జ్యోతిషం: ఆ వివాహం వద్దంటారా?

1.షేక్‌ మహబూబ్‌ వలి, ప్రభుత్వోద్యోగం

పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం, మీకు ప్రభుత్వోద్యోగంకు గ్రహానుకూలత లేదు.

2. పాముల కిరణ్‌కుమార్‌

పుట్టిన సమయం,చోటుపంపండి. నియమాలు చదివి పంపండి.

3. పమిడి శివశంకర్‌, గుంటూర్‌, ప్రేమవివాహం

మీకు ప్రేమవివాహం అయ్యే అవకాశాలున్నాయి, కానీ ఆ అమ్మాయేనోకాదో చెప్పలేం.

4. శ్రీనివాస్‌ రెడ్డి బి,

వివరాలు ఇవ్వకుండా, ప్రశ్నల మీద ప్రశ్నలడుగుతున్నారు. నియమాలు చదివిపంపండి.

5.యస్‌.సిరీష్‌ కుమార్‌, కర్ణాటక, కుజదోషం

మీకు కుజదోషం ఉంది. దానికి దానం చెస్తూండండి సరిపోతుంది. అవన్నీ నవగ్రహ పరిహారాలు అనే ఒక ఆర్టికల్‌ లో విడిగా అందించాం.

6. కండ్రేగుల రాము,

పుట్టిన వివరాలివ్వలేదు కానీ నక్షత్రాలు 2ఇచ్చారు ఒక్కోటి ఒక్కోరాశలోది సరిగ్గా పంపండి. నియమాలు చదివిపంపండి.

7.సోనయా షేక్‌, కడప, వివాహం

మీకు 8వ అధిపతి కుజుడు2లో ఉన్నాడు,1లో కేతువు , 7లో రాహువు ,7వఅధిపతి కూడా బలహీనపడ్డాడు, నవాంశ కూడా బాగాలేదు, మరో సంవత్సరం తర్వాత గ్రహానుకూలత వివాహానికి ఉంది, పైగ్రహాలకి శాంతి పరహారాలుచేస్తూ, దానాలిస్తూ, వివాహానికి చెప్పిన జపం చేస్తూండండి. అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

Ask Your Astrologer: Marraige and other problems addresed

8.కొండ రాము, చిత్తూరు, వివాహం, కెరియర్‌

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

9.హరిప్రసాద్‌ వర్మ, భీమవరం, ఉద్యోగంలో సమస్య

మీకు శని బాగా లేనందున తోటివారి అసూయ నింద పొందుతారు, మాట విలువ తగ్గటం వంటివి జరుగుతాయి, ఐతే 2016 ఫిబ్రవరి తర్వాత కొంత మెరుగవుతుంది.

10. యం.రామేశ్వరరెడ్డి,

పుట్టిన చోటు, సమయం రాయలేదు, విదేశానికి ఖచ్చితంగా వివరాలుకావాలి, వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

11. హరిప్రియ, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసునిచెపుతున్నాం, ప్రేమవివాహం

ప్రేమ వివాహం గ్రహాలేమీ అనుకూలత లేదు. మరోమాట 7వఅధిపతి (వివాహకారకుడు) గురుడు రాహువుతో కలిసి ఉన్నాడు వివాహాలస్యానికి, వైవాహిక సమస్యలకి కారణమవుతాడు, పైగ్రహాలకు శాంతి పరహారాలుచేస్తూ, దానాలిస్తూ, వివాహానికి చెప్పిన జపం చేస్తూండండి. అంటే ఏం చేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

12. సుబ్బుగోగినేని,

ఫోన్‌ నెంబర్‌ అంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కుదరదు, మీ ప్రశ్న, వివరాలతో పాటు మీఫోన్‌ నెంబర్‌ పంపితే అవసరాన్నిబట్టి మేం సమాచారమిస్తాం.

13.రామకృష్ణ ,చామకుర్తి,ప్రేమవివాహం

మీకు ప్రేమవివాహానికి అవకాశం ఉంది కానీ, కాకుండా ప్రతికూలతలున్నాయి.ఇక మీరనుకున్న అమ్మాయినే చేసుకుంటారా లేదా మేం చెప్పేది కాదు.

14. మధుసూదన్‌, కరీంనగర్‌, ఉద్యోగం

మీకు ఉద్యోగస్థానం బాగాలేదు, చేసిన పని కొంతలో జారిపోయే అవకాశాలున్నాయి, జాగ్రత్తపడాలి, ప్రస్తుతం మీకు ఉద్యోగానికి ఆనుకూల సమయమే ఉంది.

15. హేమలతాదేవి (రాజమండ్రి), కె వెంకటేష్‌ రెడ్డి(తూ.గో)ల మ్యారేజ్‌ మ్యాచింగ్‌

వీరిద్దరి వివాహం పొంతన కుదిరింది కానీ అమ్మాయికి సంతాన కారకుడు శుక్రుడు, వివాహకారకుడు చంద్రుడు రాహువుతోకలిసి 7లో ఉన్నాడు, అబ్బాయికి 5లో రాహువు, వివాహ భావంపై అష్టమాదిపతి ప్రభావం ఉన్నాయి, ఇద్దరికీ మాంగల్య దోషాలున్నాయి, ఇద్దరికీ సంతానదోషాలున్నాయి, వివాహం చేయకపోవడం మంచిది, ఆ దోషంపోవడానికి పైగ్రహాలకి శాంతి పరహారాలు చేస్తూ, దానాలిస్తూ, వివాహానికి చెప్పిన జపం చేస్తూండండి. అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+