జ్యోతిషం: విడాకులు లభిస్తాయా, చెప్పండి

1. వినీత్‌ కుమార్‌, హైదరాబాద్‌, విదేశగమనం

విదేశాలకి వెళ్లే అవకాశం ఉంది కానీ బలంగా లేదు, అది రాహువు మూలంగా ఫారిన్‌ చాన్స్‌ ఇస్తాడేకానీ చెడకొట్టడు. కానీ రాహుకేతు దోషం వివాహానికి ఎక్కువ దోషం ఉంది. ఇప్పుడు మరొక సంవత్సరంలో జాతకం ప్రకారం విదేశానికి అవకాశం ఉంది. బుధ కుజులకి శాంతి చేసుకోండి.

2. రెడ్డి త్రిమూర్తులు, విజయనగరం, ప్రాథమిక సమాచారం

ప్రాథమిక సమాచారలో ఏం కావాలో రాయలేదు, మీ నక్షత్రం విశాఖ ఒకటివ పాదం కన్యారాశి,

3. కావూరి దినేష్‌, గుంటూరు, ఉద్యోగం

జాతక చక్రంలో చూడండి. ఈ సంవత్సరం జూన్‌ వరకు అనుకుల సమయం నడుస్తుంది. కొంత గ్రహ ప్రతికూలతలు మినహా ఉద్యోగానికి అంతా బాగుంది. ఉద్యోగ జీవితం కొంత అసంతృప్తిగా సాగతుంది. రవి, బుధ శనులకి దానాలుపరిహారాలు చేసుకోండి. 'రాజమాతంగ్యై నమ; అని మంత్రం జపించండి.

4. వల్లభనేణి సుబ్బారావు, వుయ్యూరు, విదేశం

మీకు విదేశ గమనానికి అవకాశం ఉంది.

5. నర్సింలు, కడప, వ్యాపారమా ? ఉద్యోగమా?

అన్ని విధాలా రెండూ కలిసొస్తాయి.

6. రామ్‌ (కుమార్తె సుజని వివాహం గురించి అడిగారు) విజయవాడ.

ఈ సంవత్సరం జూన్‌ వరకు గురు దశ బాగుంది, గోచారమూ బాగుంది, కానీ వివాహ భావాధిపతి కేతువుతో కలిసి 6లో ఉన్నారు. రాహువు అంతర్దశనడుస్తుంది, కుక దృష్టి కుజదోషం ఎక్కువగా ఉంది. వీటికి శాంతి చేయించండి. వివాహానికి ప్రత్యేకంగా ఇచ్చిన శ్లోకాలు చదువుతూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

7. లక్ష్మణ్‌ రావు చిన్ని, విశాఖపట్ణం, వ్యాపారం అనుకూలిస్తుందా? ఏరంగంలో ?

మీకు వ్యాపారం అనుకూలిస్తుంది. సేల్స్‌, షాప్స్‌, డిస్ట్రిబూటర్‌ ఇలాంటి రగాలు, వ్యవసాయ రంగం కూడా మంచిది.

8. కుమార్‌ శర్మ, ఏరత్నం ధరించాలి

మీ జాతకాన్ని బట్టి మరకతం, దీన్నే పచ్చ అని కూడా అంటారు. దీన్ని ధరించాలి.

Astrology: Readers questions answred

9. వెంకటగిరి సూర్య ప్రకాష్‌ రెడ్డి, కర్నూల్‌, లక్కీ నంబర్‌

మీకు శుభకరమైన అంకెలు 3,6,8, ధరించదగిన రత్నం కనక పుష్య రాగం, గ్రహస్థితి మీకు ఏలినాటి శని దశన డుస్తుంది.

10. విరేంద్ర, ఒరిస్సా, విదేశాలకు వెళతానా?

మీకు జాతక రీత్యా విదేశాలకి అవకాశం లేదు.

11. కుసుమ, హైదరాబాద్‌, విడాకులు

విడాకులు కావాలని మమ్మల్ని అడగడం కాదు అసలు మీజాతకంలొ కూడా కొంత దోషం ఉంది, ఇద్దరి జాతకాలు చూడాలి, పెద్దలని సంప్రదించి తెల్చుకోండి.

12. మర్రి శ్రీధర్‌, ముంబై, ఫారిన్‌ ఛాన్స్‌

మీకు విదేశాలకి వెళ్లే అవకాశం ఇప్పుడుంది, మరొక సంవత్సరం దాకా ఉమది.

13. కిరణ్‌ కుమార్‌, బెంగళూర్‌, సాఫ్ట్‌వేర్‌ జాబ్‌

మీకు తప్పకుండా ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుంది.

14. శ్రీదేవి, నిజామాబాద్‌, కుజ దోషం ఉందా?

మీకు కుజ దోషం ఉంది.

15. కొందరు జవాబులకింద ఇచ్చెన నియమాలుపాటించనివారు, అర్థంకాని భాషలో రాసినవారు, వివరాలు సరిగా ఇవ్వనివారు , ప్రశ్న నిర్ధిష్టంగా ఇవ్వనివారు (ఉదాహరణ ఉద్యోగం అనిరాసి వదిలేసారు. వివాహం గురించి తెలుసు కోవాలన్నారు

ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయలేదు) ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చీల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి. అలాంటి వారి కొందరి వివరాలు.

జగదీష్‌ అల్ల, కెరియర్‌
పృథ్వి, విజయవాడ, వివాహం (పుట్టిన సమయం ఇవ్వలేదు) ఒక్క ప్రశ్న అడగండి.

పర్వత రెడ్డి హరిత, చిన్న గంజాం (ఒక్క ప్రశ్న అడగండి. వాటిలోనూ ఏం తెల్సుకోవాలనుకుంటుందీ రాయండి.

రేష్మ దీపిక, 21,07.1987 పుట్టిన చోటు రాయలేదు

ఒక్క ప్రశ్న అడగండి. వాటిలోనూ ఏం తెల్సుకోవాలనుకుంటుందీ రాయండి.

సాయి చరణ్‌, ఆదిలాబాద్‌, 08 జనవరి 1995 విదేశం

టైం రాయలేదు

వీర శివ ప్రసాద్‌ నాయక్‌, 27-01-1988

పుట్టిన చోటు, సమయం రాయలేదు, పేరుని బట్టిమాత్రమే ఒక ప్రశ్న సమాధానం చెప్పలేము.

మణిబాబు, టి ఆర్‌, శిల్ప టిఆర్‌ (రెండు జాతకాలు ఇచ్చి హెడ్డింగ్‌లు రాసివదిలేసారు) జాబ్‌ మ్యారేజ్‌ అని అందులో వాటికిసంబంధించిన స్పష్టంగా అడగలేదు.

వర్ష దేవేంద్ర, నిజామాబాద్‌ ( గవర్నమెంట్‌ జాబ్‌)

పుట్టిన సమయం ఇవ్వలేదు

జి. భీమయ్య, మహబూబ్‌ నగర్‌, కెరియర్‌.

అందులో ఏం కావాలో రాయలేదు

జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+