జ్యోతిషం: మీరు అడిగారా, జవాబులు ఇవీ...
01. (1) సతీష్ బెస్త, ధర్మబరం, పోలీస్ కానిస్టేబుల్ వస్తుందా ?
అన్ని విధాలా పోలీస్ జాబ్ గవర్నమెంట్ జాబ్ కి అనుకూలతలున్నాయి. కాని 2అంశాలు సవరించాలి. అష్టమాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. గోచారంలో అష్టమ శని, నడుస్తుంది. ఈ రెండుకారణాలు మీతప్పువల్ల, కొద్దిపాటులో పోగొట్టవచ్చు. కాబట్టి శని,శుక్రులకి దానలు చేస్తూ ఉండండి. ఎక్కువగా శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.
02. చింత బతిన బాలాజి, గుంటూరు, గవర్నమెంంట్ జాబ్ ?
గవర్నమెంంట్ జాబ్ కి జాతక అనుకూలత తక్కువగా ఉంది. వ్యాపారం కన్నా ఉద్యోగం మీకు మంచిది.
03. భూపతి సాయికిరణ్ (నెమల్లపూడి) గవర్నమెంట్ జాబ్ వస్తుందా ?
మీరు పంపిన గ్రామం పేరు ఏమండలమో దొరకలేదు కాబట్టి హైదరాబాద్‌గా తీసుకొని చెపుతున్నాం. మీకు గవర్నమెంట్ జాబ్‌కి అవకాశం ఉంది. కానీ రాహు, కుజుల వలన కొంత ఆటంకాలు కలిగే అవకాశాలున్నాయి. రాహు, శుక్రులకి దానపరిహారాలు చేసుకోడి.
04. యశ్వంత్ బాబి మద్దెల, వైజాగ్, నారాశి ఏమిటి?
ఆరుద్ర నక్షత్రం,2వపాదం, మిథున రాశి. కెరియర్‌లో చాలా అంశాలుంటాయి, ముందు ఈ జవాబుల కింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్ చదివి పంపండి.
05. ముని ప్రదీప్ కుమార్ ఆర్కోట్, నెల్లూర్, జాబ్ సమస్య
దశ బాగాలేదు. 2018 వరకూ సమస్యలుంటాయి. మంచి స్థాన ప్రమోషన్ వంటివి పొందటానికి కొంత సమయం పడుతుంది. కేతువుకి, బుధుడికి పరిహారాలు చేసుకోండి.
06. రవీంద్ర బొక్క, అమలాపురం, గవర్నమెంంట్ జాబ్ ?
మీకు జాతకరీత్యా గవర్నమెంట్ బ్‌కి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

07. ప్రదీప్ కుమార్ బాలె, జగిత్యాల, కుటుంబ సమస్య
ప్రశ్న పేరాలకొద్దీ రాసారు. మీ పుట్టిన సమయం ఇవ్వలేదు. కనుక గవర్నమెంట్ జాబ్‌లాంటి అవకాశాలను గురించి చెప్పడం కుదరదు, కానీ కుటుంబ సమస్య తీరాలిఅంటే అవగాహన అవసరం, కూర్చుని మాట్లాడాలి. అన్యోన్య దాంపత్యానికి గొడవలు తగ్గడానికి '' ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం'' అనేశ్లోకాం చదువుతూ ఉండండి. గణపతి హోమం చేయించుకుంటూ ఉండండి.
08. వైట్ల ప్రవీణ్ కుమార్, సూర్యాపేట, ఫారిన్ ఛాన్స్
మీకు ఫారిన్ ఛాన్స్ అవకాశం ఉంది, గోచారం బలహీనంగా ఉంది. కానీ 2017 ఫిబ్రవరి లో శని గోచారానుకూలత మారుతుంది. అప్పటి వరకు శనికి పరిహారాలు దానాలు చేసుకుంటూ ఉండండి.
09. కమ్మర మాధురి, కడప, పెళ్లి సమస్య,
మీకు సప్తమాధిపతి గురుడు, కేతువుతో కలిసున్నాడు, అష్టమాధిపతి శనిమరియు రాహువుచేత చూడబడుతున్నాడు. గురు అనుకూలత కూడా ఆగస్ట్ తర్వాత ఏర్పడుతుంది. మంచి దశ నడుస్తుంది. పై గ్రహాలకి శాంతి చేయిమచుకోండి.
10. బాసిరెడ్డి నారాయణ రెడ్డి, తెలుగు సంవత్సరాల లోని నా పుట్టిన తేది చెప్పండి
జులై 19, 20 తేదీల మధ్యన ఉంది. పుట్టిన సమయం, చోటు రెండూ రాయలేదు, చెపితే సరిగ్గా తెలిసేది.
11. సంజయ్, కొత్త ఇల్లు మారడానికి ముహూర్తాలు, బెంగుళూరు,
విడిగా గృహ ప్రవేశానికి ముహూర్తాలు అనే ఆర్టికల్‌లో అందించాం చూడండి.
12. సరస్వతి, కుమారునికి పేరు ఏం పెట్టాలి.?
మీకుమారునికి న అనే అక్షరంతో మొదలయ్యే సరిసంఖ్య అక్షరాలుగల పేరు పెట్టండి. శుభం,
13. సమయం ఇవ్వలేదు, కొందరు పుట్టిన చోటు రాయలేదు వారి పేర్లు ఇవి.
కొట్ల రాహుల్, 06-7 -1995, గవర్నమెంట్ జాబ్
చావనవ్య, వసుల సంతానం, 1993, 1986 సమయం రాయలేదు
బి. సతీష్ యాదవ్, 29/4/1992, సమయం రాయలేదు
దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.
14. హెడ్డింగ్ పెట్టి వదిలినవారు, వారిపేర్లు ఇవి.
కొల్లూరు సూర్య నారాయణ, 25-01-1951, ఆరోగ్యం, సంపద
యస్.కె మస్తాన్ వలి, తెనాలి, ఆరోగ్యం, సంపద
బి. శ్రీనివాస్ రెడ్డి, -04-06-1985 జాబ్, మ్యారేజ్
దీపాల సుధీర్ కుమార్, 11-09-1991, గుంటూరు (జాబ్, మ్యారేజ్)
వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)
15. కెరియర్ గురించి, భవిష్యత్తు గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.
నర్నెపాటి అంకమ్మరావు, 15-08-1990సెటిల్‌మెంట్
కిరణ్ కుమార్, 14-03-1989, కెరియర్
అనసూయ, పుట్టిన చోటు రాయలేదు.
ఒక జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
నవగ్రహాలకి జపాలు పరిహారాలుమీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
వాస్తు ప్రకారం మెయిన్ ఎంట్రన్స్ దక్షిణం, ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం ఉంటే ఏం చేయాలి? -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
కర్కాటకరాశి వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారం.. అన్నింటా విజయం! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
today rashiphalalu: నేడు బృహస్పతి, బుధుల స్థానాలలో మార్పు.. వీరికి జాక్ పాట్! -
మీన, కుంభ రాశులలో ముఖ్య గ్రహాలు.. వీరికి నేడు డబ్బులే డబ్బులు! -
ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications