జ్యోతిష్కుడి సమాధానాలు: ప్రేమ సరే, పెళ్లి ఏమో..

1. శివ.యన్‌, కాకినాడ, వివాహం

మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం కుదరదు, అందులో ఒక్కదానికే చెపుతున్నాం. వివాహ భావాధిపతి 8వ అధిపతి ఇంట్లో ఉన్నాడు. ఏలినాటి శని చివరదశలో ఉంది, గురుడి చంద్రుడి అంతర్దశ నడుస్తుంది, గురుబలం బాగా ఉంది ఈసంవత్సరం ఏప్రిల్‌ తర్వాత వచ్చే సంవత్సరం ఆగస్ట్‌లోపు మీకు వివాహం జరుగుతుంది. శనికి దానాలు పరిహారాలు చేసుకోండి.

2.కుమారి రాజకుమారి, నంద్యాల, ప్రేమవివాహం అవుతుందా?

ప్రేమవివాహానికి అవకాశాలు మీ జాతకంలో లేవు.

3. బాల అనిల్‌ కుమార్‌ పెల్లూరి, నర్సరావు పేట

పుట్టిన తేదీ ఇవ్వకుండా ప్రశ్న అడిగారు.

4. హరి సందీప్‌, పుట్టిన చోటు రాయలేదు

హైదరాబాద్‌గా తీసుకున్నాం, వివాహం ఈ సంవత్సరమేనా?

మీకు 7లో రాహువు, వివాహ కారకుడు గురుడు 8లో, మార్చి తర్వాత బుధుడిలో శుక్ర దశ నడుస్తుంది. గురు బలం కొంత మాత్రమే ఉంది. ఈ గ్రహాలకి శాంతి పరిహారాలు అవసరం, వివాహానికి పారాయణ శ్లోకం చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

Ask Your astrologer to clear your doubts about future

5. గుడ్డాటి రమష్‌, అనంతపూర్‌, ఏది మంచి వృత్తి

మీరు పుట్టిన సమయం ఇవ్వలేదు, పేరాలకొద్ది ప్రశ్నలు రాసారు, తెలుగులో రాయండి, చిన్నగా రాయండి. జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.

6. ప్రగతి.జి, నిజామాబాద్‌, సంతానం, స్వంత ఇల్లు

మీకు సంతాన భావం బాగానే ఉంది, కానీ సంతాన కారకుడు వ్యయంలో ఉండి, కుజుడి చేత చూడబడటం వల్ల ఆకుజుడుకూడా రాహువుతో కలిసుండటం వల్ల ఒక్కోసారి సమస్యలు రావచ్చు, మీ భర్త జాతకాన్ని కూడా ఒక సారి పరిశీలించండి. స్వంత ఇంటికి కూడా అవకాశం ఉంది కానీ రాహువు దుష్ప్రభావం ఎక్కువగా ఉంది .దాహువుకు శాంతి దాన పరిహారాలు చేసుకోండి మరిన్ని వివరాలకి కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

7. రాజేష్‌ వై, పుట్టిన చోటు ,మయం రాయలేదు

మీకు సాఫ్టవేర్‌ జాబేనా కాదా చెప్పగలమ కానీ మీ పుట్టిన సమయం చోటు, పంపాలి.

8. వీరవేంకట పల్లయ్య మర్నీడి, సామల్కోట, వృత్తి ?

వృత్తి కారకుడు, వ్యయాధిపతి శనితో కలిసి, 7లో ఉన్నాడు. రాహువు దశ నడుస్తుంది, కానీ మీకు గోచారంలో శని బాగాలేదు. మీరనుకున్నట్లు ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్టులు మీకు అంతగా యోగించవు.

9. వెంకట సునీత, వెంకట రాము, వివాహంలో గొడవలు

మీ దాంపత్యంలో గొడవలు ఎలాంటివో తెలియాలి, ఇద్దరి పుట్టిన వివరాలు కావాలి.

10. మదన్‌ శంకర్‌ రెడ్డి, మైదుకర్‌, నేను ఉద్యోగం పొందుతానా?

తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది.

11. మహేష్‌ మద్ది కుంట, కరీంనగర్‌, ప్రేమవివాహం

మీ జాతకంలో ప్రేమకి అవకాశం ఉంది, కానీ పెళ్లి కాకపోవచ్చు ఐనా సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

12. రత్న కుమార్‌ బాతల, పుట్టిన చోటు రాయలేదు, వివాహం

వివాహం వివరాలు అడిగారు, వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చు కున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చు కున్నారా / స్పష్టంగా రాయండి.

13. తీగల సుధాకర్‌, పెద్ద పల్లి, ఉద్యొగం

మీకు ఉద్యోగ భావాధిపతి, వ్యయాధిపతి కుజుడితో కలిసి, 6లో ఉన్నాడు, దశ కూడా బాగాలేదు, గోచారంలో గ్రహానుకూలతలు లేవు,కొంత కాలం దాకా ఆగండి, కుజ, శని, గురులకి దానాలు పరిహారాలు చేసుకోండి.

14. వి, రాఘవేంద్ర రాజీవన్‌, భవిష్యత్తు

పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి.చదివి మీప్రశ్న పంపండి.

15. లక్ష్మీ మానస, కుజ దోషమంటే ?

ఇవ్వబడ్డ చార్ట్‌లో చూసినట్టయితే, లగ్నాత్‌ 12, 1, 2, 4, 5, 7, 8, 10, లలో కుజుడుంటే దాన్ని కుజదోష మంటారు.

సందేహాలకు సమాధానాలు: పాఠకులకు విన్నపం

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+