జ్యోతిషం: రెండో పెళ్లి సమస్యలు ఎలా?

1.చంద్రకళ, తిరుపతి, రెండోవవాహ జీవితం ఎలాఉంటుంది?

అసలు మీ జాతకంలో వివాహకారకుడు బుధుడు,6వ(సమస్యాకారకుడు) శుక్రుడు, కలిసి రాహువు నక్షత్రంపై ఉన్నారు. ఇది ఒక సమస్యపై మూడు గ్రహాలకి పరిహారాలు చేసుకోవాలి, వారానికోసారి వాటి ప్రీతిగా దానాలు చేస్తూనే ఉండాలి.

2.రేఖ.యన్‌, పుట్టినచోటు రాయలేదు , హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం, ద్వితీయవివాహం?

అనుకూలంగా ఉండేలా చెప్పమన్నారు, సమస్యలుంటేనే కదా మాదాకా వచ్చేది. మీకు జాతక చక్రంలో 7లో పాపగ్రహం ఉండటం ఒక కారణం కానీ అష్టకవర్గంలో చాలా పుణ్యబలం తగ్గింది. ద్వితీయవివాహం సమస్యలతో ఉంటుందని చెప్పలేం .అలాగే మీరు దానధర్మాలు పుణ్యకార్యాలు చేసుకోవాలి, వారానికోసారి గురు,శని గ్రహాలకు వాటిప్రీతిగా దానాలు చేస్తూనే ఉండాలి. గురు శాంతి కూడా చేసుకోవాలి.

3.రవీంద్రనాథ్‌,పుట్టినచోటు,సమయం రాయలేదు.

సమస్యలేంటో రాయలేదు, పుట్టినచోటు, సమయం రాయలేదు. కెరియర్‌ గురిచి అడిగారు. అవసరమైన వివరాలివ్వలేదు, అనవసరమైన మీ ఫోటో పంపారు.

4. పృథ్వీనాథ్‌రెడ్డి, ఆత్మకూరు, ఉద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం తక్కువ ఉంది. దశ 8వఅధిపతి రవిదశ నడుస్తుంది, ఇది అనుకూల కాలం కాదు కొంతకాలం ఆగాలి. అంతా కాదు కానీ 2016 మార్చ్‌ 4 తర్వాతకొంత బాగుంటుంది. సూర్య చంద్రులకి దానపరిహారాలు చేసుకోండి.వారానికోసారి వాటిప్రీతిగా దానాలు చేస్తూనే ఉండాలి.

5. కోటసత్యనారాయణ అంగదల్‌, నిడదవోలు, వివాహం

మీకు వివాహభావాధిపతి శని కేతువుతో కలిసున్నాడు, 8వ అధిపతి గురుడు 2ని చూడటం, వివాహ సమస్యలు కలిగిస్తాయి. ఈ గ్రహాలకి పరిహారాలు చేసుకోవాలి, వారానికోసారి వాటి ప్రీతిగా దానాలు చేస్తూనే ఉండాలి.

6.చెన్నకేశవరావు తుమ్మల.3ప్రశ్నలు

మీకు విదేశగమనానికి అవకాశం ఉంది కానీ కొంత బలహీనంగా ఉంది కాబట్టి పుణ్యకార్యాలు చేస్తుండండి.
వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

7. కిషోర్‌కృష్ణ, గుడివాడ, విదేశగమనం

మీకు విదేశం వెళ్లడానికి అవకాశం ఉంది.

8.అముజుల శ్రీనివాసరావు,

పుట్టిన వివరాలు ఇవ్వలేదు పూర్వాభాద్రానక్షత్రం అని ఇచ్చారు. ఇద్దరి జాతకాల వివరాలు లేకుండా సమస్యగుర్తించడం కష్టం.

9. రమేష్‌ గుప్త, భీమవరం, కెరియర్‌

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

10. అమర్‌ జామి, నర్సన్నపేట, నక్షత్రసమాచారం, విదేశం

మీరిచ్చిన వివరాల ప్రకారం కృత్తిక 1 పాదంకాదు, భరణి 2వ పాదం ఐంది. కానీ మేషరాశి అవుతుంది. మీకు జాతక రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అమెరికాకే అని చెప్పలేం.

11.రామకృష్ణ, అమరావతి

ప్రశ్న పేరాల కొద్దీ రాసారు, అర్థంకాలేదు, తెలుగులో పంపండి, వివరాలు ఇవ్వలేదు.

12. దేవిక, నిజామాబాద్‌, ద్వితీయవివాహం

మీ జాతకంలో వివాహభావాధిపతి బుధుడు రాహువు నక్షత్రంపై ఉండటం, రాహువుతో కలిసి ఉండటం, 7వభావాన్ని సూర్యుడు చూస్తూండటం. ఇవి వైవాహభావాన్ని దెబ్న తీస్తాయి. పై గ్రహాలకి పరిహారంచేసుకోవాలి. పరిహారవిధానాల్ని విడిగా అందించాము.లగ్న రవి కొంత మీలోపాల్నికూడా పరిశీలించుకోండి. సవరించుకోవాలి. లగ్న రవి కొంత ఇతరులకు లొంగని స్వతంత్ర

13. కరుణ పుప్పాల, జగిత్యాల, కెరియర్‌

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

14. మంగల లతీష్‌ కుమార్‌, బుక్కపట్నం, వివాహం, ఉద్యోగం

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

15.నరేంద్రబాబు

వివరాలివ్వకుండా ప్రశ్నలడిగారు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+