ఏలిననాటి నడుస్తోందా: ఏం చేయమంటారు?

1. అల్లు శ్రీకాంత్‌,

పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, ఆనిమేషన్‌ జాబ్‌ జాతకంలో వృత్తిభావం బాగుంది, రవి ఉచ్ఛలో ఉన్నాడు. కానీ 6లో 8వఅధిపతి శనిఉన్నాడు. లగ్నాధిపతి చంద్రుడు వ్యయంలో ఉన్నాడు. శని దశ నడుస్తుంది. 2018 నుండి స్థిరత్వం వస్తుంది. కానీ శని అస్సలు అనుకూలత లేదు, చాలా పుణ్యబలం కావాలి. పైగ్రహాలకి శాంతి దాన పరిహారాలు చేయించుకోండి. పగడం, కనక పుష్యరాగం ధరించండి. మంచిది.

2. పానుగంటి రాజశేఖర్‌ రెడ్డి, కర్నూలు, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది

ఇప్పుడు ఉద్యోగం వచ్చే దశేనడుస్తుంది, కానీ దశమంలో కేతువు, దశమాధిపతి శుక్రుడు వ్యయాధిపతి చంద్రుడు కలిసి 8లో ఉన్నాడు. అన్నీ ఆటంకాలేజుఏ ప్రయత్న లోపం లేకపోయినా మొదటికే మోసం వస్తుంది. వీటికి దానాలు, పరిహారాలు చేసుకుంటు ఉండండి.

3. కె.సి. రెడ్డి( కిరణ్‌ చందర్‌ రెడ్డి), ఆర్మూర్‌, ఉద్యోగంలో ఉన్నత స్థాయి.

ఉద్యోగంలో ఉన్నతస్థాయికి వెళ్లాలంటే ఎక్కువ దానాలు చేస్తూండాలి. శ్రీ రాజమాతంగ్యై నమ: అనే మంత్రం జపిస్తు ఉండండి.

4. కె. విజయ్‌ రాజు, పిఠాపురం, హోటల్‌ వ్యాపారం సెట్‌ అవుతుందా?

తప్పకుండా సెట్‌ అవుతుంది మీకు ఉపయోగ పడుతుంది.

5. తురక మహేష్‌, గుంటూర్‌, ఉద్యోగం తిరిగి పొందగలనా?

మీరు పుట్టిన సమయం రాయలేదు స్పష్టంగా పరిష్కారం చేయడం కుదరదు, కానీ కన్యారాశి ప్రకారం గురు, రాహు కేతువుల అనుకూలత తక్కువగా ఉంది. వీటికి దానాలు చేసుకుంటూ ఉండాలి. శ్రీ రాజమాతంగ్యై నమ: అనే మంత్రం జపిస్తు ఉండండి.

6. బి. ప్రణయ్‌ కుమార్‌, సూర్యాపేట, ఉద్యోగమార్పిడి.

ఇప్పుడు అనుకూలమని కాదు మరొక సంవత్సరంలో స్థానభ్రంశం జరుగుతుంది. ఐతే ఏలినాటి శని నడుస్తుంది కొంత సమస్యాకాలం, శనికి పరిహారం చేసుకోండి.

7. విశ్వ నాథ్‌, కరింనగర్‌, ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుందా?

తప్పకుండా ఉద్యోగం వస్తుంది.

Astrologer finds solutions for your problems

8. కిరణ్‌ కుమార్‌, 04/02/1982, విశాఖపట్నం

పుట్టిన సమయం రాయలేదు, మీరిచ్చిన వృషభ రాశి ప్రకారం చెప్తున్నాం. శని గురులు అస్సలు అనుకూలంగా లేరు. మరొక సంవత్సరంలో గురుడు, రెండేళ్లకి శని అనుకూలత వస్తుంది. వీటికి దానాలు పరిహారాలు చేస్తూండండి.

9. నాగరాజు, కర్ణాటక, ఉద్యోగం ఏ రంగం

ప్రైవేటురంగంలో మీకు అనుకూలత ఉంది. ప్రభుత్వ రగం తక్కువ అవకాశం ఉంది. సేల్స్‌ డిస్ట్రిబూటర్స్‌ మంచిది మీకు.

