జ్యోతిషం: మాకు జాబ్‌లు వస్తాయా?

1. కె.విక్రం భాను, పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం,

మీరు ఉద్యోగం వ్యాపారం రెండింకీ అవకాశం ఉంది, ప్రభుత్వద్యోగ అవకాశాలన్నాయి, ఐతే మీకు వ్యాపారమే ఎక్కువగా కలిసివస్తుంది. అందులోనూ సేల్స్‌ ఎక్సిక్యూటివ్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఇలాంటివి బాగుంటాయి, అందులోనూ కో అష్టమాధి పతితో సంబంధం ఉండటం వలన, సడన్‌ లాస్‌లు, సడన్‌ లాభాలు ఉంటాయి, బుధ రాహు చంద్రులకి ఎక్కువ పరిహారం చేసుకోండి. శుభం.

2. సాయిసూర్య,రేపల్లె,గవర్నమెంట్‌ జాబ్‌,పెళ్లి

మీరు పుట్టిన సమయం ఇవ్వలేదు, పంపండి, ఐతే మూలనక్షత్రం బట్టి కొంత చెప్పవచ్చు, ఐతే ధనూరాశిని బట్టి ఏలినాటి శని పీడ కొంత ఉన్నప్పటికీ గురు ఆనుకూలత ఉంది. కాబట్టి ఈ సంవత్సరం సెప్టెంబర్‌ లోపు మంచి ఫలితాల్ని పొందవచ్చు.

3. హరి జన్‌రాజు, ఉద్యోగం

పుట్టిన సమయం పుట్టిన చోట్లు పంపితే కానీ చెప్పడం కుదరదు.

4.మహ్మద్‌ ఆసిఫ్‌ హుస్సేన్‌, చోటు రాయలేదు

పుట్టిన సమయం, చోటు రెండూ రాయలేదు, మరొకటి మేం ఉచితసేవగా చేసే ఈ విభాగంలో పెద్ద ప్రశ్నలు ఎక్కువ ప్రశ్నలు చెప్పడం కుదరదు. ఒకరికి ఒక ప్రశ్న మాత్రమే మీరు ఇన్ని ప్రశ్నల్ని అడిగితే చెప్పలేం. ముందు ఈ జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు' అనే ఆర్టికల్‌ చదివి పంపండి.

Ask your astrologer on job opportunities

5. రాజ మండ్ల, కడప, గ్రూప్‌2 జాబ్‌ వస్తుందా?

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయి. ''శ్రీ రాజమాతంగ్యైనమ: అనే మంత్రం జపిస్తూండండి.దానాలు చేస్తూండండి.

6. కొమ్మోజు సందీప్‌ రాహుల్‌, జంగాఓన్‌(వరంగల్‌), ఉద్యోగం, పెళ్లి

వివాహం- 8వఅధిపతి చంద్రుడు, రాహువునక్షత్రంమీద 7లో ఉన్నాడు. ఇది వివాహసమస్య కారకం. ఆలస్యం, దాంపత్యంలో గొడవలు, వంటివి ఉంటాయి. ఉద్యోగం- ఉద్యోగ కారకుడు బుధుడు 2లో ఉన్నాడు రాహువు నక్షత్రం మీద ఉన్నాడు. 9లో కేతువున్నాడు. ఐతే ఇది కొంత లాభాన్ని కలిగించేలా 9వ అధిపతి రవితో కలిసున్నాడు. గోచారంలో గ్రహబలం బాగుంది, పైన చెప్పిన గ్రహాలకి శాంతి పరిహారాలు చేసుకుంటూ ప్రయత్నించండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

7. దూదేకుల అహ్మద్‌ వలీ, అనంతపురం

భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అన్నారు, అందులో చాలా అంశాలుంటాయి, ముందు ఈ జవాబులకింద'ప్రశ్నలు పంపేవారికి సూచనలు' అనేఆర్టికల్‌ చదివి ఒక ప్రశ్న పంపండి.

8. దబ్బుగొట్టు నాగరాజు రావు, ప్రభుత్వోద్యోగం, విదేశీ గమనం

మీరు ఏ వివరాలూ పంపకుండా? ప్రశ్నలు కేవలం శీర్షిక లుపెట్టి పంపకండి. మీరు పుట్టిన సమయం, చోటు రెండూ రాయలేదు, మీ ప్రశ్న కూడా సరిగా లేదు అసలు సమస్యేంటో రాయలేదు. ముందు ఈ జవాబులకింద'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.

9. తమ్మినేని రంగనాథ, తాడిపత్రి, ఉద్యోగం,

ఉద్యోగ భావాధిపతిని రాహువుతో కలిసిన 8వఅధిపతి గురుడు చూస్తున్నాడు, 9లో చంద్రుడున్నాడు ఇవన్నీ ఆటంకాలు, అందునా అష్టమాధిపతి గురుడి దశే మొదలైంది, గోచారమూ బాగాలేదు పై గ్రహాలకి శాంతి తోపాటు దానాలు అవసరం,అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

10. ఎస్‌. పరమేష్‌ మహబూబ్‌ నగర్‌, పుట్టిన సమయం, చోటు పంపండి.

11. సందీప్‌, మహబూబ్‌ నగర్‌, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

12. అవిది అజయ్, పుట్టిన చోటు రాయలేదు, ప్రభుత్వోద్యోగం

మీ సమస్య అర్థమైంది, ఐతే పుట్టిన వివరాలు లేకుండా స్పష్టమైన వివరాలు ఇవ్వడం కుదరదు.మీ పుట్టి వివరాలు పంపండి

13.నరేష్‌ చిక్కెల, నిజామాబాద్‌, ప్రభుత్వోద్యోగం

మీకు వచ్చే అవకాశం ఉంది కానీ ఆటంకాలు కూడా ఎక్కువున్నాయి. దానాలు చేస్తూండండి. రవి, శని, గురులకి పరిహారం చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

14. టి.శ్రీకాంత్‌, నెల్లూరు, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది కానీ మీ పొరపాటు వల్ల జారే అవకాశం ఉంది. చాలా సాధన,పుణ్యకార్యాలు దానాలు చేస్తూండండి. శ్రీరాజమాతంగ్యై నమ: అనే మంత్రం చదువుతూ ఉండండి.

15. షమ్మా షేక్‌, 04.06.1988, పుట్టిన చోటురాయలేదు

పుట్టిన సమయం చోటు రాయకుండా ప్రేమ వివాహం గురించి చెప్పడం కుదరదు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+