నివృత్తి: పెళ్లవుతుందా, ఉద్యోగం వస్తుందా?

(జవాబులు 2 )ఉద్యోగాలు (కొనసాగింపు) ఉద్యోగ జీవితం ఎలాఉంటుంది ?,వైవాహికజీవితం ఎలా ఉంటుంది?కెరయర్‌ ఎలా ఉంటుంది వంటి ప్రశ్నలకు ఇది సమాధానవేదిక కాదు .కొందరు ఉద్యోగం ,పెళ్లిగురించి తెలుసు కోవాలన్నారు (ఏంతెలుసుకోవాలో చెప్పలేదు) కావున జవాబులు ఇవ్వబడవు.

1.రాధాకృష్ణ.కె అనంతపుర్‌ వివాహం

కుజదోషం,రాహువుతోకుజుడి కలయిక,శని 7వ అదిపతిపై కుజుడి దృష్టి మొత్తంగా అనుకూలతలేదు .పుణ్యకాలం గోచారంలో ఉంది.కుజ,రాహు,శనులకు పరిహారం చేసుకొని సుబ్రహ్మణ్య స్త్రోత్రం పారాయణ చేస్తూండండి.కొన్ని నెలలలో మీకు వివాహం ఔతుంది.

2.రాజేష్‌ కుమార్‌ దొంత నల్గొండ (ప్రస్తుతం హైదరాబాద్‌) ఉద్యోగం

ప్రస్తుతం మంచి దశేనడుస్తుంది, 2015 లో మంచి ఉద్యోగం పొందుతారు.వివాహం తార్వాత ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుతారు.చేతనయినంత అన్నదానాలు చేస్తుండండి.

Astrologer Maruthi Sharma answers

3.గనపవరపు సత్యజనార్దన్‌ కైకారం(ప.గో) ఉద్యోగం

రాహు,చంద్రులు ఉద్యోగ స్థానాల్లో ఉన్నారు ఇవి ఇబ్బందిపెట్టటం,కేతు,కుజదృష్టివల్ల ఆర్థిక ,అస్థిరత ఇబ్బందులుంటాయి.కానీ వీటికి శాంతి చేయించుకుని.(శ్రీరాజమాతంగ్యైనమ: అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి) మంచి జరుగుతుంది.6 నెలల వరకూ గోచారం బాగాలేదు దైవదర్శనం చేస్తూ ఉండండి.

4.కృష్ణ అమలాపురం ఉద్యోగం

ఉద్యోగం 10 స్థానంలో 8వ అధిపతి(చంద్రుడితో)కేతువున్నాడు,రాహువుతో చూడబడటం ఈ రెండిటివల్ల ఇబ్బంది చంద్ర,రాహు,కేతువు,లకు శాంతి చేసుకొని,ముత్యాన్ని 8వ స్థాన దోషంపోయేలా సంకల్పంతో పూజ చేయించుకొని ఉంగరపు వేలికి ధరించండి.2015 దాటితే స్థిరత్వం.

5.మంగల లతీష్‌ కుమార్‌ బుక్కపట్నం (అనంతపురం) పెళ్లి ,ఉద్యోగం

ఉద్యోగం లో కొంత ఆలస్యస్థిరత్వం ఉంది,కుజ దోషం కుజదష్టి వల్ల పెళ్లి సకాలంలో జరగనివ్వడు, కుజుడికి పరిహారం చేయించుకొని, పగడం 8వ స్థాన దోషంపోయేలా సంకల్పంతో పూజ చేయించుకొని వేలికి ధరించండి.

6.సంతోష్‌ కుమార్‌ కరీంనగర్‌ (ప్రస్తుతం హైదరాబాద్‌) ఫారెన్‌ ఛాన్స్‌

ఉద్యోగం ప్రశ్న సరిగ్గాలేదు ఫారెన్‌ చదువా (అంటే పాశ్చాత్య చదువులు కంఫ్యూటర్‌ వంటివి ఉంది) కానీ ఫారిన్‌లో చదువులేదు,ఫారెన్‌ యోగం ఉంది కానీ చదువు పరంగా లేదు(ఉద్యోగానికుంది).
మీరెండో ప్రశ్న స్పష్టంగా లేదు .

7.నారాయణ శ్రీకాకుళం ఆర్థిక పరిస్థితులు G మరికొన్ని

1.1వ శని మూలంగా ఆర్థిక స్థితి ఆలస్యంగా ఎదుగుదల ఉంటుంది, 2.ఇంటికారకుడు చంద్రుడు కుజుడితో కలిసి ఉండడం మూలంగా ఇంటినిర్మాణంలొ ఆటంకాలుంటాయి . వీటికి పరిహార శాంతులు దానధర్మాలు చేస్తూండటం మంచిది. 3.మీభార్య లక్ష్మి గారి జాతక వివరాలు రేవతి నక్షత్రం 1వపాదం ,మీనరాశి

8.పృథ్వీ బాలాజి చీరాల (ఉద్యోగంలో సెటిల్‌మెంట్‌ )

మీ జాతకంలో 5వ స్థానంలోని చంద్రుడు ఆదృష్టం పరంగా అస్థిరతకికారణం,8వ కుజడు అన్నిరకాల ఇబ్బందులకు కారణం .ప్రత్యేకం 10వస్థానం ఉద్యోగం అందులో కేతువుండటం వృత్తి లో ఇబ్బందులకు కారణం.ఈ మూడిరటికి శాంతి చేయించుకొని ప్రతీవారం కేతువుకి ఉలవలువంటివి ప్రతీవారం దానం చేయండి.

