యేష్ఠ నక్షత్రమున్న రోజు కాకూడదు.

9. హరినాథరెడ్డి

పుట్టిన సమయం, చోటు రాయలేదు. నక్షత్రం కూడా రాయలేదు. మీరు నియమావళి చదవండి మీ పుట్టిన వివరాలు ఇస్తే తప్పక చెపుతాం.

10. ఓకార్‌ అల్లపర్తి, అవనిగడ్డ

ఒక ప్రశ్న అడగండి లేదా ఒక్కోటి విడివిడిగా మెయిల్‌ చేయండి.

11.రమణ ,విశాఖపట్నం

మీకు జాతకరీత్య వృత్తిస్థానంలో 8వఅధిపతి శనితో కలిసి ఉన్నాడు, ప్రస్తుతం గోచారంలో కేతువు పదిలో ఉన్నాడు, ముందీ గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండండి. శాంతి పరిహారాలు చేస్తూండండి. సెప్టెంబర్‌ నుండి మీకు మంచి సంయం ఉంది.శుభం

12. అవినాష్‌ పెనుగొండ, విజయనగరం, వివాహం

మీకు 7,8వ అధిపతి5లో ఉన్నాడు, ప్రేమవివాహానికి అవకాశం ఉంది కానీ ఆలస్యమో సమస్యలో నిందలో ఖచ్చితంగా వస్తాయి. కానీ మీరు శని చంద్రులకి పరిహారం చేసుకోండి. సెప్టెంబర్‌ తర్వాత వివాహ గ్రహబలం వస్తుంది.ఇక మీరిచ్చిన అమ్మాయి జాతకం చూసి మీ ఇద్దరికీ మ్యాచింగ్‌ అవుతుందో లేదో చెప్పొవ్చు కానీ అదే వ్యక్తితో ఎందుకవలేదు అనడానికి మేం చెప్పేది కాదు.

13. హుస్సేన్‌ వాలి

పుట్టిన సమయం, చోటురాయలేదు. నక్షత్రం కూడారాయలేదు. మీ ఇద్దరి వివరాలు సరిగా లేవు పేర్లపైన చూసి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేం కానీ దానధార్మాలు కొంతపీడ తగ్గిస్తాయి, ప్రశాంతతనిస్తాయి.

14. శ్రీమన్నారాయణ, గుడ్లూరు (ప్రకాశం), వివాహం, ఉద్యోగం

మీకు వివాహం, ఉద్యోగంలలో ఏ సమస్యలూలేవు, ఆగస్ట్‌తర్వాత మంచి ఉద్యోగానికి, వివాహానికి అనుకూలతా సమయం ఉంది ప్రయత్నించండి.శుభం.

15. పేరుమల్ల సురేష్‌

పుట్టిన చోటు రాయలేదు. కెరియర్‌ పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+