జ్యోతిష్కుడి మాట: ప్రేమ వివాహం గురించి..

1. లంక రామలింగేశ్వర్‌

మీరుపుట్టిన సమయం రాయలేదు కానీ అశ్వని నక్షత్రం అన్నారు దాన్నిబట్టి. అష్టమశని ప్రభావం మీకు ఇబ్బంది దాయకం. అన్ని విధాలా ఇబ్బందులకి 6 శనికారకుడు ఇది మీకు పరీక్షాకాలం రెండున్నర సంవత్సరాలు అష్టమశని అందులో ఇక సంవత్సరం అంటే 2016 ఫిబ్రవరివరకు రాహు ప్రభావం కూడా ఉంది కొంత ఓపికపట్టాలి, శని రాహువులకు దానాలు పూజలు చేసుకోండి కొంత మెరుగవుతుంది.

2.వంశీకృష్ణ ` పెనుగొండ `

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

3.దుర్గారావు .కె వివాహసమస్య

మీరు పుట్టిన సమయంకానీ నక్షత్రంకానీ రాయలేదు. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

Ask your astrologer sharma:issues dealt

4.మాచుపల్లి శ్రీనివాసరెడ్డి ` జమ్మలమడుగు ` మంచిరోజులు ఎప్పటినుంచి

6లో గురుడున్నాడు జూన్‌ తర్వాత కొంత బాగవుతుంది. 8లో రాహువున్నడు 2016 తర్వాత మెరుగవుతుంది. రాహువుకి పరిహారం చేసుకోండి.

5.వీరేశం ` హైదరాబాదు `

పుట్టిన వివరాలు రాయలేదు.నక్షత్రంకూడారాయ లేదు, దేని ఆధారంగా చెప్పాలి?

6.ఇందిరప్రియదర్శిని ` విజయవాడ ` వివాహం

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. మీ వివాహాధిపతి స్థానంలో కుజుడు 6లో ఉండటం. 4లో కేతువుండటం, 4వఅధిపతి 6లోలో ఉండి లగ్నాన్ని చూడటం వంటివాటి వల్ల అనుకున్నవి అనుకున్నట్లు చాలా పనులుజరగవు కుజ శనులకు,సూర్యునికి పరిహారం చేసుకోండి.అందునా అష్టమాధిపతి గురునిదశ నడుసుంది కనుక గురునికి పరిహారం చేసుకోండి.

7.రాజేష్‌ మేకల ` కర్నూలు ` ఉద్యోగం

మీకు జూన్‌ తర్వాత ఉద్యోగం అవకాశం బాగుంది. 2017 లో ఉద్యోగంలో కొంత స్థిరత్వం ఏర్పడుతుంది. శనికి పరిహారం చేసుకోండి. ఏలినాటిశని ఇబ్బందులు కల్గిస్తాయి.

8.భాస్కరరావు సుంక ` ఏలూరు ` ఉద్యోగం

మీకిపుడు రాహువులో అష్టమాధిపతి శుక్రుని అంతర్దశ నడుస్తుంది. ఆ తర్వాత 2016 జూన్‌ వరకు కూడా ఇబ్బందికాలమే ఐతే ఈ జూన్‌లోపు ఉద్యోగానికి ప్రయత్నంచండి. అది తప్పితే ఆలస్యమవుతుంది. ఇప్పుడు చేసేపనిలో 2016 తర్వాత స్థిరత్వం
ఏర్పడుతుంది.

9.విశ్వేశ్వరం `

కెరియర్‌ పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

10. చెన్నకేశవ (ప్రేమవివాహం)

మీరు పుట్టిన సమయం, చోటురాయలేదు. మీ జాతకంలో ప్రేమవివాహానికి అవకాశం ఉందా లేదా అనేమాటకు సమాధానం చెప్పవచ్చు,కానీ అమ్మాయి వివరాలిచ్చి ఆ అమ్మాయితోనే వివాహం అవుతుందా కాదా అనేది చెప్పడం కుదరదు. దయచేసి నియమావళిని చదివి పంపండి.

11.వెంకటరమణ ` తణుకు ` చదువు

విద్య గురించి అడిగారు. అసలు మీరు అడగదలుచుకున్న ప్రశ్న ఏమిటి, ఏ చదువు మంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్న సమస్యల గురించి అడగదల్చుకున్నారా, ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అడగదల్చుకున్నారా? లేదా ఇంకేదైనా వుందా? ప్రశ్నస్పష్టంగా రాయండి.

12. కోనరెడ్డి `

కొండాపూర్‌ పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

13.జనార్దన్‌రెడ్డి ` మదనపల్లె ` వీసా, విదేశం

మీరు రెండు తేదీలిచ్చారు నవంబర్‌ లెక్కన తీసుకుని చెపుతున్నాం. మీకు విదేశానికి వెళ్లడానికి వీసా తప్పక దొరుకుతుంది. అదీ ఈ సంవత్సరంలోనే దొరుకుతుంది. మీకు ఏలినాటి శనికి పరిహారం చేసుకోండి. పనిలో ఆలస్యం తగ్గుతుంది.

14. కట్టుల శ్రీనివాస్‌` మూలలంక ` ఇబ్బందులు

మీకు చంద్రుని దశలో అష్టమాధిపతి దశ నడుస్తుంది. జూలైతర్వాత మెరుగవుతుంది. గురునికి పరిహారం చేసుకోండి.

15.చిదంబరం ` గుంటూరు ` సంతానం

మీ జాతకాల్లో దాచి పెట్టేంత దోషాలూలేవు. మేము అంత సూక్ష్మంగా పరిశీలించము కూడా. మీరు కుజదోష పరిహారం చేసుకోండి సరిపోతుంది. సుబ్రహ్మణ్యారాధన చేయండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+