జ్యోతిష్కుడేమంటున్నాడు: వ్యాపారమే మంచిదా?
1.మణికంఠస్వామి మోర్ల, పుట్టిన చోటురాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం, వ్యాపారంలో కలిసి రావటంలేదు
మీకు జాతకరీత్యా 2లో కేతువు , 8లో రాహువున్నాడు. గోచారంకూడా బాగాలేదు,వృత్తిభావం బలంగా ఉంది కానీ మీవర్గ స్థానమే బాగాలేదు. ఏది చేసినా ఇంతే, అర్ధాష్టమ శని నడుస్తుంది, దీనికి ముందు దానగుణం పెంచుకోండి,లక్ష్మి అష్టోత్తర శతనామస్తోత్రం చదువుతుండండి. శని, రాహు, కేతువులకి దానాలు పరిహారాలూ చేస్తూండండి.
2. కలకోట కింగ్ ఉదయ్
పుట్టినచోటు రాయలేదు. ప్రశ్నకూడా రాయలేదు.
3.ఎనుగాల సుధీర్ కుమార్, గోదావరిఖని, ప్రభుత్వోద్యోగం
మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది కానీ కొంతే ఉంది, చంద్రుడికి, కుజ కేతువులకి పరిహారాలు దానాలు చేస్తూండండి. గురుబలం నడుస్తుంది గట్టిగా ప్రయత్నించండి, తగలొచ్చు.
4 .మించాల రాకేష్
పుట్టిన చోటు, సమయం రాయలేదు, వివరాలు పరిస్థితి చెప్పారు. ప్రశ్న ఆడగలేదు.

5. కిరణ్ కుమార్ కొల్లూరు, పుట్టినచోటు సమయం రాయలేదు, ఉద్యోగంలో సమస్య
మీ జాతకం పూర్తిగా చూడటానికి సమయం చోటు ఇవ్వలేదు కానీ, మీరు దానాలు చేస్తూండండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే మంత్రం చదువుతూండండి, శనికి దానం చేస్తుండండి, శ్రీరాజమాతంగ్యైనమ: అనే మంత్రం చదువుతూండండి. మైల్లిగా చక్కబడుతాయి.
6. జక్కుల స్వామి, పుట్టిన వివరాలు ఏవీ ఇవ్వలేదు ,విదేశాలు వెళ్లవచ్చా.
మీ పేరుని బట్టిస్వామి అని కుంభరాశిగా తీసుకుంటే వెళ్లవచ్చు. పని అవుతుంది.
7. డబ్బుగొట్టు నాగార్జున రావు, ప్రభుత్వోద్యోగం
వివరాలు పంపండి.
8.వెంకటరమణారెడ్డి, ఉద్యోగం
మీకు ఉద్యోగవిషయంగా శని శాంతి అవసరం, శ్రీరాజమాతంగ్యై నమ: అనే మంత్రం చేస్తూండండి.
9. శ్రీప్రసాద్ కుడక, బిక్కవోలు, వ్యాపారమా? ఉద్యోగమా,
మీకు వ్యాపారం మంచిది.
10. రామాచారి, కెరియర్
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
11.శ్రీరాం శ్రీఖాకోలపు,అమలాపురం,ఉద్యోగం
ఉద్యోగం రావడానికి అనుకూలంగా మరొక రెండేళ్లు వరకూ అనుకూలత ఉంది, గురు గ్రహం ప్రతికూలంగా ఉంది. అదే గ్రహ దశనడుస్తూంది. దానికి దానాలు పరిహారాలు వంటివి చేసుకోవడం ద్వారా పుణ్యబలం పెంచుకోవడం ద్వారా వీలైనంత త్వరగా మీరు పొందవచ్చు.
12. సునీత యలమర్ల, ప్రేమవివాహం
మీకు జాతకరీత్యా ప్రేమ వివాహం కాదు.
13. వెంకటి, కెరియర్
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.
14. పూర్న చందర్ రావు 1988, విదేశాలకి వెళ్లవచ్చా?
మీకు విదేశాలకి అవకాశంలేదు
15. యశ్వంత్, బెంగుళూర్, ప్రభుత్వోద్యోగం
మీకు జాతకానుసారంగా ప్రభుత్వోద్యోగానికి అవకాశం లేదు.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications