పెళ్లికి ఆటంకాలు: జ్యోతిష్కుడి మాటేమిటి?
1. సురేంద్ర రెడ్డి.బి, రాజంపేట, పిల్లల జాతకం, ఆర్థిక స్థితి
మీ జాతక రీత్యా 8వ అధిపతి చంద్రుడు, 2లో కేతువుల దుష్ప్రభావం ఉంది, కానీ ఇప్పుడు గోచారం బాగానే ఉంది, ఈ గ్రహాలకి దానాలు చేస్తూ ఉండండి. ఇక మీ పిల్లల గురిం చి అడిగారు ఏం అడగదల్చుకున్నారో స్పష్టంగా పంపండి.
2. బుసమ్మగారి శ్రీకాంత్, లాగుమద్దెపల్లి (కర్ణాటక), పెళ్లి, పెళ్లి జీవితం
పెళ్లికి ఆటంకాలు ఉన్నాయి, 7వఅధిపతి శని వ్యయాధిపతిచేత చూడబడటం, రాహువుదశ నడుస్తూ ఉండటం, శని వక్రించడం, కానీ గురుబలం ఉంది, ఈగ్రహాలకి దానాలు శాంతి పరిహారాలు చేసుకోండి, వివాహానికి నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో ఒక మంత్రం ఇచ్చాం అది చదవండి, ఇక మీ వావాహిక జీవితం సంతృప్తికరంగానే ఉంటుంది.
3. పి.యస్.డి. మాణిక్యరావు, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, ఉద్యోగ మార్పిడి
సెప్టెంబర్ తర్వాత కొంత మార్పు వస్తుంది, ఐయే రాహువు దశ అవడం వల్ల మీకు 3లో ఉన్నాడు, ఈ దశలోనే లైఫ్ సెటిల్ మెంట్ అవుతుంది.
4. రతన్ కుమార్ బతల, మదన పల్లె, పెళ్లి ఎప్పుడు అవుతుంది
గురు, రాహు కేతువుల దుష్ప్రభావం, వల్ల ఆటంకాలు కఉగుతాయి, గోచారం, నవాంశ అన్నీ అనుకూలిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఒక సంవత్సరం లోపు బాగుంటుంది, తప్పక వివాహం అవుతుంది
5. బాబు కరణం, పుట్టినచోటు రాయలేదు
ప్రశ్నలో గవర్నమెంట్ జాబ్ అనే దం అర్థమైంది మిగిలింది ఏం అర్థం కాలేదు, తెలుగులో ప్రశ్న పంపండి.
6. అరునోదయ బొడ్ల, ఆదిలాబాద్, ప్రేమ వివాహం
ఇక్కడ మీజాతకంలో 2 చెప్పాల్సిన అంశాలున్నాయి, మొదటిది ప్రేమ వివాహానికి కొంత అవకాశం ఉంది, ఐతే 5వ అధిపతి శని చూడటం మాత్రమే జరిగింది, 7లో కేతువు ఉన్నాడు. ఆటంకం జరుగవచ్చు. ప్రేమ మాత్రమే కానీ పెళ్లిదాకా వెళ్లక పోవచ్చు.

7. శ్యామ్ కుమార్, పుట్టిన చోటు రాయలేదు, ప్రేమ వివాహం,
మీరు నియమాలు చదువుకోవాలి, మీకు ప్రేమవివాహం అయ్యేదీ లేనిదీ చెప్పగలం కానీ, ఒక అమ్మయి వివారం ఇచ్చి ఆఅమ్మాయితో అయ్యేదీ లేందీ చెప్పడం కుదరదు.
8. కంపర శ్రీనివాసరావు, విశాఖ పట్ణం, గవర్నమెంట్ జాబ్
ప్రభుత్వోద్యోగానికి తప్పకుండా పుట్టిన సమయం కావాలి,
9. మధుసూదన్ రావు, విశాఖ పట్నం, ప్రభుత్వోద్యోగం
ప్రభుత్వోద్యోగానికి మీకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
10. రామ కృష్ణ, విజయవడ, కుమార్తె వివాహం
మీ కుమార్తెకి, మరొక 3 సంవత్సరాల తర్వాతనుంచు 3 సంవత్సరాలపాటు అనుకూలత ఉంది, ఐనా 16 సంవత్సరాల అమ్మాయి గురించి అప్పుడే ఆలోచించ కండి, ఆ అమ్మాయికి ఏలినాటి శని నడుస్తుంది. శనికి పరిహారాలు చేసుకోండి.
11. కొమ్ము రోజు వీరభద్రాచారి
పుట్టిన సమయం చోటు, ప్రశ్న సరిగ్గారాయండి
12. నారాయణ, కెయర్
భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
13. బిందుమణి, నంద్యాల, ఉద్యోగం
భాగ్యాధిపతి రాహువు నక్షత్రం మీద ఉన్నాడు, దశమంలో కేతువున్నాడు, ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తూ ఉన్నది, ఉద్యోగం దొరకడానికి తక్కువ, తప్పిపోవడానికి అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. పై గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకొని, శ్రీరాజమాతంగ్యై నమ: అనే మంత్రం ఎక్కువగా జపిస్తూ ఉండండి.
14. యం.శ్రీనివాసరావు, సంతాన సమస్య,
పుట్టిన వివరాలు సమయం చోట్లు ఇద్దరివీ కావాలి,మీ భార్య జాతకం కూడా చూడాల్సి ఉంటుంది.
15. సావిత్రి యాదవ్, కెరియర్
భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications