జ్యోతిష్కుడి జవాబులు: విదేశీ గమనం ఉందా?
1.యం.లక్ష్మీనాయుడు.రాజమండ్రి,
మీకున్న సమస్యలు 2016 తర్వాత కొంత బాగవుతుంది. రవి, రాహు, కేతువువుకి పరిహారం చేసుకోండి.
2. పూర్ణచంద్రరావు సోమరాజు,పుట్టినచోటు రాయలేదు, హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం
మీకు ప్రభుత్వోద్యోగం వస్తుంది. శని వల్ల ఆలస్యం, రాహువువల్ల కొద్దిపాటిలో దూరమవటం జరుగుతుంది .మీకు ఉద్యోగం వచ్చేదాకా రాహు కేతువులకి పరిహారం చేసుకోండి. 2016 ఫిబ్రవరి తర్వాత కొంత పరిస్థితి బాగుంటుంది.
3.కొడమంచిలి వెంకటేశ్వరరావు,భీమవరం,ప్రభుత్వోద్యోగం
మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది కానీ శని రాహు కేతువులకి పరిహారంచేసుకోండి, చదివే ప్రణాళిక బాగు చేసుకోండి. శనిరాహు కేతువులకి పరిహారం చేసుకోండి.
4. లోకేష్ రెడ్డి,
మీరు పుట్టినతేదీ 2015 అని ఇచ్చారు. సరిచూసుకోండి. విదేశానికి అవకాశం చెప్పొచ్చు కానీ అమెరికాకి అని చెప్పలేం.
5.కరణం రాజేష్,వినుకొండ,ప్రమోషన్
మీకు ఆగస్ట్ తర్వాత సంవత్సరం కాలంలో మీకు ప్రమోషన్ వస్తుంది. రాహువుకు దాన పరిహారాలు చేస్తుండండి. మంచి ఫలితాలు వస్తాయి.
6.శ్రీనివాసకృష్ణకిషోర్,రాజమండ్రి,పుట్టిన సమయం రాయలేదు,ఉద్యోగం
ఒకేసారి గొప్ప ఉద్యోగం రాదు, మీ సమస్య చెప్పలేదు. అసలు కెరియర్ మొత్తం గురించి చెప్పడానికిది వేదిక కాదు.

7.మహేందర్ పాచిమట్ల, పుట్టినచోటు సమయం రాయలేదు. భవిష్యత్తు
భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
8. విజయభాస్కర్, పుట్టినచోటు రాయలేదు, హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం
మీకు 2కేతువు, 8వ రాహువు మూలకంగా కొద్ది సమస్యలు, వాహన విషయకంగా జాగ్రత్త వహించాలి. ఇక మీకు గురుడిలో రవి అంతర్దశనడుస్తుంది. పుణ్యకార్యాలు దానాలు చేసుకుంటూ ఉండండి.
9.శ్రావణి,పుట్టినచోటు రాయలేదు, హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం,విదేశగమనం
మీకు విదేశగమనానికి అవకాశం ఉంది.
10. శ్రీరాం శ్రీఖాకోలాపు, అమలాపురం, ఉద్యోగం
మీకు ప్రస్తుతం గురు అనుకూలత ఉంది కానీ గోచారరిత్యా లగ్న రాహువు, కేతువు ఆటంకాలు కలిగిస్తాయి. వీటికి పరిహారం చేసుకోండి. 2016 ఫిబ్రవరితర్వాత అనుకూలత వస్తుంది.
11.వెంకటరమణ, పేరుమార్పిడి
మీరు తలిదండ్రులు పెట్టిన పేరుని వాళ్లేమళ్లి నామకరణం చేసి మార్చవచ్చు.
12.మస్తాన్ షరీఫ్, పుట్టినచోటు రాయలేదు, హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం
మీరిచ్చిన వివరాల ప్రకారం ఏలినాటి శని నడుస్తుంది. శనికి పరిహారదానాలు చేస్తూండండి. ఆగస్ట్ తర్వాత ప్రయత్నించండి.
13.విహారి, అనంతపురం, స్వంత ఇల్లు
మీకు స్వంతయిల్లు యోగం ఉంది, శనికేతువులకి పరిహారం చేసుకోండి గోచారంలో 8రాహువు 2వ కేతువు వల్ల ఆటంకాలుంటాయి. ఈ గ్రహాలకి పరిహారం చేసుకొని దానాలు చేస్తుండండి. ఈ ఆగస్ట్ తర్వాత కొంత 2016 ఫిబ్రవరి తర్వాత మరికొంత అనుకూలిస్తుంది. శుభం.
14.కృష్ణచైతన్య, కెరియర్, 1982
భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
15.రమ్య. వి,విశాఖపట్నం, మాంగళ్యదోషంఅంటే
మాంగళ్యదోషం అంటే వివాహ సమస్యలుంటాయి అని అర్థం. అంతే కానీ వివాహం కాదు అని అర్థం కాదు. కాలసర్పదోషమైనా, కుజదోషమైనా ఏదీ వ్యక్తి జీవితాన్ని నిర్ణయించదు. అక్కడ కొన్ని పరిమితులుంటాయి. మీరు ఎవరి మాటలు పడితే వారి మాటలు వినకండి. జ్యోతిషం లోకక్షేమానికే కానీ చెడు గురించి ప్రచారం చేయదు.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications