సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుందా: జ్యోతిష్కుడి మాటేమిటి?

1. రమణ కె, కరీంనగర్‌, పెళ్లి తేదీ చెప్పగలరా?

చెప్పవచ్చు కానీ ఆయా తేదీలలో కాకపోవడానికి కూడా ఆటంకాలు కల్పించే గ్రహాలకి, వివాహం కాకుండా ఆపే గ్రహాలకి శాంతులు, దానాలు పరిహారాలు చేయవలసి ఉంటుంది. వివాహానికి అనుకూల బలాలు చాలాసార్లు వస్తాయి. అనుకూల సమయం, పరిస్థితులని బట్టి చేయవలసిన ప్రయత్నాలు కలిసినప్పుడే సఫలం అవుతుంది.

2. దీక్షిత, తిరుపతి, ఆర్థిక పరిస్థితి

ఏలినాటి శని లేదు, కానీ అష్టమాధిపతి దశ నడుస్తూం ఉండటం వలన ధనాధి పతి నీచలో ఉండటం వలన కొంత ఇబ్బంది ఉంటుంది, కుజశనులకి దానాలు పరి హారాలు చేసుకోవడం మంచిది.

3. శివకుమార్‌ వోలేటి, ఒరిస్సా, కుజదో షం ఉందా,

మీకు కుజదోషం ఉంది, కానీ అది వివాహానికి అడ్డం కాదు, అది పరిహారమైంది. అంటే దోషంపోగొట్టే గ్రహసూచనలు ఉన్నాయి.

4. సుధామ, కర్నూలు, మ్యారేజ్‌ మ్యాచింగ్‌

మీర్చిన వివాహపొంతన లో ఇద్దరికీ మైత్రీ పొంతన కలిసింది.కానీ ఇద్దరికీ సంతాన దోషం ఉంది, వీరిద్దరికీ వివాహం చేయక పోవడమే మంచిది.

Ask Your Astrologer: Readers questions answered

5. యడవల్లి నాగేందర్‌, పేళ్లి ఎప్పుడవుతుంది,

పుట్టిన సమయం చోట్లు రాయండి,

6. వీణ, హైదరాబాద్‌, ఉద్యోగం పొందుతానా?

మీకు మరొక రెండు సంవత్సరాల వరకూ అనుకూలత లేదు, కానీ ఏదో ఒక ఉద్యోగంలో ముందు చేరండి, తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది.

7. ఆర్‌.వి.రెడ్డి. కెరియర్‌.

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యం లాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

8. శ్రీనివాస్‌ వేదుల, బెంగుళూరు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వస్తుందా?

వస్తుంది, కానీ మీ జాతక రీత్యా మీ దోషమే ఎక్కువగా ఉంది. ప్రయత్నం గట్టిది కావాలి, మీ మాటవల్ల మీకు అపనింద, అనాదరణ జరుగుతుంది.శని, కుజ గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి. శుభం.

9. విశ్వనాథ్‌ దర్శి, హైదరాబాద్‌,

మీరు పుట్టిన తేదీని 2016గా ఇచ్చారు సరి చూసుకోండి.

10. పేరు రాయలేదు, ఖమ్మం, గవర్నమెంట్‌ జాబ్‌ నాకు వస్తుందా?

మీకు ప్రభుత్వోద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నించండి, తప్పక పొందుతారు.

11. భరణీ, నిజామాబాద్‌, ప్రభుత్వోద్యోగం వస్తుందా?

మీ జాతకంలో టీచర్‌ జాబ్‌ ఉంది, కానీ ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

12. బంటి, సంతానం,

మీజాతకం, మీ భార్య జాతకం రెండూ చూస్తే తప్ప దోషం ఎక్కడిదో చెప్పలేం, ఇద్దరి వివరాలూ పంపండి. సమాధానం తప్పక చెపుతాం.

13. సునందా రెడ్డి, ప్రేమవివాహం అవుతుందా?

పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, మీజాతక రీత్యా ప్రేమ వివాహం అవుతుంది.

14. శ్రీధర్‌, వీధిపోటు ఉంటే ఏం చేయాలి.

వీధిపోటు కేవలం ఇళ్లకు మాత్రమే కానీ వ్యాపారస్థలాలకి కాదు, వీధిపోటు ఉంటే నల్లరాతితో వినాయకమూర్తిని ప్రతిష్ఠించి పూజించాలి.

15. ఆర్‌.వి. శర్మ, కెరియర్‌.

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యం లాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+