ప్రశ్నలడిగారా: జ్యోతిష్కుడి జవాబులు ఇలా...
01.(4) పటాన్ షహనాజ్, వివాహానికి ఆటంకాలెందుకు కలుగుతున్నాయి.
లగ్నంలో కేతువు, 7లో రాహువు ఉన్నాడు. వివాహ కారకుడు శుక్రుడు 8వ కారకుడితో బుధుడితో కలిసున్నాడు. ఇవి ఆటంకాలు. కానీ శుక్రుడి దశ, రాబోయే ఆగస్టు తర్వా అనుకూల కాలం ఉంది. ప్రయత్నించండి. ముంది పైన చెప్పిన గ్రహాలకి దానాలు పరిహారాలు చెసుకోండి.
02. రమేష్ కుమార్ పెరికల, 9884014389 అకివీడు, విసా ప్రాబ్లమ్
మీకు ఏసమస్యా లేదు మీకు విదేశాలకి వెళ్లడానికి అన్ని విధాలా అనుకూలతలున్నాయి.
03. రంజిత్ రెడ్డి తొగరు, కరీంనగర్, ప్రభుత్వ ఉద్యోగం
మీకు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఏ ఆటంకాలూ లేవు. ప్రయత్నించండి తప్పక వస్తుంది.
04. రాజు కట్కూరి, ప్రేమ వివాహం అవుతుందా ?
మీకు ప్రేమ వివాహం అయ్యే సూచనలున్నాయి కానీ వివాహాధిపతి 8లో ఉండటం కొంత సమస్యాయుత అంశం దీనివల్ల వివాహ జీవితంలో సమస్యలుంటాయి.
05. శ్రీనివాస్ కొల్లి, తాడేపల్లి గూడెం,
ఉద్యోగం పోయింగేలనాటి శని నడవటం. 6వ అధిపతి, చంద్రుడి దశ లో రాహువు అంతర్దశ నడుస్తుంది. ఇది ఇబ్బందికర కాలమే. కొంత ఓపిక పుణ్యబలం పెంచుకోవాలి. శని, రాహు, చంద్రులకి దానాలు పరిహారాలు చేసుకుంటూ ఉండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తు ఉండండి. అంటే ఏంచేయాలో ఈ జవాబుల కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
06. రవీంద్ర రూపినేని, నెల్లూరు, 9916206811 ఆర్థిక సమస్యలు
మీకు ఏలినాటి శని గోచారంలో, దశలో రవిలో రాహువుఉన్నాడు అనారోగ్యం దుబారా ఖర్చులు శారీరక శ్రమ,వంటివి రాబడి తగ్గటం వంటివి వీటివలన జరుగుతాయి. శని రాహువులకి దానాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. లక్ష్మి అష్టోత్తర నామాలు చదువుతూ ఉండండి.
అంటే ఏంచేయాలో ఈ జవాబుల కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
07. గౌతం రడ్డి కొత్తపల్లి, మూలా నక్షత్రం
మీరు పుట్టిన సమయం తెదీ వంటి వివరాలివ్వకుండా ప్రశ్న అడిగితే జాబ్ వంటి ముఖ్యమైన వివరాలకి సమాధానం చెప్పడం కష్టం. పుట్టిన వివరాలు పంపండి.
08. తంగెల్ల పల్లి నరేష్ కుమార్, హుజూర్‌నగర్, ఉద్యోగ సమస్య
ఏలినాటి శని చివరిదశలో ఉంది. గోచారంలో రాహు కేతువుల ప్రభావం ఎక్కువగా ఉంది మరొక సంవత్సరం ఇబ్బంది ఉంటుంది. వీటికి పరిహారాలు చేసుకుంటూ ఉండండి. క్రమంగా మెరుగవుతుంది.
09. రవి కుమ్మరి, మ్రేమ పెళ్లి అవుతుందా ?
మీకు ప్రేమ పెళ్లి అవడానికి జాతక రీత్య అవకాశం లేదు.
10. అమత గౌరి, తిరుపతి, కుజ దోషం , మాంగల్య దోషం ఉందా ?
కుజ దోషమూ లేదు, మాంగల్య దోషమూ రెండూలేవు. చెప్పుడు మాటలు వినకండి మీకు మంచి వైవాహిక జీవితం బాగుది.
11. దేవీ ప్రదీప్, ఫారిన్ ఛాన్స్ ఉందా ?
మీకు జాతకరీత్యా ఫారిన్ ఛాన్స్ లేదు.
12. శ్రీ వల్లి, హైదరాబాద్, వివాహానికి దోషాలున్నాయా?
మీకు 7వ అధిపతి రాహువుతో కలిసి 8లో ఉన్నాడు కుజ, రాహువులకి పరిహారాలు చేసుకోండి. సరిపోతుంది.

13. కెరియర్ మరియు భవిష్యత్తు ఉరించి అడిగినవారు
మదన్ మోహన్, కర్నాటక
శ్రీధర్, 21.9.1989
నరసింహారావు. హైదరాబాద్
గంగాభవాని, ధర్మపురి
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.
14. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి. దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలు పంపించండి.
పుట్టిన వివరాలు సరిగ్గా ఇవ్వనివారు
చందు, 1988 పుట్టిన సమయం ఇవ్వలేదు
గొపాల్, మీ పుట్టిన తేదీ 2016 గా ఇచ్చారు సరిచుసుకోండి
అంజన్న, మహబూబ్ నగర్, ప్రశ్న రాయలేదు
15. హెడ్డింగ్ పెట్టి వదిలినవారు.
భాగ్యవతి, అనంతపురం, సంతానం
బసవరాజు, తిరుపతి, ఉద్యోగం
హెడ్డింగ్ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.
వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలనుకున్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications