పెళ్లి, ఉద్యోగం, సమస్యలు: జ్యోతిష్కుడేమంటారు?
01. అశోక్‌కుమార్ మున్నంగి, హైదరాబాద్, ఉద్యోగం
వృత్తి స్థాన బలం బాగుంది, కానీ ఇప్పుడు గురు శనుల అనుకూలత లేకపోవడం వల్ల కొన్ని సమస్యలుంటాయి. 2016 జూన్ తర్వాత కొంత బాగవుతుంది. గురు శనులకి దానాలు చేస్తూండండి. అసలు మీకున్న సందేహం ఏంటో స్పష్టంగా రాయండి.
02.నాగేశ్వరరావు, తెనాలి, వివాహం
మీకు 8వఅధిపతి చంద్రుడు లగ్నంలో ఉండి 7వ భావాన్ని చూస్తున్నాడు. అది వివాహభావాన్ని చెడగొడుతుంది, గురుబలం మొన్న ఆగస్ట్‌లోనే వచ్చింది .ఇప్పుడు ప్రయత్నించండి. చంద్ర, కుజ, శుక్రులకి దానం చేసుకోండి. వివాహానికి మేం అందించిన ప్రార్థన చదువుతూండండి.
03. మహేశ్వర్ పోలోజు, హెదరాబాద్, ఉద్యోగం
2016 జూన్ తర్వాత మార్పు వస్తుంది. ఏలినాటి శని ఇప్పుడు నడుస్తుంది. ఈ సమస్యలకు భయపడకండి. మంచి జరుగుతుంది. సూర్య, కుజ, శని, బుధులకి, శుక్రుడికి దానాలు పరిహారాలు చేసుకోండి.

04. హేమంత్ చౌదరి, సిఏకోర్స్
మీ పుట్టిన సమయం, చోట్లు కూడా రాయండి.
05. సందీప్‌కుమార్ దేవసత్, పుట్టిన సమయం చోటురాయలేదు
జ్యోతిష్కున్ని ఏం ప్రశ్న అడగాలో సరిగ్గా ఆలోచించుకొని రాయండి. అమ్మాయివాళ్ల ఇంట్లో ఒప్పుకునేదీ లేనిదీ మేం చెప్పేదేనా?
06. విశ్వనాథ్ కాకుమణి, ఒంటిమిట్ట, వివాహం
వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
07. రంజిత్ కుమార్, సిరిసిల్ల, ప్రభుత్వోద్యోగం
మీకు ప్రభుత్వోద్యోగం వస్తుంది. గట్టిగా ప్రయత్నించండి.
08. మాధవి కుమారి, విజయవాడ, కెరియర్
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికిది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.
09. వైష్ణవి తుమ్మ, గుంటూరు, ప్రభుత్వోద్యోగం
మీకు ప్రభుత్వోద్యోగం వస్తుంది. గట్టిగా ప్రయత్నించండి.
10. సుమతి.కె, గోదావరిఖని, వివాహం
వివాహానికి దోషాలు లేవు. కుజదోషం వల్ల వివాహం జరగదు అనే మాటలేదు. కానీ మీకు దశ బాగాలేదు మరొక సంవత్సరంలో వివాహం జరుగుతుంది. కుజ, శని, రాహువులకి దానాలు ఇస్తూ మేం అందించిన శ్లోకం పారాయణ చేస్తూండండి.
11. అజిత్‌వర్మ 1986, కెరియర్
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.
12. దీప్తి రామకృష్ణ పుట్టినవివరాలు రాయలేదు, వివాహం
మీకు ఈ సంవత్సరం వివాహానికి గురు బలం ఉంది.
13. సూర్యనారాయణమూర్తి, హైదరాబాదు, సంతానం
మీ భార్య వివరాలు కూడా పంపండి. ఒక్కరి జాతకంతో చూసి చెప్పలేం.
14. బన్ను, హెదరాబాదు, వివాహం
వివాహం ఆలస్యానికి చాలా కారణాలుండవచ్చు కానీ ఇప్పుడేం చేయాలో ఆలోచించాలి, మీరు ఇంత ఎక్కువగా కాకుండా చిన్నగా రాయాల్సింది, మీకు ఇప్పటికీ ఏం నష్టంలేదు. వివాహం చేసుకోవచ్చు. గురు, రాహువులకి దానాలు ఇస్తూ మేం అందించిన శ్లోకం పారాయణ చేస్తూండండి.
15.శివప్రసాద్, కెరియర్
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications