జ్యోతిషం: అయ్యో, ప్రేమ పెళ్లికి ఛాన్స్ మిస్?

1. గుడ్డేటి విజయ్‌ కృష్ణ, కోయిల కుంట, ఉద్యోగం

ఉద్యోగ కారకుడు నవాంశలో ఉచ్ఛలో ఉన్నాడు. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఐతే, ఎప్పుడు అనడానికి ఆగస్ట్‌లోపు అనుకూలత బాగుంది ప్రయత్నించండి. కుజ, గురులకి దానాలు పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

2. గూడ లక్ష్మణ్‌, నిజామాబాద్‌, ప్రభుత్వోద్యోగం

పుట్టిన వివరాలు లేవు పంపండి.

3. సంపత్‌ రావు, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, ఉద్యోగం

ఉద్యోగ కారకుడు నవాంశలో స్వంత రాశిలో ఉన్నాడు. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఐతే, ఎప్పుడు అనడానికి ఆగస్ట్‌లోపు అనుకూలత బాగుంది ప్రయత్నించండి.

4. జనార్దన్‌ కాల్వ, ఉప్పల పాడు, ఉద్యోగం

ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

Astrologer clears your doubts on future

5. రాజేష్‌ బందపల్లి, మదనపల్లి, పెళ్లి

నేను పెళ్లి చేసుకుంటానా లేదా అని అడిగారు, అది మీకు తెలియాలి, మీ సమస్యేంటో అడగండి, సరదా మాటలు రాయకండి, జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.

6. అరవింద్‌ కుమార్‌, కరీంనగర్‌, విదేశాలకి వెళతానా?

మీరు విదేశాలకి వెళతారు.

7. మందపాటి సుచరిత ( సోదరి వివాహం) గూడూరు,

వివాహ భావాధిపతి 8వ అధిపతి కుజుడి చేత చూడబడుతున్నాడు. గురుడి దశలో వ్యయాధితి రవి అంతర్దశ నడుస్తుంది, గోచారం బాగాలేదు. రవి, కుజులకి దానాలు చేస్తూ వివాహానికి మేం ఇచ్చిన పరిహారాలలో ''శ్లోకాల్ని చదువుతూ ఉండండి ''. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

8. ఆనంద్‌ పసుపునేటి, మాంగల్యదోషం అంటే ఏంటి ? దాని వల్ల పెళ్లికాదా?

జాతక చక్రపు బొమ్మ గమనించండి, 7,8 భావాలకి భావాధిపతులకి, సంబంధం, దృష్టి ఉంటే అది మాంగల్యదోషం అంటారు. ఐతే కొన్ని సార్లు, నవాంశ, మంచి గ్రహాల దృష్టి ఇలాంటి వాటి వల్ల ఆతీవ్రత తగ్గు తుంది. ఐతే ఇలా ఉండటంలో చాలామందికి సమస్యలు రావటం అనేది అనుభవాలలో చాలా మందికి కనబడుతుంది.

9. అనుమల్ల విజయ్‌, కరీంనగర్‌, వివాహం

మీ జాతకంలో 8వఅధిపతి, చంద్రుడు 7లో ఉన్నాడు. బుధుడు వ్యయంలో ఉన్నాడు. 7వ అధీపతిలో 8వఅధిపతి దశ నడుస్తుంది. గురుబలమూ తక్కువగా ఉంది , ఆగస్ట్‌ లోపు ప్రయత్నించండి. చంద్ర, కుజ, బుధ గ్రహాలకి శాంతి చేసుకోండి. వివాహానికి మేం ఇచ్చిన పరిహారాలలో ''శ్లోకాల్ని చదువుతూ ఉండండి ''. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

10. డి. కార్తీక్‌, 23.01.1994 (ప్రభుత్వ ఉద్యోగం)

మీరు పుట్టిన సమయం చోటు రాయాల్సి ఉంటుంది. అలాగైతేనే చెప్పగలం.

11. యం. వామన్‌ రెడ్డి, హుజూరాబాద్‌, భార్యతో సమస్యలు

మీ జాతకంలో వివాహ సంబంధ కాలసర్ప దోషం ఉంది, 7,8,12 అధిపతులు ఒకే ఇంట్లో ఉన్నారు. ఇలా కొన్ని సమస్యలున్నా మీభార్య జాతకం కూడా చూడాలి, సమస్యలేంటో తెలియాలి, మీరు జ్యోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

12. సురేష్‌ సి డి, వ్యాపార సమస్య

మీ సమస్య అర్థమైంది, ఐతే పుట్టిన వివరాలు, మీరు ఏ వ్యాపారం చేసారో ఎప్పటి నుండి చేసారో, చెప్పాలి. అవి ఇవ్వలేదు కనుక, మీరు రోజూ లక్ష్మీ అష్టోతత్తర శత నామ స్తోత్రం చదవండి.

13. తటికొండ భరత్‌, 26/10/1990 , గవర్నమెంట్‌ జాబ్‌

అన్నింటికీ జవాబుంది కానీ వివరాలు లేకుండా స్పష్టమైన సమాధానం కుదరదు. ముట్టిన సమయం చోటు పంపండి.

14. లాస్య, హైదరాబాద్‌, ప్రేమ వివాహం అవుతుందా ?

మీకు ప్రేమ వివాహానికి అవకాశం లేదు.

15. శర్మిల, హైదరాబాద్‌, కెరియర్‌

భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

సందేహాలకు సమాధానాలు: పాఠకులకు విన్నపం

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+