జ్యోతిషం: మీ సమస్యలకు ఇలా జవాబులు
1. సిహెచ్.శ్రీనివాసరావు, నంద్యాల, ఉద్యోగం
మీకు ఉద్యోగం భావంలో వ్యయాధిపతి శని ఉన్నాడు. అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు. గోచారంలో 8లో శని ఉన్నాడు. గోచారం గురు, రాహువులు బాగాలేరు. 2016 సెప్టెంబర్ తర్వాత ప్రయత్నించండి. పైగ్రహాలకి దానాలు చేస్తూండండి. పరిహారాలు చెసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అనే మంత్రం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
2. పి.సోమేశ్వరరావు, అనకాపల్లి, ప్రభుత్త్వద్యోగం, విదేశీయానం
రెండింటికీ అవకాశం ఉంది, కానీ శనిభావంతో ఉండటంవల్ల, ఆలస్యంకావచ్చు శనికి దానాలు చేస్తూండండి. పరిహారాలు చెసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
3. సుబ్బారెడ్డివట్టి, ఇబయ్యారం, కెరయర్.
భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
4. యన్.భాస్కర్ రెడ్డి. ప్రొద్దుటూరు, ఉద్యోగం
వ్యయాధిపతి శనిలగ్నంల, వృత్తికారకుడు శనినక్షత్రంపైన గురుడు ఉన్నాడు, అదే శనిదశ నడుస్తుంది, గోచారంలో మరో సంవత్సరం దాటితే తప్ప గురు అనుకూలత లేదు, శని గురులకి దానం చేయండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అనే మంత్రం చదువుతూండండి. అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
5. నరేష్ బల్లంకి, విశాఖపట్నం, ప్రేమవివాహం
ప్రేమవివాహానికి కొంత అవకాశం ఉంది, కానీ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి.
6. కాలేశ్వరరావు, వి.పుట్టినచోటు రాయలేదు, వివాహం
వివాహంగురించి చెప్పమన్నారు. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు ( ఏం తెలుసుకోవాలి -కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
7. మణికంఠ కుమార్, డి.ఒంగోలు, పెళ్లి ఎప్పుడవుతుంది
ఎప్పుడవుతుందో తెలుసుకునే ముందు సమస్యలు చూడండి. వివాహకారకుడు చంద్రుడు, కేతువునక్షత్రం మీద,ఉన్నాడు వ్యయంలో ఉన్నాడు, 8వఅధిపతితో కలిసున్నాడు. ఐతే గోచారంలో ఏలినాటి శని నడుస్తుంది కానీ వివాహనికి గురుబలం ఉంది. పైనచెప్పిన గ్రహాలకి శాంతి చేసుకొని దానాలు చేస్తూ,ఉండాలి లేకపోతే ఆలస్యం అవుతుంది. వివాహానికి మేం ప్రత్యేక ప్రార్థనా శ్లోకం చేస్తూండండి. అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

8. పులుపులనారాయణ, కడప, ప్రభుత్వోద్యోగంవస్తుందా?
మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది, కానీ ఎక్కువ కృషి చేయాలి.
9. కెవికే చౌదరి, వివాహ వివాదసమస్య,
మీరు మీ ఇద్దరి జాతకాల పుట్టిన సమయం తేదీలు పూర్తిగా ఇవ్వండి, తెలుగులో ప్రశ్న రాయండి.
10. వేంకటేశ్వర్లు కరసాల, ఒంగోలు, (కుమారునికి ఏరాశివస్తుంది?)
మీ అబ్బాయిది మీరన్నట్లు రేవతీ నక్షత్రమే, మీనరాశి అవుతుంది.
11. రుష్యేంద్ర,అరకు, విదేశంవెళ్తానా
మీరు తప్పకుండా విదేశానికి వెళతారు.
12. ప్రవీణ్‌కుమార్, 14/09/1990, పుట్టిన నసమయం, చోటు రాయలేదు
మీరడిగిన ప్రశ్నలకి పూర్తి వివరాలుకావాలి, ఒకప్రశ్న మాత్రమే అడగండి. కింద సూచనలని చదివి పంపండి.
13. సతీష్ నీళ్ల, పేరూరు, ఉద్యోగం
కుంభరాశి ప్రకారం ఇప్పుడు గురుబలం బాగుంది, శనికి దానాలు చేసుకుంటే సరిపోతుంది. మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీరు పుట్టిన తేదీరాయండి.
14. ప్రభాకర్, పి., ఉద్యోగం
వృశ్చికరాశి ప్రకారం, ఏలినాటి శని ప్రభావం కొంత ఉంటుంది, ఐతే ఉద్యోగం కూడా పొందుతారు. శనికి దానాలు చేస్తూండండి.
15. రవికుమార్ బలగ,రాయగడ (ఒరిస్సా), వివాహసమస్య.
చంద్ర కేతువుకి దానాలు చేసుకోవాలి. వివాహ భావం బాగాలేదు, 8వ శనికి కూడా దానాలు పరిహారాలు చేసుకోండి, వివాహానికి గురుబలం బాగానే ఉంది. వివాహానికి మేం ప్రత్యేక ప్రార్థనా శ్లోకం చేస్తూండండి. అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
సందేహాలకు సమాధానాలు: పాఠకులకు విన్నపం
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications