ప్రశ్నలకు జవాబు: పెళ్లవుతుందా?

1. అన్నెపు రామసంతోష్‌ ` రాజమండ్రి

మీకు రాహువు దశ అవడం మూలంగా ఉద్యోగం వంటివాటిలో ఇబ్బందౌతుంది. ఏలినాటి శనిమూలంగా అనారోగ్య సమస్యలుంటాయి, మీ స్థిరత్వం కొంత ఆలస్యంగా జరుగుతుంది.శని రాహువులకు పరిహారం చేసుకోండి, ఆగస్ట్‌ తర్వాత పరిస్థితి కొంత బాగుపడుతుంది.

2.నర్సింహ యాదవ్‌,హైదరాబాద్‌

మీరిచ్చిన వివరాలను బట్టి మీ ఇంటి ముఖద్వారం తూర్పు, ఉత్తరాలకుండాలి.

3.కామాక్షి,హైదరాబాదు

మీరిన్ని ప్రశ్నలకన్నా ఒక్కోటిగా పంపండి.

4.సాయి ప్రతాప్‌ ,కాకినాడ (వివాహం,ఉద్యోగం,ఉన్నతి)

ఎన్నోసార్లు చెప్పినట్లేమళ్లీ చెపుతున్నాం నియమావళి చదవండి, ప్రశ్న ఒకటి,అది సమస్య మాత్రమే రాయండి. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

5.సతీష్‌(అనూరాధనక్షత్రం) తెనాలి,విదేశీయానం.
మీకు విదేశీయోగం తప్పకుండా ఉంది.

6.సంతోష్‌, కొమ్మెర

ఉద్యోగం, విదేశీయానం, ప్రేమవివాహం అని శీర్షిక పెట్టేసారు అందులో మీరు దేని గురించి ఏం సమస్య అడగదలుగచకున్నారో చెప్పలేదు.ఇన్నిప్రశ్నలకు సమాధానం చెప్పడం కుదరదు. ఒకప్రశ్న అడగండి.

7.శ్రీనివాస్‌.సి.హెచ్‌వి ప్రేమపెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?

ఇది పూర్వాభాద్రా నక్షత్రం వివరంతోనే చెప్పగలిగేది కాదు. పుట్టిన సమయం, తేదీ,. చోట్లు రాయాలి.
చెప్పలేం, ప్రేమవివాహం ఇద్దరికీ నచ్చినప్పుడే మీకు ప్రేమవివాహానికి గ్రహానుకూలత తక్కువగా ఉంది. ఇక భవిష్యత్‌ గురించి అడిగారు. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీ ప్రశ్న పంపండి.

8. హరిబాబు, నాగర్‌కర్నూల్‌, వివాహం భవిష్యత్తు

మీది ప్రేమ వివాహమో కాదో చెప్పడం కుదురుతుంది, కానీ మీరిష్టపడ్డ వ్యక్తిని పెళ్లిచేసుకుంటారో లేదో జాతకంలో చెప్పలేం. ప్రేమవివాహం ఇద్దరికీ నచ్చినప్పుడే. మీకు ప్రేమవివాహానికి గ్రహానుకూలత తక్కువగా ఉంది.ఇక భవిష్యత్‌ గురించి అడిగారు. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

9.ఆర్‌.భరత్‌కుమార్‌,కమలాపురం.ఉద్యోగం

మీకు టీచింగ్‌ మంచిదే కానీ శని ద్రుష్టి ఉంది. ఎప్పుడూ శనికిప్రీతిగా ఏదోఒకటి దానం చేస్తూండండి.సాఫ్ట్‌వేర్‌కి అనుకూలత తక్కువగా ఉంది. ఈ జూలై దాటాక మీకు ఉద్యోగం వస్తుంది.

Ask Your Astrologer on your doubts

10. భాస్కర్‌ సూరపల్లి (పుట్టినచోటురాయలేదు)

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీ ప్రశ్న పంపండి.

11.శ్రీకాంత్‌ ఆదివిష్ణు ,ఏలూరు,వివాహం

మీకు 8వఅధిపతిగురునిలో, రాహువు దశ నడుస్తుంది. జూలైదాకా వివాహానికి అనుకూలసమయమే నడుస్తుంది. పాపగ్రహాలు 7ను చూడటం ఆలస్యానికి కారణం కావచ్చు. కుజ సూర్యులకు పరిహారం చసేసుకోండి.

12. చెన్నకేశవులు

మీరిద్దరి పుట్టిన, సమయాలు, చోట్లు రాయలేదు, నక్షత్రం కూడా రాయలేదు. ముందు వివరాలు పంపండి. మీరు వివారాలు పంపినా కూడా మ్యాచింగ్‌ అయ్యిందీ లేనిదీ చెపుతాంకానీ ఆమెను మీరు పెళ్లిచేసుకోవచ్చేదీ లేనిదీ మేం చెప్పేమాట కాదు. ప్రశ్న జాగ్రత్తగా రాయండి.

13.ఉమేష్‌రెడ్డి.

మీరు పుట్టిన చోటు రాసి ఉంటే జాతకం పరిశీలించి చెప్పేవాళ్లం, కానీ పంపలేదు కనుక మీ నక్షత్రాన్ని బట్టి వృషభ రాశిని బట్టి 5వరాహువు వల్ల, 7వ శనివల్ల ఇబ్బందులుంటాయి. ఈ రెండు గ్రహాలకు పరిహారం చేసుకోండి. జూలై తర్వాత ప్రయత్నించండి. తప్పక ఫలితం కనబడుతుంది.

14.నాగేశ్వర్‌రెడ్డి.పి.ఆళ్లగడ్డ, వివాహం

శనిలో, కేతువు అంతర్దశ నడుస్తుంది. జూలై తర్వాత గురుబలం అందుతుంది, కేతుశనులకు పరిహారం చేసుకోండి.

15. పాకలపాటి శివసుభాషిణి

ఈమె జాతకం వీరి తండ్రి అడిగారు. ముమ్మిడివరం
మీ కుమార్తె జాతకంలో 8వఅధిపతి 7లో ఉన్నాడు. దీన్ని మాంగళ్య లేదా సౌభాగ్య దోషం అంటారు. దీనికి పరిహారం చేసుకోండి (శనికి). జూలై తర్వాత వివాహానికి అనుకూల గ్రహబలం వస్తుంది. పెళ్లి చేసుకోవచ్చేదీలేనిదీ మేం చెప్పేమాట కాదు. ప్రశ్న జాగ్రత్తగా రాయండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

మీరు ప్రశ్నలు పంపాల్సిన విధానంపై ఈ కింది లింక్ క్లిక్ చేసి చదవండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+