వివాహమా, రెండో వివాహమా: జ్యోతిష్కుడి మాట

1.కొండల్రావు ఏలూరి,నిడదవోలు,భవిష్యత్తు

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

2.సుష్మ,గుంటూరు,దాంపత్యం

మీ దాంపత్యంలో అవగాహనా లోపాలుంటే పెద్దలనడగాలి. మీ జాతకంలో మాకు ఏదోషం కనబడటం లేదు.మీ భర్త జాతకాన్ని కూడా పంపితే చూసి చెప్పగలం.

3. దంతు కిరణ్‌ (పుట్టిన తెది,సమయం రాయలేదు ,చోటురాయలేదు నక్షత్రం కూడారాయలేదు)

ఇక మీరిచ్చిన అమ్మాయి జాతకం చూసి మీ ఇద్దరికీ మ్యాచింగ్‌ అవుతుందో లేదో చెప్పొవ్చు కానీ అదే వ్యక్తితో వివాహం అయ్యేదీ లేనిదీ చెప్పడం కుదరదు.

4.సుబ్బారావు,ఇంటి దిక్కు

మీరిచ్చిన వివరాలప్రకారం తూర్పు దిక్కు పనికిరాదు. ఉత్తరం మంచిది.

5.అనిలచంద్ర,బొబ్బిలి (పుట్టిన,సమయం రాయలేదు ,చోటురాయలేదు నక్షత్రం కూడారాయలేదు)

ఉద్యోగం గురించి చెప్పగలం. కానీ పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే .ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

6.మల్లెల రమ,అమెరికా,కుజదోషం

మీకు కుజ దోషం లేదు. కుజదోషం వల్ల వివాహం కాదు అనే ఆలోచన ముందు తీసేయండి. మూర్ఖులీనాడు ఏదొ తెలిసినట్టుగా భయపెడుతుండండి. మంచి వివాహం, చక్కని దాంపత్య జీవితాన్ని పొందుతారు కళ్యాణమస్తు.

7. పొట్రు వేంకట కృష్ణమోహనరావు, కొమ్మిరెడ్డి పల్లి, ప్రభుత్వోద్యోగం

మీరు సమయం కూడా ఇస్తే చెప్పేవాళ్లం.

Ask Your astrologer: Know your future prospects
8.గోపాల్‌ రెడ్డి, కడప, వివాహం

మీకు 2018లో వివాహం జరగడానికి గ్రహానుకూలత ఉంది. మీరు శనికి పరిహారం చేసుకోండి.

9.చంద్రకాంత్‌ మేరుగోజు, చేర్యాల (వరంగల్‌)

మీరు పుట్టి నసమయం రాయలేదు. జాతక పరిశీలన కుదరదు. కనీసం ఇప్పుడెలా ఉందో చెపుదామన్నా చిత్త నక్షత్రం ఇచ్చారు. చిత్త కన్యలో సగంతులలో సగం ఉంటుంది. ఏ రాశి తీసుకోవాలి. ఎన్నవ పాదమో చెపితేచెప్పొచు. ఇది సేవగా గుర్తించండి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
10.దేవరాణి అల్లెల, అనంతపురం, ఉన్నతవిద్య

మీకెలాంటి అడ్డంకు లేకుండా మీరు ఈసారి పరీక్షలో పాసవుతారు. హయగ్రీవ జపం చేస్తుండండి.

11.శ్రీధర్‌బాబు

జ్యోతిష్కుడి సెల్‌ నంబర్‌ అడిగారు. మీరు మీకు నమ్మకస్తుడైన జ్యోతిష్కున్ని లేదా దగ్గర్లోన్ని ప్రత్యక్షంగా కలవండి. మీకు ఒక్కరికిచ్చినా ప్రచారం చేసినా వచ్చే ఇబ్బందిని సహృదయంతో అర్థం చేసుకోండి. ఇవ్వడం కుదరదు.

12. వీరవేంకట మణి ప్రసాద్‌, కంచకచర్ల, మాంగళ్యదోషం

మీరనుకున్నట్టు ఈ దోషం మగవాళ్లకీ ఉంటుది, అంతమాత్రాన 2వ వివాహం అవుతుందనో, అసలు వివాహమే కాదనో దీని అర్థంకాదు. మీరు కుజదోషానికి పరిహారం చేసుకుంటే చాలు.

13.ప్రతాప్‌ కుమార్‌ నున్న, సికింద్రాబాద్‌, సంతానం

మీవరకు సంతాన విషయంలో బుధప్రభావం దోషం ఉంది .కానీ మీ జీవితభాగస్వామి జాతకం కూడా చూడాలి. దాన్ని బట్టి మీ జాతకంలోని దోషం కొంత పరిహరింపబడుతుంది.
14.నరేష్‌, కెరియర్‌

పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి. మమ్మల్ని ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

15.సంతోష్‌గౌడ్‌, కరోంనగర్‌, పేరు

మీరిచ్చిన వివరాల ప్రకారం ఏప్రిల్‌ 14,2015 ఉదయం 8.30 పుట్టిన వ్యక్తికి ధనిష్ఠ నక్షత్రం ఐంది. గ అనే అక్షరంతో మొదలయ్యే సరి సంఖ్యలో పేరు పెట్టుకోండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+