మీరు అమెరికా వెళ్లే అవకాశం ఉందా?

ప్రశ్న: విసా పొంది అమెరికా (ఇతరదేశాలకు) వెళ్లే అవకాశం ఉందా ? లేదా ?
పృథ్వీధర్ రెడ్డి

 jyothisham: Answer to the reader's question

సమాధానం: ఉంది
సమాచారం: ధనుర్లగ్నం, ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి
విశ్లేషణ

1. స్థాన భ్రంశకారకంగా రాహువు 1లో ఉండి 7వ భావాన్ని చూడటంచేత విదేశాలకు వెళ్లడానికి కొంత ఉపయోగపడుతుంది.కంటి సంబంధ /తల నరాల సంబంధ వ్యాధుల సూచనలు కూడా ఉన్నాయి.

2. వృత్తికారకుడు బుధుడు కావడంచేత కంప్యూటర్‌ ,సేల్స్‌ ,డిస్ట్రిబ్యూటర్‌,టెక్నాలజీ, ఐటి సంబంధవిద్య ఉంటుంది.

3. లగ్నాధిపతి గురుడు 10 వస్థానంలో ఉండటంచేత జీవితానికి ఉపయోగపడే చదువు ఉంటుంది. 4.5వ భావాధిపతి కుజుడు 7 లోఉండి10వ భావాన్నిచూడటంచేత కొంత ఇబ్బందైనాకార్యసిద్ధి జరుగును.
సమాధానం

ప్రస్తుం మీకు రాహుదశ నడుస్తుంది.దశ గోచార బలాన్ని కలిపిచూస్తే 21 డిశంబర్‌ 2015 ప్రాంతంలో మీరు ఫారెన్‌ కి చదువురీత్యా వెళ్లె అవకాశం ఉన్నది. కాని పక్షంలో 2016 మొదటి భాగంలో ఔతుంది. 2015 లోనే ఎక్కువ బలంగా ఉంది. వివాహానంతం జీవితంలో స్థిరత్వం (సెటిల్‌ మెంట్‌) ఏర్పడుతుంది.

సమస్యలు

కుజ గ్రహంమూలంగా చదువు విషయంలో ఇబ్బందులు ఉంటాయి. శనిమూలంగా వాయిదాలు ,రాబడి ఆలస్యం ,కృషికి తగిన ఫలం ఆలస్యంగా వస్తుంది

సూచనలు

ఉన్నతవిద్య కోసం ‘శ్రీ హయగ్రీవాయనమ: ' అనే నామాన్ని వీలైనంత ఎక్కువ సేపు చేయడం. శని ప్రీతిగా వాడేసిన వస్త్రాలు,వస్తువులు,బెల్లం వంటివి, బీదవారికి దానంచేయడం.కుజునికి ప్రీతిగా కందిపప్పుతో చేసిన పదార్థాలు దానంచేయడం,సబ్బులు,సర్ఫ్‌ వంటివి బీదవారికి దానంచేయడం. కార్యసిద్ధికి వీలైనంతవరకు అన్నదానాలు , రుద్రాభిశేకాలు చేయడం మంచిది.

అనుకున్నది సాధించండి । సుఖీభవ ।

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+