మీ అదృష్టం: ప్రభుత్వోద్యోగం వస్తుందా, రాదా?
01. పి. మహేష్, అమలాపురం, ప్రేమవివాహ అవుతుందా?
మీ జాతక రీత్యా ప్రేమవివాహం అయ్యే అవకాశం ఉంది.
02. డి. విద్యా సాగర్ (పుట్టిన చోటు రాయలేదు.)
మీరాశి, మిగతా వివరాలు కావాలంటే పుట్టిన సమయం, చోట్లు రాయండి.
03. సాయి వంశీ కృష్ణ రాజు, బేతంచర్ల, విదేశంకి వెళతానా
మీజాతకం ప్రకారం విదేశాలకి వెళతారు.
04. తులసీ రావు, అనకాపల్లి, ఉద్యోగం
మీకు ప్రయత్నాలు విఫలం కావడానికి, రెండు ముఖ్య కారణాలున్నాయి. మొదటిది, రాశిలో నవాంశలో రాహువు నవమ, దశమాల్లో ఉన్నాడు. వీటి వల్ల అసంతృప్తి సమస్యలు వంటివి కలుగుతాయి. మొరొకటి ఏలినాటి శని నడవటం. దీనివలన కార్యములు వాయిదా పడతాయి. వీటికి దానాలు పరిహారాలు చేసుకుంటూ. ''శ్రీ రాజమాతంగ్యై నమ: '' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
05. వెంకటేశ్వర్లు, గోరంట్ల, సాఫ్ట్‌వేర్ జాబ్
ఏలినాటి శని కేతువు 9లో ఉండటం, ఈ రెండు తప్ప అన్నీ బాగున్నాయి. వీటికి దానాలు పరిహారాలు చేసుకుంటూ. ''శ్రీ రాజమాతంగ్యై నమ: '' అని జపిస్తూ ఉండండి.అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

06. షెట్టిపల్లి రాము, పూలకుంట, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా ?
ఏలినాటి శని నడుస్తుంది అది తప్ప అన్ని విధాలా మంచి సమయం ఇది. శనికి పరిహారాలు చేసుకుంటూ ప్రయత్నించండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
07. శ్రీనివాసులు తలారి, కడప, ప్రభుత్వ ఉద్యోగం
మీకు గవర్నమెంట్ జాబ్‌కి జాతకరీత్యా అవకాశం ఉంది.
08. సాగర్ సాయి, ఇల్లందు, ప్రభుత్వోద్యోగం
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలున్నాయి. కాని రాహువు దశ నడవటం ఆటంకాలు కలిగించవచ్చు. దానాలు అవసరం, ముత్యం ధరించండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
09. ప్రసాద్ నవర, సామర్లకోట, అప్పుల బాధలు
చాలా కారణాలు, వ్యయంలో రాహువు, 5లో 6వ భావాధిపతి కుజుడు అష్టమాధిపతితో కలిసి ఉండటం. కానీ ఇప్పుడే అప్పులు కలగడానికి అసలు కారణం దొరకటం లేదు. నవాంశని బట్టి జనవరివరకు కొంత సమస్యా కాలముగా నడుస్తుంది. శనికి దానాలు ఎక్కువగా చేస్తూ కనకధారా స్త్రోత్రం చదువుతూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
10. తిరుపతి, కిరాణ వ్యాపారం పనికొస్తుందా?
సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వంటివి మీకు యోగిస్తాయి అవికాక మిగిలినవన్నీ మీకు అంతగా కలిసివచ్చే వృత్తికావు.
11. నారాయణ రావు, కాకినాడ, ఏపేరు కుమార్తెకి ?
మా, మీ, ము, మే అనే అక్షరాలతో మొదలయ్యే బేసి సంఖ్యలో గల పేరుని మీ కుమార్తెకి పేరు పెట్టవచ్చు.
12. మాధవి లత, కుమారునికి జనన దోషం ఉందా?
మీకుమారునికి బాలారిష్ట దోషం ఉంది, నక్షత్ర దోషం లేదు, మీరు పెట్టిన పేరు సబబైనదే.
13.కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి. దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.
సత్య జితేందర్. (జాబ్)
సుధాకర్ రెడ్డి (ఉద్యోగం)
విజయ్ ఇల్ల( ఉదోయగం, వివాహం)
శ్రీ ధర్ రెడ్డి, (జాబ్, మ్యారేజ్)
14. హెడ్డింగ్ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారు.
శ్రవణ్ కుమార్, 17/03/1991
కిషోర్ కుమార్ ఐనవోలు, 28-9-1986. (సమయం రాయలేదు)
విజయ్ రెడ్డి( వివాహం) 18/05/1983
వెంకి గణపతి, 15.1.1983
సంతోష్ రవికుమార్, 28/02/1986
వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసుకోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)
15.కెరియర్, భవిష్యత్తు గురించి అడిగినవారు.
విశ్వనాథ్ 6/1/1991
గున్ని గణేష్ (వివరాలివ్వలేదు)
పండ్ర శంకర్ కుమార్, 965 50448256
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications