జ్యోతిషం: మీ సందేహాలకు సమాధానాలు కావాలా?
భవిష్యత్తు కోసం మీరు జ్యోతిష్కుడిని నమ్ముతూ ఉండవచ్చు. మీరు సకాలంలో జ్యోతిష్కుడిని కలుసుకోవడానికి వీలు కాకపోవచ్చు. గృహ ప్రవేశానికి ముహూర్తాలు కావాలంటే కూడా కూడా మీరు అడగవచ్చు. వివాహానికి జాతకాలు కలుస్తాయా, లేదా అని కూడా తెలుసుకోవచ్చు.
ఉద్యోగం కోసమో, గృహ కొనుగోలు కోసమో మీరు చూస్తూ ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలతో, ఇతరత్రా సమస్యలతో మీరు వేగిపోతూ ఉండవచ్చు. అలాంటి సందర్భంలో మీరు జ్యోతిష్కుడిని ఆశ్రయించాలని అనుకున్నప్పుడు మీకు వేదిక కల్పించడానికి ఏర్పాటు చేశాం.
జ్యోతిషాన్ని నమ్మవచ్చా, లేదా అనేది ఓ సందేహం కావచ్చు. కానీ, చాలా మంది ప్రస్తుతం జ్యోతిష్కుడిని ఆశ్రయిస్తున్నారు. మీకు నమ్మకం ఉంటే జ్యోతిషపరంగా మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయనుకుంటే ఈ వేదికను వాడుకోండి.

జ్యోతిష శాస్త్రంలో ఎంఎ పట్టా తీసుకున్న ప్రముఖ జ్యోతిష్కుడు మారుతి శర్మ మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఆయన చెప్పే సలహాలు మీకేమైనా ఉపయోగపడుతాయేమో కూడా మీరు చూసుకోవచ్చు.
మీ సందేహాలను తీర్చుకోవడానికి మీ వ్యక్తిగత వివరాలు కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీ పేరు. మీరు పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నింటికి అదనపు వివరాలు అవసరం కావచ్చు. పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి ఇరువురి వివరాలు కావాల్సి ఉంటుంది. గృహప్రవేశానికి భార్యాభర్తల వివరాలు కావాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలను ఈ కింద మెయిల్‌కు పంపించండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications