పాఠకుల ప్రశ్నలు: జ్యోతిష్కుడి సమాధానాలు

1. నవీన్‌ కృష్ణ పీతాని, పుట్టిన చోటు రాయలేదు, ప్రభుత్వోద్యోగం,
పుట్టిన సమయం చెప్పవలసి ఉంటుంది కానీ పేరు ప్రకారం చెప్పాలంటే అనూరాధా నక్షత్రం, వృశ్చికరాశి అవుతుంది. ఏలినాటి శని నడుస్తుంది. ఇప్పుడు మీకు మంచి సమయం నడుస్తుంది ప్రయత్నించండి. శ్రీరాజమాతంగ్యై నమ: అనే మంత్రం జపించాలి. దానాలు చేస్తూండండి.

2. పావని దడ్డాల, సాఫ్టవేర్‌ జాబ్‌
పుట్టిన చోటు రాయలేదు, పుట్టిన సమయం చెప్పవలసి ఉంటుంది. మీరు రాయలేదు పేరు ప్రకారం ఉత్తరా నక్షత్రం కన్యారాశి అవుతుంది. గ్రహస్థితికి అనుకూలత మరొక సంవత్సరం వరకూ బాగాలేదు గురు, శనికి పరిహారాలు చేసుకోండి. శ్రీరాజమాతంగ్యై నమ: అనే మంత్రం జపించాలి.

3. లక్ష్మణ్‌ రావు చిన్ని, పుట్టినచోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం,

ప్రభుత్వోద్యోగం మీకు జాతకరీత్యా ప్రభుత్వోద్యోగానికి అవకాశం లేదు.

4. శివకృష్ణ మద్దిన, వివాహం,ఉద్యోగం

మీరు పుట్టిన సమయం రాయాలి.

Ask your Astrologer maruthi sharma : Answered your questions

5. మద్దాలి వెంకటేశ్వర రావు, విజయవాడ, ఉద్యోగస్థితి.
మీ జాతకంలో ఉద్యోగ కారకుడు శుక్రుడు 8లో ఉన్నాడు. కేతువు నక్షత్రం మీద ఉన్నాడు. 2017 వరకు నడుస్తుంది. అదీ 8వి 8వ అధిపతితో కలిసున్నాడు. 3లో కేతువు, ఉన్నాడు. నవాంశలో వ్యయంలో న్నాడు. సర్వాష్టకవర్గులో 30 గుణాలతో ఉద్యోగ భావం ఉన్నా గోచార శని బలహీన పడ్డాడు. మొత్తానికి శని కేతువులఅనుకూలత లేదు. ప్రస్తుతం పరిస్థితి మరో ఏడాది వరకూ బాగా లేదు . సూర్యుడి 8వ స్థితి, శని స్థితిలు మాట విలువ తగ్గటం అవమానం అపనింద, స్థానభ్రంశం సూచిస్తున్నాయి. ఇప్పుడున్న స్థితి మీకు ఇబ్బందుల్నే ఇస్తుంది. ఐతే ఈ గ్రహాలకి శాంతి దాన పరిహారాలు చేసుకోండి. శ్రీరాజమాతంగ్యై నమ: అనే మంత్రం జపించాలి. ఆపదాం అపహర్తారం....శ్లోకం చదువుతూ ఉండండి చాలా వరకు ఇబ్బందులు తగ్గి, సఖ్యత కలుగుతుంది

6. రాహల్‌ చౌదరి, పుట్టినచోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం, ప్రేమవివాహం అవుతుందా?

అన్నిభావాలూ కేతువుతో ఎక్కువగా కేతువుతో సంబంధం ఉండటం, 5,7లకి సంబంధం లేకపోవటం, వల్ల ప్రేమ సంభవించినా వివాహం జరగదు జరిగినా నిలబడే అవకాశం తక్కువ. రాహువు 7లో ఉన్నందున.

7. గణేష్‌ బత్తిని, కెరిర్‌, 8. మహ్మద్‌ ఖలీద్‌,కెరీర్‌
భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యం లాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

9. భూపాల్‌రెడ్డి జింకల, ప్రభుత్వోద్యోగం,

పుట్టిన సమయం చోటు రాయండి, తప్పకుండా చెపుతాం.

10. రాహుల్‌ చౌదరి, పెద్దపల్లి, ఉద్యోగం
మీకు గోచార శని బాగాలేదు, జాతకంలో శని వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు, దశ 8వ అధిపతి గురుడి దశలో శని అంతర్దశా ఫలితం గా కొంత సమస్యా యుతంగా ఉంటుంది, గురు,కుజ,శని గ్రహాలకి దానాలు శాంతి పరిహారాలు చేసుకుంటూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

11. బాబావలి.డిసి, కడప,జాబ్‌,వివాహం
వివాహం గురించి తెలుసుకోవాలన్నారు ( ఏం తెలుసుకోవాలి -కాలేదా, వివాఆహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు (ఏం తెలుసుకోవాలి-రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

12. పెమ్మసాని పావని, పుట్టిన సమయం, చోట్లు రాయలేదు.
వివరాలు పూర్తిగా ఇవ్వకుండా చెప్పడం కష్టం. ఐతే గురు, గ్రహం ఉన్నతి స్థితికి ప్రాప్తికి, శని దీనస్థితికి బీదరికానికి, ప్రభావంగా తీసుకోవాలి. మీ పరిస్థితిని బట్టి మీరు ఏం ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. ఒక సారి చదవండి.

13. స్వాతి సత్యవర్ధన్‌, కెరియర్‌
భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యం లాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

14. ప్రణీత బోనాల, విడాకుల సమస్య
మీ పుట్టిన సమయం, చోట్లు రాయలేదు. పంపండి. పంపితే కుజదోషం ఉందో లేదో చూడొచ్చు. ఐతే చాలా కుజదోషాలూ వివాహానికి ఆటంకాలు కావు. అది వివాహ భావానికి సంబంధం ఉండాలి, మీ భర్త జాతకమలో కూడా దోషం ఉంటే ఇలాంటివి సంభవించ వచ్చు. ఈసారి జాగ్రత్తగా చూసుకోండి.

15. ప్రవల్లిక పెడసింగు, నిజాం పట్నం, ఉద్యోగం,
మీ జాతకంలో ఏలినాటి శని నడుస్తుంది, శని దశ నడుస్తుంది, శని బాగాలేదు ప్రస్తుతం, శని మీకు జాతకంలో ఉచ్ఛస్థితిలోనే ఉన్నాడు. కానీ కొంత సమస్యే రాహు శుక్రులు చూస్తున్నారు, వీటికి దానాలు చెసుకుంటూ శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూండండి. కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+