ప్రేమ పెళ్లి: జ్యోతిష్కుడిని అడిగి తెలుసుకోండి
1.గురుప్రసాద్,1984,ఉద్యోగం
సరైన ఉద్యోగం దొరకలేదన్నారు. ముందు ఏదో ఒకద్యోగంలో చేరండి. మీ నక్షత్రం లేదా పుట్టిన సమయం చోటు ఇచ్చినా చెప్పగలం.
2.రజిత,గుంటూరు,
మీ ప్రశ్న అర్థం కాలేదు. భవిష్యత్‌వంటి వాటి గురించి చెప్పటానికిది వేదిక కాదు. చిన్న సూచనలవేదిక మాత్రమే.
3. మధు,పుట్టిన చోటురాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం,పునర్వివాహం
9లో రాహువు కుజుడితోకలిసుండటం,7వఅధిపతి రాహువునక్షత్రంమీద ఉండటం, కొన్ని కారణాలు.
ఐతే ఇప్పుడు దశ కూడా రాహువు దశ నడుస్తుంది, ఓచారంలో 8వ శని ముందు పైగ్రహాలకి పరిహారం చేసుకోండి. ఆగస్ట్ తర్వాత కొంతమెరుగవుతుంది.జాతకాలు పరిశీలించుకొని వివాహం చేసుకోండి.
4.సురేంద్రబాబు మువ్వా, విదేశ గమనం
మీరు నక్షత్రం మాత్రమే ఇచ్చారు. పుట్టిన చోటు సమయాలిస్తే చెప్పేవాళ్లంయ నక్షత్రం ద్వారా ఇప్పటి స్థితి మాత్రమే చెప్పవచ్చు. యోగాలు చెప్పలేం.
5.కృష్ణమాచార్యులు,రాజమండ్రి,ఉద్యోగం
ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం మంచిబ లముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
6. నాగేశ్వరరావు చలంకూరి, పుట్టి నచోటు రాయలేదుహైదరాబాద్‌గా తీసుకున్నాం, ఉద్యోగం
మీకు ఉద్యోగస్థానంలో 8వఅధిపతి శుక్రుడున్నాడు. శుక్రునికి పరిహారంచేసుకోండి. ఆగస్ట్ తర్వాత మంచి ఫలితాలుంటాయి కానీ శుక్ర,శని,రాహుకేతువులకు పరిహారంచేసుకొండి.
7. జయప్రకాష్, పుత్తూర్, కెరియర్
మీ గోల్ నిజానికి మాకు తెలియదు. అవి చర్చించేవి కానీ ఇలా సూచనలిచ్చే చిన్నవేదికలో అందించేవి కావు.పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదెైనా ఒక ప్రశ్న అడగండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
8. నవీన్‌కుమార్ .ఐ, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, సమయం 8గంటలుగా తీసుకున్నాం.
మీది వృషభరాశి ఐంది. శనిరాహు కేతువులకి పరిహారంచేసుకోండి. దానాలు చేస్తూండండి.
9. యరమల శ్రీలక్ష్మీ, వరంగల్, సంతానం
మీకు జాతకరీత్యా సంతానంపై కుజ గ్రహపు దుష్ప్రభావం ఉంది కానీ, మీ భర్త జాతకం కూడా కొంత సపోర్ట్ ఇస్తే తప్పక ఫలిస్తుంది, కుజునికి పరిహారం చేసుకోండి.
10.సతీష్‌కుమార్ దండు.కెరియర్
పుట్టిన చోటు, సమయం రాయలేదు మీరిచ్చిన వివరాలతో చెప్పడం కుదరదు, భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
11. ధనుంజయ్ వడ్డె, తోర్నగల్ (బళ్లారి),వివాహం
మీకు ప్రేమవివాహానికి అవకాశం ఉంది, కానీ సమస్యలుంటాయి, ప్రస్తుతం అనుకూలదశ నడవటంలేదు. కుజగ్రహం,శనిగ్రహాలకి పరిహారంచేసుకోవాలి 2017,18మధ్యకాలం కొంతఅనుకూలం ఉంది.
12. శ్రీనివాసరావు వెనిగళ్ల, కూచిపూడి, కెరియర్,వివాహం
భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలం ఉందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
13.పృథ్వీనాథ్‌రెడ్డి,ఆత్మకూర్,ప్రభుత్వోద్యోగం
మీకు జాతకరీత్యా అనుకూలతలు తక్కువగా ఉన్నాయి, పుణ్యకార్యాలు చేస్తూ ప్రయత్నం చేయండి.
14. ప్రదీప్‌సింగ్ నగ్‌పాల్, నిజామాబాద్, ఉద్యోగం
మీకు బుధ, రవి, కుజ, రాహువులకు పరిహారం చేసుకోండి ప్రస్తుతం వ్యతిరేకంగా ఉంది. 2016 ఫిబ్రవరి తర్వాత కొంత బాగవుతుంది.
15. పురుషోత్తంరెడ్డి పి, భార్యకిఉద్యోగం
మీరిచ్చిన వివరాలతో ఉద్యోగం ఎప్పుడు అనుకూలత చెప్పడం కుదరదు. కనీసం నక్షత్రమైనా రాయలేదు.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications