జ్యోతిషం: కాలసర్పదోషం ఇబ్బింది పెడుతుందా?

1. కె.రాజశేఖర రెడ్డి, పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం,ఆర్థికసమస్యలు

మీ జాతకం ప్రకారం 2లో పాపగ్రహాలున్నాయి. అష్టకవర్గులో లాభం తక్కువ సంఖ్యతో ఉంది. గోచారమూ బాగా లేదు. ఎక్కువ దానాలు చేసుకోవాలి. శుక్ర బుధ సూర్యులకి దానాలు పరిహారాలు చేసుకోండి. లక్ష్మీ నామాలు ఎక్కువగా చదవండి.

2. అశోక్‌ కురపాటి, నరసరావుపేట, విదేశగమనం

మీకు విదేశగమనానికి అవకాశం తక్కువగా ఉంది, దానికి మీరు చేయవలసింది దానాలు, బుధకుజ, కేతువులకి చేస్తూండండి. మరొక సంవత్సరం లో మీకు విదేశగమననానికి అవకాశం ఉంది. 2016 నవంబర్‌లో మంచి కాలం ఉంది. ప్రయత్నించండి. మరొక మాట మేం వెబ్‌ సైట్‌ ద్వారా చేసే సేవలు వ్యక్తిగతంగా మెయిల్స్‌కి పంపడం కుదరదు. మీరు మీ సమాధానాలు వెబ్‌సైట్‌లోని ఆర్టికల్‌ ద్వారానే తెలుసుకోవాలి.

3.అజయ్‌ కుమార్‌, వైజాగ్‌, భవిష్యత్తు

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

4. ఆదిభట్ల శ్రీదేవి, బొబ్బిలి, వివాహం, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది. కాని కుజుడు అనుకూలత వల్ల ప్రయత్నిస్తే కొంత ఫలితం ఉంటుంది, వివాహానికి తేదీ చెప్పినా అడ్డుపడే గ్రహస్తితిని గురించి ముందు మీరు తెలుసుకోండి. లగ్న, కేతు, 7రాహువు, 7లో 8వ అధిపతిశని, ఇలాంటివన్నీ అడ్డంకులే. కాలసర్పదోషం అందరికీ ఇబ్బంది కాదు. కానీ మీ జాతకంలో కొంత సమస్యని తేవచ్చు, గోచారంలో రాహుకేతువుల ప్రతికూలత ఉంది, గురుబలం సహకరిస్తుంది కాబట్టి మీరు పైగ్రహాలకి శాంతిచేసుకుని, దానాలు చేస్తూ మేం కింద నవగ్రహాలకి పరిహారాలు అనే ఆర్టికల్‌లో అందించిన వివాహ శ్లోకం జపిస్తూండండి.

5. రాజశేఖర్‌ నరిషెట్టి, మైలవరం, ఉద్యోగం తిరిగి వస్తుందా

పుట్టిన సమయం ఇవ్వలేదు కనుక పేరుని బట్టి చెపుతున్నాం, మీ గోచరరీత్యా ఏలినాటిశని నడుస్తున్నదియ ద్వాదశంలో రాహువున్నాడు, కొంతకాలం ఓపిక పట్టాలి, శనికి దానాలు జపాలు చేస్తూండండి. శ్రీ రాజమాతంగ్యైనమ: అనేమంత్రం జపిస్తూండండి.

6. వెంకట రమణ, పుట్టినచోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, ఏ వృత్తి సరిపోతుంది

మీకు వృత్తికారకుడు అడ్మినిస్ట్రేషన్‌,మేనేజ్‌ మెంట్‌ సంబంధిత వృత్తులు, పోలీసు, భూసంబంధ వృత్తులు మంచివి.

7. శ్రీరమణ, హైదరాబాదు, ప్రేమవివాహం

మీకు జాతకరీత్యా ప్రేమవివాహానికి అవకాశం లేదు.

 Astrologer answers your questions

8. నరేష్‌రెడ్డి, నిజామాబాద్‌, ప్రభుత్వోద్యోగం

మీకు జాతకరీత్యా ప్రభుత్వోద్యోగ సూచనలు లేవు.

9. సుబ్రహ్మణ్యం, బెంగుళూరు, విదేశగమనం

మీకు జాతకరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లేదు.

10. అప్పారావు యలమంచిలి, ఏలినాటి శని ఉందా

మీకు జాతకంలో ఏలినాటి శనిలేదు, మరో 7 సంవత్సరాల వరకూ కూడా లేదు.

11. శ్రవణ్‌ఉమార్‌ గండవరం, నెల్లూరు, జాతకం

జాతకంలో చాలా అంశాలుమటాయి. అందులో మీరు ఏం అడగాలనుకున్నారో చెప్పలేదు. పూర్తిగా చెప్పడం కుదరదు. ఏదైనా ఒక చిన్న ప్రశ్న అడగండి.

12. కృష్ణప్రసాద్‌, నిజామాబాద్‌, సంతానం

మీ జాతకంలో 5లో కేతువు, 5వగురుడు అధిపతి 6లో ఉన్నాడు, గోచారమూ బాగాలేదు, మీరు వీటికి దానాలు పరిహారాలు చెసుకోండి. మీ భార్య జాతకానుకూలతని చూడాలి వివరాలు పంపండి.

13. చరణ్‌కుమార్‌, కావలి, వివాహం

మీకు వివాహభావం పాపార్గళతో కలిసి ఉంది, లగ్నాన్ని కుజుడు చూడటం, వివాహభావాన్ని సూర్యుడు చూడటం, వివాహభావాధిపతి బుధుడు వ్యయంలో ఉండటం ఇవి సమస్యకారకాలు. వీటికి శాంతి పరిహారాలు చేసుకొని, దానాలుచేస్తూ వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదువుతూండండి. అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. మీకిప్పుడు వివాహానికి గురుబలం ఉంది.

14. గాజుల మహేష్‌, కరీంనగర్‌, ఆరోగ్యం

మీకు గోచారంలో 8వ శని, 6లో రాహువు, వ్యయంలో కేతువు, సూర్యుడిలో రాహువు అంతర్దశ నడుస్తుంది వీటికి దానాలు పరిహారాలు చేసుకోండి, క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం జపిస్తూండండి, 2017 మార్చి తర్వాత ఆరోగ్యం బాగవుతుంది.

15. వేంకట సత్యనారాయణ గుత్తుల, ప్రభుత్వోద్యోగం

పుట్టిన సమయంకానీ, చోటుకానీ, నక్షత్రంకానీ ఇవ్వలేదు ఎలా చెప్పాలి?

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+