ప్రేమ వివాహం అవుతుందా: చూడండి

1. సతీష్‌ కుమార్‌, వరంగల్‌, ప్రేమవివాహం అవుతుందా?

మీ జాతక రీత్యా ప్రేమ వివాహానికి అవకాశం లేదు.

2. ఓ లక్ష్మినారాయణ, భవిష్యత్తు

పుట్టిన చోటు సమయం ఇవ్వలేదు, భవిష్యత్తు అన్నారు, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

3. సాతు నరేందర్‌, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యొగానికిఅవకాశమ తక్కువగా ఉంది, ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి, దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండండి.

4. వీరవేంకట సత్య వరప్రసాద రావు, ఆర్థిక స్థితి, పెళ్లి సమస్య

మీకు పుట్టిన సమయం తేదీ గనుక పంపి ఉంటే ఖచ్చితమైన పరిష్కారం, సూచన నివ్వగలం, మీ నక్షత్రాన్ని బట్టి ఏలినాటి శని నడుస్తూ ఉంది, గురు అనుకూలత కొంతే ఉంది,శని గురులకి దానాలు పరిహారాలు చేసుకోండి. శుభం.

Ask Your astrologer maruti sharma: readers questions answered

5. సుధీర్‌ బాబు, నెల్లూరు, వివాహం, కెరియర్‌

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం,ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

6. పొనగారి రవికుమార్‌, బచ్చన్న పేట (వరంగల్‌), ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వ ఉద్యొగానికి అవకాశం తక్కువగా ఉంది, ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి, దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూమడండి.

7. పాండు గూడ, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, ప్రేమ వివాహం

మీ జాతకంలో 5వఅధిపతి గురుడు, లగ్నంలో ఉండి 7ని చూస్తున్నాడు, ప్రేమ పెళ్లికి అవకాశం ఉన్నట్టే, కానీ లగ్న కేతు, 7వరాహువు వివాహ జీవితంలో సమస్యలు తేవచ్చు, లేదా ఆ ప్రేమ పెళ్లివరకు రాకపోవచ్చు.

8. యం.జి. అమిత్‌ కుమార్‌, 25-11-1984

వివాహం, ఉద్యోగం లో ఏ వివరం కావాలో ప్రశ్న అడగలేదు. సరైన ప్రశ్న ఒకటి అడగండి. పుట్టిన చోటు పంపండి.

9. సతీష్‌ కుమార్‌ నూని, ప్రభుత్వ ఉద్యోగం, విదేశ గమనం

రెండింటికీ అనుకూలత ఉంది, రాహువు దశ నడుస్తు ఉంది దానాలు శాంతులు జరుపుకోండి.

10. డి, సోమ శేఖర్‌, 26-02-1990 సాఫ్ట్‌వేర్‌ జాబ్

పుట్టిన సమయం, చోటు పంపండి, సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ గురించి మీ కున్న అనముమానం కూడా పంపండి.

11. మాధవీ లత, కెరియర్‌

భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యం లాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

12. జొన్నల వెంకటేశ్వర రెడ్డి, విజయవాడ, స్వంత ఇల్లు

అడ్డంకులెక్కువ ఆవకాశాలు తక్కువ, 2, 4, 11 భావాలలో 2లో కేతువున్నాడు, 4వ అధిపతి శుక్రుడు 3లో కేతువు నక్షత్రం మీద ఉన్నాడు, రాహువు దశ నడుస్తున్నది,గోచారంలో ఏలినాటి శని నడుస్తున్నది, ఇప్పుడు గడ్డుకాలం ముందు వీటికి దానాలు చేసుకోండి. '' చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా '' అనే మంత్రం అందరూ చదువుతు ఉండండి.

13. సందీప్‌, మహబూబ్‌ నగర్‌, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

14. సాయిబాబా వాలి షేక్‌, సింగారకొండ, మానసిక సమస్య

పుట్టిన సమయం పంపలేదు, ఎప్పటి నుంచి మీకు ఆ సమస్య ఉంది అనేది చెప్పలేదు, మానసిక సమస్య అంటే చంద్రుడు, రాహువు, శని వంటి గ్రహాలు కారణం అవుతాయి, వాటికి ప్రీతిగా దానాలు, రుద్రాభిషేకం చేసుకోండి. ధ్యానం చెసుకోండి.

15. గణేష్‌ బత్తిని, చదువు

పుట్టిన వివరాలు ఇవ్వకుండా చెప్పపడం, కుదరదు, ఆచదువులోనూ మీకున్న సమస్య రాయండి.

సందేహాలకు సమాధానాలు: పాఠకులకు విన్నపం

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+