ఉద్యోగాలపై ప్రశ్నలు: జ్యోతిష్కుడేమంటున్నారు?

1. నిదమనూరి గణేష్‌, ఒంగోల్‌, ఉద్యోగం

మీకు శనిలో వ్యయాధిపతి గురుడి దశ నడుస్తుంది, ఆగురుడు జాతకంలో 8లో ఉన్నాడు. మీరు అసలు మీకు పుష్యరాగం పనికి రాదు ధరించకండి. మీరు నీలం కానీ వజ్రం కానీ ధరించవచ్చు. శనికి పరిహారం చేసుకోండి. శ్రీ రాజమాంగ్యై నమ: అనే మంత్రం జపిస్తూండండి.

2. పెర్ల బాబులేరెడ్డి, వెంపల్లె, విదేశగమనం,

మీకు విదేశాలకి వెళ్లె అవకాశం ఉంది. ఏలినాటి శని ప్రభావం కూడా కొంత సమస్యకావచ్చు శనికి దాన పరిహారాలు చేసుకోండి.

3. షమ్మ షేక్‌, పుట్టిన చోటు, సమయం ఇవ్వలేదు

భవిష్యత్తు, ప్రేమవివాహం ఇలాంటివాటికి వివరాలు తప్పక కావాలి, ఒకసారి కింద ఇచ్చిన నియమాలు చదివి ప్రశ్నలు పంపండి.

4. రాజేష్‌ కుమార్‌, ఆత్మకూరు, ఉద్యోగం,

మీకు కాలసర్ప దోషం ఉంది, అందులోనూ ఉద్యోగ భావంతో సంబంధంగా ఉంది, దశమ కేరువు, 4వ రాహువు ఉన్నాడు, జూన్‌ తర్వాతే మీకు మంచి ఉద్యోగం వస్తుంది. శనికి దానాలు పరిహారాలు చేసుకోవడం అవసరం,శ్రీ రాజమాతంగ్యై నమ: అనే మంత్రం జపిస్తూండండి.అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

Astrologer answers readers questions on jobs

5. రజినికాంత్‌ .డి, వరంగల్‌, ఆరోగ్యం, ఉద్యోగం

శని అష్టమధిపతి శనిదశ, ఏలినాటిశని పీడ అనారోగ్యం, అపనింద, అప్పులబాధ, పని ఒత్తిడి వంటివాటికి కారణం, ముందు శని, రాహు, కేతువులకి దానపరిహారాలు చేసుకోండి.అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

6. మధుసూదనరావు, విశాఖ పట్ణం,

భవిష్యత్తు, వివాహం ఇలా శీర్షికలు పెట్టి వదిలేయకుండా ఒక అంశం ఎంచుకొని అందులో దానిని గురించి ఏదైనా ఒక ప్రశ్న అడగండి. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.

7. బాబ్జి, చిత్తూరు, ఆర్థికస్థితి

పుట్టిన సమయం మధ్యాహ్నం 1నుంచి 4లోపు అని ఇచ్చారు, అంత తేడా ఉంటే 2 లగ్నాలు మారిపోతాయి, అరగంట అటూ ఇటుగా ఇవ్వండి. చూసుకోండి.

8. మదల విజయ్‌, చిలకలూరిపేట, ప్రభుత్వోద్యోగం

మీకు జాతకరీత్యా ప్రభుత్వోద్యోగం రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

9. శివరాం, గుంటూరు, జాతకం

మీ జాతకం గురించి చెప్పమంటే ఏంచెప్పాలి ప్రశ్న సరిగ్గా అడగండి,పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.

10. అవధానం వినయ్‌ కుమార్‌, పుట్టినచోటు రాయలేదు

మీరు 1991అని 1992 అని రెండిచ్చారు ఏది తీసుకోవాలో చెప్పలేదు, పుట్టిన చోటుకూడాపంపండి, కింద ఇచ్చిన నియమాలు చదవండి.

11. వెంకట రామకృష్ణ, పుట్టినచోటు రాయలేదు, ప్రభుత్వోద్యోగం

పుట్టిన సమయం చోట్లు తప్పక రాయాలి. వీలైనంతవారకు తెలుగులో రాయండి.

12. శ్రీపతి మూలింటి, మహబూబ్‌ నగర్‌, ప్రభుత్వోద్యోగం

మీకు జాతకరీత్యా ప్రభుత్వోద్యోగం రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

13. మాధవీలత, కడప, ప్రభుత్వోద్యోగం వస్తుందా?

మీకు ప్రభుత్వోద్యోగం వస్తుంది.

14. హరి కృష్ణ వారణాసి, బొబ్బిలి, ప్రమోషన్‌

ఏలినాటి శని దశ నడుస్తుంది, రాహువులో గురుడు నడుస్తున్నాడు, కష్టకాలం, ఉద్యోగం మర్పిడికి అవకాషం ఉంది కానీ అది ప్రమోషన్‌ అనిచెప్పలేం, శని రాహువులకి ప్రీతిగా దానాలు పరిహారాలు చేసుకుంటూ శ్రీ రాజమాతంగ్యై నమ: అనే మంత్రం జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

15. మహ్మద్‌ ఆసిఫ్‌ హుస్సేన్‌, పుట్టిన చోటు సమయాలు రాయలేదు, బ్యాంక్‌ పరీక్ష

మీరు వివరాలివ్వలేదు, కానీ పేరుని బట్టి గురుబలం బాగానే ఉంది. హయగ్రీవ మంత్రం జపిస్తూండండి. శుభం

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+