జాతకం: ప్రేమ వివాహం తప్పదా?

1.బ్రహ్మం ఆకుమల్ల, 9849124267సూధనగుంట,ఉద్యోగం

మీరు పుట్టినచోటుటైం రాయలేదు 8గంటలుగా తీసుకొని, ప్రస్తుత పరిస్తితిని చూస్తే మీకు గోచారంలో లగ్న రాహువు 7వకేతువు 3లో శని ఉన్నాడు.2016 ఫిబ్రవరిదాకా సమస్య కాలం. అది దాటాలి ఆగస్టులో కొంత మెరుగౌతుంది, ప్రయత్నించండి. రాహు,కేతు,శనులకు పరిహారాలు చేసుకోండి.

2.సోయంప్రసాద్‌,మురుమూర్‌,ప్రభుత్వోద్యోగం

మీరు నియమావాళిని చదివి ప్రశ్నపంపండి. మీరుపుట్టిన సమయం ఇవ్వలేదు.

3.రాకేష్‌ రాగమాగరి,హైదరాబాద్‌,విదేశ గమనం

మీకు విదేశగమనానికి జాతకానుకూలత ఉంది. తప్పక ప్రయత్నించండి.

4.గంగవరపు అశోక్‌, జువ్విగింట, సెటిల్‌మెంట్‌

మీరు కెరియర్‌ సెటిల్‌మెంట్‌ గురించి అడిగితే చెప్పడం కుదరదు. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

5. మురళికాముధ్‌ (వీరికుమార్తెవివాహం గురించి)అడిగారు, ఢిల్లీ

మీ కుమార్తెకు ప్రేమవివాహం అయ్యే అవకాశాలున్నాయి, అతను బంధువుల వ్యక్తి అయ్యే అవకాశాలున్న కూడా కానీ సేమ్‌ సిటీనేనా అనేది మేం చెప్పలేము.?

6.చెన్నకేశవరావుతుమ్మల, గన్నవరం, 3ప్రశ్నలు

ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

Astrologer suggests remedies and tells forcast

7.అంబటి సతీష్‌బాబు, నెల్లూరు, వివాహం

మీకు వివాహ విషయంగాలగ్నంలో 4వఅధిపతికుడు,8వఅధిపతి గురుడు,రాహువున్నాడు, 7లో కేతువున్నారు, ఇప్పుడు మీకు గోచారంలో లగ్న గురుడు ఇవన్నీ వివాహ సమస్యలే పైన చెప్పిన గ్రహాలన్నింటికి పరిహారాలు చేసుకోండి. వివాహానికి అనుకూలత ఏర్పడుతుంది.

8.కె నరసింహ కిషోర్‌, కలికిరి, సెటిల్‌మెంట్‌

ఇలాంటివి చెప్పడానికి మొత్తం జాతకం చూడాలి. దానికిది వేదిక కాదు. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

9.వరాహాభస్కర్‌, విశాఖపట్నం, విదేశగమనం

మీకు విదేశాలకు వెళ్లడానికి గ్రహానుకూలత తక్కువగా ఉంది.

10. మహ్మద్‌ ఆలీ, కొల్లాపురం, భవిష్యత్‌, వివాహం

పుట్టిన వివరాలేవీ తెలియకుండా చెప్పడం కష్టం. భవిష్యత్‌ అనేది చాలా విస్తృత అంశం కూడా .ఐతే మీరు ప్రశ్న జ్యోతిషాన్ని చెప్పేవాళ్లను ఆశ్రయించవచ్చు.

11.నార వప్రసాద్‌, సామర్లకోట, ధనార్జన

మీ జాతకంలో లగ్న అష్టకవర్గు కన్న 2వభావ అష్టకవర్గు తక్కువగాఉంది.మీ ప్రయత్నలోపం కొంత ఉంది. దాంతోపాటు మీరుఎంచుకున్నవృత్తినిబట్టి కొంతభాగం దానాలు చెయ్యాలి. మీరు ఏపని ఎంచుకోవాలో మీరు చెప్పాలి. అది సరైనదా, కాదా మేం చెప్పగలం, ప్రశాంతంగా ఉండటం ఎలాగో అప్రయత్నం చేయండి. ఏదో పనిచేసి అడ్డగోలుగా ధనార్జన చేయాలనుకోవద్దు.ఆమార్గాలు వేరెవరైనా చెపితే వినొద్దు.

12.కొత్తపల్లి గురుమూర్తి, పుట్టినసమయం, చోటు ఇవ్వలేదు

మీ కుటుంబసభ్యులపేర్లు అన్నీ అనవసరం, ముందు మీ నక్షత్రమైనా పంపాలి, ధనం నిలబడాలంటే మీకు కలిగిన దాంట్లో 20శాతాన్ని ఫలాపేక్షలేకుండా దానంచేస్తూండాలి.ఉన్నధనానికి ప్రణాళికవేసుకోవాలి.ఇలాంటివి లేనివారికి ఇబ్బందులొస్తాయి. అసలు సమస్యేంటీ మీ జాతకం చూడాలంటే మీవివరాలుపంపండి.

13.పృథ్వీనాథ్‌రెడ్డి,ఆత్మకూర్‌,ప్రభుత్వోద్యోగం

మీకు గ్రహానుకూలత తక్కువగా ఉంది కానీ పుణ్యకార్యాలు చేస్తూ గట్టి సాధన చేయండి.

14.అనిల్‌కుమార్‌, కందుకూర్‌, కెరియర్‌

ఇలాంటివి చెప్పడానికి మొత్తం జాతకం చూడాలి దానికిది వేదికకాదు. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

15. చాగంటిస్వర్ణపల్లవి, పుట్టినచోటు రాయలేదు , హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం, విదేశగమనం.

మీకు విదేశాలకు వెళ్లడానికి గ్రహానుకూలతఉంది.తప్పక ప్రయత్నించండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+