జాతకం: కుజదోషం ఉంటే పెళ్లి కాదా?

1. సంతోష్‌ వేగోలం, మంథని, ప్రభుత్వోద్యోగం మిస్ అవుతుంది కారణం ఏమిటి?

మీకు పాపగ్రహాల దుష్ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రయత్నానికి తోడు పుణ్యబలం అవసరం. ప్రభుత్వోద్యోగావకాశాలు తక్కువగా ఉన్నాయి .చంద్ర, గురు, రాహు, కేతువులకి దానాలు పరిహారాలు చేయండి. కొంత లాభం జరగవచ్చు. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

2. కందిమల్ల కిరణ్‌కుమార్‌, గుంటూరు వివాహం

తేదీ చెప్పగలం కానీ ఆటంకాలు కలిగించే గ్రహాలు మీకు చాలా ఉన్నాయి, అంటే మీ స్వంత తప్పువల్ల గానీ, ఇతర ఇబ్బందులవల్ల గానీ అది జరగకపోవడానికి కొన్ని కారణాలుంటాయి. అందుకే ఉద్యోగాల తేదీలు, వివాహాల తేదీలు చెప్పబడవు. మీకు వివాహ కారకుడు రాహువుతో కలిసి ఉన్నాడు. 6అధిపతి శుక్రుడి దశ నడుస్తుంది. గోచారంలో ఏలినాటి శని నడుస్తుంది. మరో ఏడాదిదాకా గురుబలం లేదు. వీటికి దానాలు చేస్తూ, వివాహం కోసం మేం ఒక ఆర్టికల్‌లో శ్లోకాన్నిచ్చాం అది చదువుతూ ఉండండి.

3. మోహన్‌ కృష్ణ, అమలాపురం, వివాహం

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

4. భార్గవరామ్‌, కామారెడ్డి

లైఫ్‌ సెటిల్‌మెంట్‌ అంటే అదిచర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

Ask Your Astrologer to clear your doubts

5. వేణుగోపాల్‌రెడ్డి గంగిరెడ్డి, కందుకూరు, ఉద్యోగం

మీకు ఇప్పుడు గురు అనుకూలత లేదు. రాహువు దశ నడుస్తుంది. మొత్తంగా ఉద్యోగ స్థానం కంటే మీ లగ్నమే బలహీనమై ఉన్నది. ఐతే వీటకి దానాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అనే మంత్రం చదువుతూ ఉండండి.అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

6. కంది వెంకట్‌రెడ్డి, బ్రాహ్మణ పల్లి(వినుకొండ), ప్రేమపెళ్లేనా?

మీకు ప్రేమ పెళ్లి జరుగుతుంది. కానీ కొంత సమస్యగా ఉంటుంది.

7. షేక్‌ ఇబ్రహీం, పరుచూరు,

చాలాప్రశ్నలు అడిగారు. కింద ఇచ్చిన మా నియమాలని చదవండి, ఒక ప్రశ్న అడగండి.

8. జయ చంద్ర ఆమినేని, చిత్తూరు, వివాహం

మీకు అష్టమాధిపతి కుజుడు7లో ఉన్నాడు. 2లో రాహువు ఉన్నాడు, రాహుదశ నడుస్తుంది, ఇది వివాహానికి ఉన్నదోషాలు, వీటికి దానాలు శాంతి పూజ ఆవసరం. అంటే ఏం చేయాలో కింద నవగ్ర పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

9. నవీన్‌ కుమార్‌, రాజంపేట, లైఫ్‌సెటిల్‌మెంట్‌

లైఫ్‌సెటిల్‌మెంట్‌ అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగడానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

10. మిరియాల్కర్‌ సంతోష్‌ కుమార్‌, బోధన్‌, ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగం వస్తుందా?

మీకు టీచర్‌ ప్రొఫెషన్ ఉంది కానీ అస్తవ్యస్తం చేసే గ్రహాలు 4(కుజ,శు,శని,రాహువు)లు అన్నీ 9లో ఉన్నాయి, అంటే కొద్దిలోనే లక్‌ మిస్సవుతుంది. ప్రస్త్రుతం మీకు సపోర్ట్‌ ఇచ్చే సూర్యుని దశ, గురుబలం ఉన్నాయి. పైన చెప్పిన 4 గ్రహాలకి దానాలు శాంతి పరిహారాలు చెసుకోండి. తప్పక జయిస్తారు శుభం. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

11. గణేష్‌ బాబు, పుట్టిన వివరాలు ఏమీ ఇవ్వలేదు.

పుట్టిన వివరాలు పంపండి. మీప్రశ్న పేరాలకొద్దీ పంపంకండి, చిన్నగా రాయండి.

12. సరస్వతి, వినుకొండ, కుజదోషం ఉంటే పెళ్లికాదా?

తప్పకుండా అవుతుంది. కుజదోషం ఒక లక్షణాన్ని సూచిస్తుంది. అంతేకాని ఎప్పుడూ వివాహాన్ని కాకుండా చేయదు.

13. లక్ష్మీమానస, కెరియర్‌

కెరియర్‌ అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

14. పేరు రాయలేదు ఇమెయిల్‌లో (చిట్టి0139 అని ఉంది) ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగావకాశాలు తక్కువగా ఉన్నాయి.

15. ఆర్‌.వి.శర్మ, హైదరాబాద్‌,ట్రాన్స్‌ఫర్‌.

మీకు వచ్చే ఏడాది ట్రాన్‌ ఫర్‌ అవుతుంది, కానీ ఆజిల్లాకే అని చెప్పలేం.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+