జ్యోతిషం: గ్రహాలు అనుకూలంగా లేవా?

1. నావులూరి వేంకటేశ్వర రావు, గురజాల, పోయిన బ్యాంక్‌ ఉద్యోగంలో మళ్లీచేరుతానా?

వృత్తిభావంలో కేతువున్నాడు.ఆయన దశలోనే ఈ మార్పు జరిగి ఉండవచ్చు. ఐతే ప్రస్తుతం 2022 వరకు శనిదశ నడుస్తుంది.గోచారణలోనూ రాహుకేతువులు అణుకూలంగా లేరు. కానీ గురుడు మొదలైన వి నిలబెడతాయి. దానధర్మాలు చేయడం, దైవ ప్రార్థన చేయడం, లేదా మీరు కోల్పోవడానికి కారణాన్ని పరిష్కరించుకోండి. తిరిగిపొందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఐతే శ్రీరాజమాతంగ్యైనమ: అని జపిస్తూండండి. శని,రాహు,కేతువులకి దానాలు చేస్తూండండి.

2.శివలక్ష్మయ్య, ప్రశాంతిల ప్రేమవివాహం

రెండు అంశాలు గమనించండి. 1.మీ ఇద్దరి పుట్టిన చోట్లు, సమయాలు కావాలి. 2.ఇద్దరి వివరాలు ఇస్తే వారిద్దరికీ మ్యాచింగ్‌ మాత్రమే చెప్పగలం గానీ మీ ఇద్దరికి మీతోనే జరుగుతుందో లేదో చెప్పలేం. 3. పూర్తి జాతకం చెప్పలేం కాబట్టి ప్రశ్న సుటిగా చిన్నగా, మా నియమావళిని చదివి పంపండి.

3. శివరామకృష్ణ, వివాహం (పుట్టిన వివరాలివ్వలేదు)

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు ( ఏం తెలుసుకోవాలి -కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

4. నరేష్‌ కడాలి, పుట్టిన చోటురాయ లేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, ఉద్యోగంసమస్య

లగ్నంలో రాహువు,8వ అధిపతి బుధుడు కలిసి ఉన్నారు. దానివల్ల ఆటంకాలు కార్యసిద్ధి తక్కువ కావడం జరుగుతుంది. ఉద్యోగకారకుడు కుజుడు శని ద్వాదశాధిపతితో కలిసి ఉన్నాడు. కానీ ఏకాదశంలో కావడం కొంత మేలవుతుంది. గోచారంలో దశమంలో కేతువున్నాడు. రాహువుచేత చూడబడుతున్నాడు. అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. మరో సంవత్సరం దాకా అనుకూలత లేదు. పైగ్రహాలకి దానాలు చేసుకోండి. కొంతకాలం ఆగండి.

5. గొల్లరాకేష్‌, ఒంగోలు, వివాహం

మీకు వివాహం తేదీ కనుక్కునే ముందు వివాహానికి ఆలస్య కారణం ఏంటీ, దాని పరిష్కారమేంటీ తెలుసుకోండి. అవి చాలమంది తెలుసుకోకపోవడం మూలంగానే చాలామందికి .మీరిచ్చిన ప్రకారం మీది కృత్తికా నక్షరతమే కానీ మేషరాశి ఐంది. జాతకం సూచించిన వివాహం కూడా కావడం లేదు. మీ జాతకంలో వివాహకారకుడు 8వ అధిపతి శని 5లో ఉండి 7ని చూడటం. వివాహభావంపె కుజద్రుష్టి ఉండటం. ఇవన్నీఆటంకాలు. కానీ రాహుదశ నడవడం వల్ల అనుకున్నది జరగడంలేదు. పైన చెప్పిన గ్రహాలకి దానాలు చేస్తూండండి. మేము వివాహానికి చేయవలసిని ప్రార్థనాశ్లోకం చదువుతూండండి.అ ది నవగ్రహాలకి పరిహారాలు అనే ఆర్టికల్‌లో అందించాము.

6. రమేష్‌,కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

Ask Your Astrologer: readers' questions answered

7. యోగేష్‌ రెడ్డి, సూళ్లురుపేట, ఏలినాటి శనిదోషం ఉందా?

మీకు సంవత్సరం క్రితమే మొదలైంది, తర్వాత 2020 జనవరి వరకు ఏలినాటి శని నడుస్తుంది. దానికి భయపడవలసినది లేదు. దానివల్లకొన్ని ఇబ్బందులుంటాయి.దానికి ఏమేం చేయాలో వివరంగా జవాబుల క్రింద నవగ్రహాలకి పరిహారాలు అనేఆర్టికల్‌లో అందించాము.

8. శ్రీవత్స, మంథని. ప్రభుత్వోద్యోగం

మీకు జాతకానుసారం రపభుత్వొద్యొగానికి అవకాశం లేదు.

9. వెన్నపూస రామలింగారెడ్డి, జమ్మలమడుగు, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

10. నరసింహారెడ్డి, ఢిల్లీ, ట్రాన్స్‌ఫర్‌

మీకీసంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ట్రాన్సఫర్‌కి అవకాశం లేదు.

11. సంపత్‌ కుమార్‌, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, ఐటి ఉద్యోగం వస్తుందా?

మీకు గోచారంలో గురుబలం ఉంది కానీ రాహుకేతువుల ప్రతికూలత ఉంది. అర్ధాష్టమ శని నడుస్తుంది. వాటికి దానాలు పరిహారాలు చేసుకోండి. వచ్చేసంవత్సరం ఫిబ్రవరి కొంత, తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం తర్వాత మరికొంత మేలవుతుంది. ఆలోపు శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.

12. రవికుమార్‌ యలమంచిలి , ఏలినాటిశని, కుజదొషం ఉందా?

మీకు ఏలినాటి శని దోషం లేదు, కుజదోషం ఉంది. దానికి ఏమేం చేయాలో వివరంగా జవాబుల క్రింద నవగ్రహాలకి పరిహారాలు అనేఆర్టికల్‌లో అందించాము.

13. శ్రీనివాస యాదవ్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

14. కొలగని సత్యనారాయణ, జగ్గయ్యపేట, వివాహం కాకపోవడానికి కారణం?

లగ్నరాహు, 7వకేతువు మొదటికారణం, 2 కుజుడు 9వ భావంపె దృష్టి అనేది రెండో కారణం, వివాహభావాధిపతి సూర్యుడు 8వఅధిపతితో కలిసి ఉండటం,ఇవన్ని సమస్యలే వీటివల్ల అనుకున్న స్థాయి వ్యక్తి దొరకరు, దొరికినా నచ్చరు, నచ్చినా చివరిదాకా వచ్చి ఆగిపోతుంది, లేదా వివాహం తర్వాత దాంపత్యంలో సమస్యలతో నడుస్తుంది. రాహువు దశ నడుస్తుంది. పైన చెప్పిన గ్రహాలకి దానాలు చేస్తూండండి. మేము వివాహానికి చేయవలసిని ప్రార్థనాశ్లోకం చదువుతూండండి. అది నవగ్రహాలకి పరిహారాలు అనేఆర్టికల్‌లో అందించాము.గురుబలం ఉందికాబట్టి కొంత నమ్మకంతో ప్రయత్నించవచ్చు.

15.శామల రాణి, ఉద్యోగం (పుట్టిన వివరాలు పంపండి)

ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+