జ్యోతిష్కుడి మాట: మీ భాగస్వామికుంటే..,.
1. శ్రీగాయత్రి
పుట్టినచోటు సమయంరాయలేదు ఉదయం 6 గంటలుగా తీసుకుంటే తులా రాశివచ్చింది. దాన్నిబట్టి మీకు ఏల్నాటి శని చివరిదశలో ఉంది. మరో 2 సంవత్సరాలు ఇబ్బందులుంటాయి. మేలుతో పాటు సమస్యలూ ఉంటాయి. జూన్ తర్వాత ఆర్థికస్థితి బాగుంటుంది. శనికి పరిహారం చేసుకోండి సరిపోతుంది.
2.అజయ్ కుమార్ .టి
పుట్టిన చోటు, సమయం రాయలేదు. ఉదయం 6 గంటలుగా తీసుకుంటే ధను రాశివచ్చింది. దాన్నిబట్టి మీకు ఏల్నాటి శని దశలో ఉంది. 8లో గురుడున్నాడు. శనికి పరిహారం చేసుకోవాలి జూన్ తర్వాత గురు అనుకూలత కొంత మేలునిస్తుంది.
3.జనార్దనరెడ్డి, మదన పల్లె, సంతానం
మీకు 8 అధిపతి శని 5లో ఉండటంవల్ల సంతానానికి ఇబ్బంది కలిగిస్తుంది. శనికి పరిహారం చేసుకోండి. జీవిత భాగస్వామికి సంతాన బలం ఉంటే ఇంకా మంచిది.
4.హిమప్రియ
పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాదుగా తీసుకొనిచెపుతున్నాం. విదేశ గమనం మీకు విదేశగమనానికి అవకాశం ఉంది, కానీ బలహీనంగా ఉంది.
5....
పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీ ప్రశ్న పంపండి.
6.బి.వి.యన్.సుధాకర్ మూర్తి, నంద్యాల్, విదేశ గమనం
మీకు విదేశ గమనానికి అవకాశం ఉంది,ఇప్పుడు మంచి కాలమే ప్రయత్నించవచ్చును కూడా.

7.వి.ధనుంజయ, తోర్నగల్. కెరయర్
ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం కుదరదు. ఏదైనా ఒక చిన్నప్రశ్న అడగండి. నియమావళి చదివి పంపండి. సెటిల్‌మెంట్ అనేది మీరనుకున్నది ఏపరంగానో చెప్పలేదు ఇవన్నీ చెప్పడానికిది వేదిక కాదు. కేవలం సేవగా సూచనలిచ్చే వేదిక మాత్రమే అని తెలుసుకోండి. ఇంకా ఇలాంటి చర్చనీయామశాలు కావాలంటే మీకు తెలిసిన జ్యోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
8.ఉమామహేష్
పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాదుగా తీసుకొనిచెపుతున్నాం. మీరిచ్చిన సమయం ప్రకారం పూర్వాభాద్రా 4వ పాదం కాకుండా ఒకటవ పాదం నక్షత్రం వచ్చింది. ఐతే మీకు స్వంత ఇల్లు కొంత సమస్యలతో కూడుకున్నది. ఆలస్యం జరగవచ్చు లేదా అనుకున్నట్టు జరగకపోవచ్చు. కేతు, రాహువులకు పరిహారం చేసుకోండి.
9. ప్రవీణ్
పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాదుగా తీసుకొనిచెపుతున్నాం. మీకు ఏలినాటి శని ఇప్పటివరకూ రాలేదు భవిష్యత్తులో చాలా ఏళ్ల తర్వాత వస్తుంది. శని ఉంటం అంటే ఏమిటో కూడా మీకు మీరే నిరాశ పరచుకుంటున్నారు. కానీ మీకు ఉద్యోగస్థానంలో ఉండటం వల్ల ప్రయత్నాలు విఫలమవుతాయి.అష్టమాధిపతి ఉద్యోగస్థానంలో ఉండటం, కొంత సమస్యకరం కుజునికి పరిహారం చేసుకోండి. కాతరం వస్తువులు దానం చేస్తూండండి. మీకు విదేశ యోగం ఉంది. 2016 ఫిబ్రవరి తర్వాత మీకు ఉద్యోగం సమస్య తీరుతుంది.
10. సతీష్ ,తెనాలి,విదేశీ యానం
మీకు జాతక రీత్యా విదేశీ యానం ఉంది.
11.గి.వి.యమ్. రమణ
ప్రశ్న పెద్దగా రాసి వివరాలు మరిచిపోయారు.
12. తిరుపతి గిరికొండ, కెరియర్
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి.
13. రవి& శర్మ సితారామ అమలాపురం
పేరు రాయలేదు ఇది ఇ మెఇల్ అడ్రస్‌లో ఉన్నపేరు.
పుట్టి సమయం చోటు రాయ లేదు. ప్రశ్న స్పష్టంగా లేదు నియమావళి చదివి పంపండి. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి, కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. అలాగే సంతానం కూడా.
14. రాజేష్ జతల - సింహరాశీ
మీది సింహరాశి కాబట్టి రాహువు 2లో, కేతువు 8లో, 4లో శని ఉండటం మూడూ ఇబ్బందిదాయకాలే తప్పకుండా 2016 ఫిబ్రవరి తర్వాత బాగుంటుంది. రాహు కేతువులకు పరిహారం చేసుకోండి. సరిపోతుంది.
15. కీర్తిరెడ్డి వజ్జ ,విదేశగమనం
పూర్తి వివరాలు పంపితే మీజాతకంలో ఆ అవకాశం ఉందో లేదో చెప్పొచ్చు,లేదా నక్షత్రంకానీ, పుట్టిన తేదీకానీ పంపితే ఇప్పుడెలా ఉందో చెప్పొచ్చు కానీ మీరు తేదీ ఒక్కటిచ్చి జాతకంలోని అంశం గురించి అడిగారు చెప్పడం కుదరదు. నియమావళిని చదివిపంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]
మీరు ప్రశ్నలు పంపాల్సిన విధానంపై ఈ కింది లింక్ క్లిక్ చేసి చదవండి












Click it and Unblock the Notifications