జ్యోతిష్యం: ఐటి రంగం ఉపయోగపడుతుందా?

1. ఉమాపతి, యం. హుజూరాబాద్‌, ఉద్యోగం

ఉద్యోగానికి (శ్రీరాజమాతంగ్యైనమ:) అనే మంత్రజపం చేస్తూండాలి. అసలు ఇప్పుడు మీకు ఉద్యోగానికి అనుకూల సమయమే. వెంటనే రావడానికి మీకసలు కావాల్సింది. ఎలాంటిదో ఏంటో తెల్సుకోవాలి దానికి అసలు యోగముందో లేదో తెల్సుకోవాలి.

2. శివరామవరప్రసాద్‌, తెనాలి, ఉద్యోగంలో ప్రమోషన్‌

2016 ఫిబ్రవరిలోపు మీకు ఉద్యోగమార్పిడికి సూచనలున్నాయి, కానీ ఒత్తిడులుంటాయి. సమస్యలు, నిందలు వస్తాయి, రాహుకేతువులకి దానాలు పరిహారాలు చేస్తూండండి.

3. రాజుతానిపత్రి, పుట్టిన చోటు రాయలేదు, హైదరాబాద్‌గా తీసుకున్నాం

మీకు 7లో రాహుచంద్రులు, లగ్నంలో కేతువున్నాడు వివాహంలో సమస్యలు, ఆలస్యమవటం వంటి సమస్యలు ఉంటాయి. ముందు ఈ గ్రహాలకి పరిహారంచేసుకోండి.

Ask Your astrologer: May get solution

4.శ్రీరాం శ్రీకాకొలపు, అనంతపురం, ఉద్యోగసమస్యలు

మీకు ఐటి రంగంకొంత ఉపయోగపడుతుంది. కానీ మరీ గొప్పగా ఉండకపోవచ్చు, 2016 ఫిబ్రవరి తర్వాత మీకు ఉద్యోగ సానుకూలత వస్తుంది.

5. మహ్మద్‌ ఫారూక్‌, పుట్టినచోటు, సమయం రాయలేదు

మీరిచ్చిన వివరాలతో చెప్పడం కుదరదు, ప్రశ్న సరిగా రాయండి.

6. సత్య, అమలాపురం,వివాహం,

మీకు జాతకరీత్యా సమస్యలున్నాయి, 8వఅధిపతి లగ్నంలో ఉండి 7నుచూడటం, 2లోకుజుడు ఉండటం, గోచారం అనుకూలంగా లేదు 7వశని నడుస్తుంది,రాహువుదశనడుస్తుంది ముందు పుణ్యబలంపెంచుకోడానికి దానధర్మాలు పుణ్యకార్యాలుచేయటం అవసరం. ముందు పైగ్రహాలకి పరిహారాలు చేసుకోండి, వివాహం కావాడానికి అందులోనే ఇచ్చిన ప్రార్థనాశ్లోకం చదువుతూ ఉండండి.

7.సౌమిత్రి ,గుటూరు,ఉద్యోగం

మీకు జాతకంలో శని, చంద్రుల ప్రభావం ఎక్కువగా ఉంది, గోచారంలో ఏలినాటి శని, శనిదశ నడవటం వంటివి ఇబ్బంది కారకాలు వీటికి ముందుపరిహారాలు చేసుకోండి. ముందు పైగ్రహాలకి పరిహారాలు చేసుకోండి.నవగ్రహాలకి జపాలు పరిహారాలు

8.స్వప్న పప్పు, విజయనగరం, ఉద్యోగం

మీకసలు ఉద్యోగంలో ఏం సమస్య ఉందీ చెప్పలేదు, మంచి ఉద్యోగం అన్నా కావాలన్నారు అంటే మీ సమస్య ఉద్యోగమా, అది ఎలాంటు ఉద్యోగం ? స్పష్టంగా రాయండి.

9.మాధవీలత, కర్నూల్‌, ఉద్యోగం

జాతకరీత్యా 9లో రాహుకుజులు, దశ రాహువులో కేతువుది, గోచారంలో 8వ శని ,ఇది గడ్డుకాలం కొంతకాలం ఓపిక పట్టాలి పుణ్యకార్యాలు, దానధర్మాలు (ముఖ్యంగా పైగ్రహలకి చేస్తూండండి)

10. చీకూరి వెంకటేష్‌, పుట్టిన చోటురాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, వివాహం ఉద్యోగం

7లో రవి, 7వఅధిపతి కుజుడు 5లో ఉండి 8ని చూస్తున్నాడు దానివల్ల వివాహంలో సమస్యలుంటాయి. గోచారంలో ఏల్నాటి శని,దశ అష్టమాధిపతి శుక్రునిదశ నడుస్తుంది.9లో కేతువుండటంవల్ల ఉద్యోగ ప్రయత్నాలవంటివి విఫలమౌతాయి.ఈగ్రహాలకి పరిహారంచేసుకోండి.

11.మణికుమార్‌,పుట్టినచోటురాయలేదు.

మీరు ఇద్దరి పుట్టినవివరాలిచ్చి, వారిద్దరికి వివాహపొంతన కలిసేదీ లేనిదీ చెప్పమంటే చెప్పగలం. లేదా మీమీ జాతకాలలో విడివిడిగా జాతకాల్లో వివాహ అనుకూలతలు చెప్పవచ్చు కానీ ఆవ్యక్తితోనే పెళ్లవుతుందా? లేక మీ ఇద్దరికీ పెళ్లెప్పుడు అని చెప్పడం కుదరదు.

12.మహేష్‌ గాజుల, కరీంనగర్‌, ఉద్యోగం

2015 జూలై 2 తర్వాతమీకు మంచి కాలం మొదలవుతుంది, జాతకరీత్యా కుజునికి చంద్రునికి పరిహారంచేసుకోండి.

13.మోడెం సత్యనారాయణ, కుమార్తెకు వివాహ పొంతన గురించి అడిగారు

ఇద్దరి జాతకం పొంతన కలవటం 8అంశాలుంటాయి. కానీ విడిగా వివాహానికి పొంతన ముందు వారి జాతకంలో
అసలు సంతానానికి, వివాహజీవితానికి దోషం ఉందా చూడాలి. ఒకరికి ఇవి ఉండి మరొకరికి లేకపోతే కొంత సపోర్ట్‌ ఇస్తుంది. ఇద్దరికీ ఉంటే వదిలేయాలి. మీరిచ్చిన జాతకాలలో ఇద్దరికీ లగ్నకేతు, 7వ రాహువున్నాడు. అమ్మాయికి 5లోశని, అబ్బాయికి 5పై కుజదృష్టి ఇవన్నీ సంతాన దొషాలు. కాబట్టి వీరికి వివాహం చేయకపోవడం మంచిది.

14. కన్నయ్యన్‌, చొక్కహళ్లి

వివరాలిచ్చారు. ప్రశ్న రాయలేదు.

15. రాంమోహన్‌ ఆలంపల్లి, పుట్టిన చోటు ఇవ్వలేదు,(పుట్టిన తేదీకూడా కరెక్ట్‌గా తెలియదన్నారు)

ఉద్యోగం, వ్యాపారం, జీవితం ఎలా ఉన్నాయి అని అడిగారు. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+