10. నర్సప్పనాయుడు, అనంత సాగరం, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది

మీకు ఏలినాటి శని నడుస్తుంది, పంచమ వ్యయాధిపతి దశ నడిస్తుంది, రాహు కేతువులు వృత్తికి ఆటంకాలు కలిగిస్తున్నారు. వీటికి దానాలు పరిహారాలు చాలా అవసరం చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అనే మంత్రం జపిస్తు ఉండండి.

11. అనిల్‌ సారె. భీమ్‌ గల్‌, ఆర్థిక సమస్యలు

రాహువు దశ నడుస్తుంది, అఏ్టమాధిపతి దశమమంలో ఉన్నాడు. పాపగ్రహాలు 2లో ఉన్నాయి. గోచారంలో అర్ధాష్టమ శని, జాతకంలో ద్వితీయ భావంలో కుజశనులు ఉన్నారు. చాలా గడ్డుకాలం వీటికి దానాలు చేస్తూ ,లక్ష్మి అష్టోత్తరం చదువుతూ ఉండండి. మరిన్ని వివరాలు కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

12. విజయ్‌ కుమార్‌ వెండ్ర, రావిగుంట, ఉద్యోగం ఎప్పుడు

ఇప్పుడు వచ్చేదె కానీ గోచారంలో అష్టమ శని, రాహు,కేతువుల ప్రతికూలత ఉంది వీటికి దానాలు పరిహారాలు చేస్తూండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అనే మంత్రం జపిస్తు ఉండండి.

13. నారాయణ, హైదరాబాద్‌, ఉద్యోగంలో మార్పిడి

రాశి ప్రకారం, ఈసంవత్సరం మీకు ట్రాన్స్‌ఫర్‌ తప్పకుండా జరుగుతుంది.

14. తిరుమల, ఇనమన మెల్లూరు, ఉద్యోగం

పుట్టిన వివరాలివ్వలేదు కనుక పేరుని బట్టి ఏలినాటి శని చివరి దశలో ఉంది, గురుబలం బాగుంది, మరొక సంవత్సరం ఆగితే సరిపోతుంది. శని రాహువులకి దానాలు చేసుకోండి.

15. కొందరు జవాబులకింద ఇచ్చెన నియమాలుపాటించనివారు, అర్థంకాని భాషలో రాసినవారు, వివరాలు సరిగా ఇవ్వనివారు , ప్రశ్న నిర్ధిష్టంగా ఇవ్వనివారు (ఉదాహరణ ఉద్యోగం అనిరాసి వదిలేసారు. ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయలేదు) ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.అలాంటి వారి కొందరి వివరాలు.

బి.సాయి వంశీ కృష్ణ రాజు. కర్నూల్‌ ( ఉద్యోగపరంగా విదేశాలకి వెళ్లగలనా?) టైం రాయలేదు

శ్రీకాకులపు కార్తిక్‌ వెంకటేష్‌. చిలకలూరిపేట ( టైం మరీ రెండుగంటలు తేడాతో ఇచ్చారు స్పష్టంగా రాయలేదు)

అహ్మద్‌ వలీ (అనంతపురం) ఉద్యోగం, ఆస్తి గురించి అని అడిగారు అందులో ఏం అడగదల్చుకున్నదీ స్పష్టంగా రాయలేదు.

వెంకటేశ్వర్లు.పి. 21-05-1985 ఉద్యోగం రాయలేదు. పుట్టిన చోటు సమయం అసలే రాయలేదు.

బి.నోబుల్‌ కుమార్‌, చిత్తూర్‌, ఉద్యోగంఅని రాసారు అందులో ఏం అడగదల్చుకున్నదీ స్పష్టంగా రాయలేదు.

యం.శ్రీనువాసరావు, విజయనగరం, జాబ్‌ వస్తుందా? (అసలు ప్రశ్నే సరైందికాదు సరిగ్గారాయండి)

జి. భీమయ్య, మహబూబ్‌ నగర్‌ (సమయం చోటూ ఇవ్వలేదు)

వెంకటేశ్వర్లు. 21-12- 1989 పుట్టిన చోటు రాయలేదు

జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+