9.షేక్‌ సాఇముల్లా

మీ జీవితం కొంత అస్థిరత ఆందోళనలతో గడుస్తుంది.కారణం 8 వ చంద్రుడు.మీకు విదేశాలకు వెళ్లడానికి మీగ్రహబలం తక్కువగా ఉంది అదేకావాలని అనుకుంటే పుణ్యకార్యలు దానధర్మాలు చేస్తూ ఉండండి.చంద్రుడికి పరిహారాలు చేస్తూ ఉండండి.పరిస్థితులు చక్కనవుతాయి.

10.శేఖర్‌ (27సంవత్సరాల వయసు) వివాహసమస్య

ముందు ఉపాధి అర్హత సంపాదించుకోండి.తర్వాత పూజలు ,దానాల ద్వారా పుణ్య బలం పెంచుకోండి .నిత్యం ‘‘ పత్నీం మనోరమాందేహి మనోవృత్తానుసారిణీ,తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం.'' అని జపిస్తూ ఉండండి.

11.మైలవరపుసత్యనారాయణ వరంగల్‌ ఉద్యోగ విషయ చర్చ.

మీది ధనిష్ఠ 2వపాదం మకరరాశి ,ప్రస్తుత గోచారం బాగానేఉంది. భవిష్యత్తు కూడా ఫర్వాఆలేదు.ఎక్కడైనా మీకు కొంత అసంతృప్తి ఉంటుంది.

12.శ్రీకాంత్‌ ఆదివిష్ణు

మీకు విదేశ యోగం ఉంది. అక్కడే జీవించి ఉండటానికి గ్రహబలం సరిగాలేదు. మీపెళ్లి గురించి తెలుసుకోవాలన్నారాఉ (ఏం తెలుసుకోవాలో చెప్పలేదు)

13.బండ రాజేంద్ర నాథ్‌ (కర్నూలు)జీవితం గురించి.
మీరు అనుకున్న ఉన్నత శిఖరాలకు ఎదగ గలుగుతారు.మీ జాతకం ఆకోణంలో బాగానే ఉంది.

14.తాటిచెట్టు గిరిబాబు సిద్ధిపేట ఉద్యోగం, సినిమాఇండస్ట్రీకి పనికొస్తానా ?

మీకు 9వస్థానంలో శుక్ర చంద్రులు కలిసి ఉండటం కొంత కలిసి రావచ్చు,మంచి గుర్తింపు ఉంటుంది. కానీ ఎక్కువ స్థాయిలో వృద్ధి జరగదు.మెల్లిగా ఎదుగుతారు.ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించండి.కొంత లాభం ఉంటుంది.

15.పుట్ట అరుణ్‌ ఉమార్‌ కొత్తగూడెం ఉద్యోగం-

5వ స్థానం లో రాహువు, ఉద్యోగస్థానాన్ని కుజుడు ,శని చూడటం వల్ల ఉద్యోగం అవకతవకలతో సమస్యలతో సాగుతుంది.ఆలస్యంగా జీవితం సెటిల్‌ అవుతుంది.వీటికి పరిహారంచేసుకోండి.
16.పులిబండ్ల కార్తీక్‌ వరంగల్‌ ఉద్యోగం

మీకు ఉద్యోగం.ఉద్యోగ జీవితం బాగుంది.మీరు అడిగిన మిగిలిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇది తగిన వేదిక కాదు. 17.దాదల అరుణ్‌ బాబు పోలవరం(తూ.గో)విదేశ గమనం.

మీకు విదేశ గమనం యోగం ఉంది.కుజ,శనులకు పరిహారం చేసుకోండి ఇంకా 23 సంవత్సరాలలో మీకు మంఇ కాలం ఉంది .ఇప్పుడుకూడా మంచి బలం ఉంది.

18. పేరు రాయలేదు (జననతేదీ 28-11-1981) ఉదయం 03.50 ఉద్యోగంలో అసంతృప్తి.
కేతు శుక్రులకు చంద్రుడికి పరిహారం చేసుకోండి.పుణ్యగ్రంథ పఠనం చేయండి.ఏలినాటి శని ప్రభావగా కూడా మరో 34 సంవత్సరాలు ఈ ఇబ్బందిపెడుతుంది.దానికికూడా శాంతి చేసుకోండి.

19.వెంకటేశ్వర రావు జొన్నాడ ఆలమూరు మండల్‌ ఆర్థిక ఇబ్బందులు

వృశ్చిక రాశి మాట విలువ తగ్గటం ఆర్థిక ఇబ్బందులు రావటంఏలినాటి శనిప్రభావం ఇది. ప్రతీయేడాది కొసారి శని శాంతి చేయండి.వారానికోసారి అడుక్కునేవారికి అన్నదానం చేయించండి.ఇంద్రనీలం రత్నం జపంచేయించి పూజచేయించి ధరించండి.మంచి ఫలితాల్ని తొందరగా చూస్తారు.కనకధార స్తోత్రం చదవండి

20.మధురిమ తిరుమంద్యంతిరుపతి ఉద్యోగం

5వ కేతు 8వ అధిపతి(బుధుడు)తో కలిసున్నాడు,ఉద్యోగం పదవభావంలో శని చంద్రులున్నారు. ( కేతు , బుధుడు ,శని చంద్రుడు) వీటికి పడిహారం చేసుకోండి . 201516 మధ్యన అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+