ప్రేమ వివాహం: ఆ అమ్మాయా, కాదా?
1.పి.మనోజ్ రాఘవ
పుట్టినచోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం. మీకు వృత్తిస్థానాన్ని శని చూడటం ఒకసమస్య అంతకుమించి ఏ దోషాలులేవు శనిగ్రహానికి ప్రీతిగా పరిహారాలు దానాలు చేస్తూండండి.
2.బాజి ఉప్పల, ప్రభుత్వోద్యోగం
ప్రభుత్వోద్యోగం ఉందీ లేందీ చెప్పడానికి పుట్టిన చోటు సమయాలు తప్పక రాయాలి. ఒకవేళ మీకు వివరాలులేకుండా ఉంటే పుణ్యకార్యాలు చేస్తూ, గట్టిగా సాధన చేయండి.
3.వెట్చా వీరభద్రరావు, విదేశగమనం
మీకు విదేశగమనానికి అవకాశం ఉంది, కానీ సమస్యలతో మీ వృత్తి ఉంటుంది. దానధర్మాలు పుణ్యకార్యాలు చేస్తూండండి.
4.బాలాజి కసిరెడ్డి, తాడేపల్లిగూడెం, ప్రేమవివాహం
మీకు ప్రేమవివాహం అయ్యే అవకాశం ఉంది.కానీ ఆ అమ్మాయేనో కాదో చెప్పలేం.
నవగ్రహాలకి జపాలు పరిహారాలు
5.మౌనిక లక్కీ (పుట్టినచోటు ,సమయం రాయలేదు )ఉద్యోగం అనిప్రశ్న వేసారు.
ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
6.శ్రవణ్ మెరుగు,వరంగల్,కుటుంబ సమస్యలు
మీకు గోచారంలో రాహు,కేతువుల ప్రభావం,జాతకంలో శని ప్రభావం ఇవి మీకు పని, సంపాదన,కుటుంబ సౌఖ్యనష్టములకు కారణం వీటికి దాన పరిహారాలు చేస్తూండండి. కనకధారా స్తోత్రం వంటివి చదవండి, దానధర్మాలు చేస్తూండండి. మెల్లిగా పరిస్థితులు మీ కోరికలు తీరుతాయి. సమస్యలు 2016 ఫిబ్రరితర్వాత మీ చేతిలోకి వస్తాయి. శుభం.
7. నాగేంద్రప్రసాద్ రెడ్డి, చెరువుకొమ్ముపాలెం, వ్యాపారారంభం
మీరు పంపిన వివరాలలో సమయంకానీ, నక్షత్రంకానీ లేవు మీరు పంపితే మీ జాతకానికి ఏది మంచిదో చెప్పగలం.

8.టి.ఆర్.వి.కె కుమార్, పునర్వివాహం
పేరాల కొద్దీ ప్రశ్నలడిగి చివరకు మీ వివరాలివ్వలేదు.
9. సుధీర్‌బాబు, నెల్లూరు, వివాహం
మీ జాతకంలో 7లో పాపగ్రహాలు, ప్రస్తుతం రాహువు దశ, గోచారంలో గురుబలం లేకపోవడం ఇవన్నీ వివాహం కాకపోవడానికి కారణాలు. సూర్య, శుక్ర, రాహువులకు పరిహారంచేసుకోండి. సెప్టెంబర్ తర్వాత ప్రయత్నించండి.
10.అనిల్ కుమార్ మధుసూదన్, నెల్లూరు
మీరిచ్చిన వివరాలప్రకారం మ్యాచింగ్ కలిసింది కానీ ఇద్దరికీ సంతాన బలహీనతలున్నాయి. ఇద్దరికీ 7వభావనికి 8వభావంతో సంబంధాలున్నాయి. దీన్నే సౌభాగ్యదోషమంటారు. కనీసం ఒకరి జాతకమైనా సపోర్ట్ ఇవ్వటంలేదు. వీలైతే వదులుకోండి.
11.రాజబోయినరవి, గుడివాడ, భవిష్యత్
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
12.రవి (కుమారునికి పేరు) హైదరాబాదు
మీ కుమారునికి బాలారిష్టదోషాలు లేవు. జనన తిథిదోషాలు కూడా లేవు, క అనే అక్షరంతో సరి సంఖ్యలో పేరుపెట్టుకోండి.
13. సురేష్ తన్నెడి, భవిష్యత్
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
14. రాజేష్ (పుట్టినచోటు,సమయంరాయలేదు)
విదేశంగమనం గురించి అడిగారు ఇలాంటివాటికి వివరాలు అవసరం.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications