జ్యోతిషం: వరదలా పాఠకుల ప్రశ్నలు
సమస్యల పరిష్కారానికి, సందేహాలు తీర్చుకోవడానికి వన్ ఇండియా తెలుగు తరఫున ప్రముఖ జ్యోతిష్కుడు మారుతి శర్మ జవాబులు ఇస్తారని చెబుతూ ప్రశ్నలు పంపాలని కోరిన వెంటనే పాఠకులు అనూహ్యంగా ప్రతిస్పందించారు. మేం ఇంత ప్రతిస్పందనను నిజానికి ఊహించలేదు. నిజానికి, ఒకో ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అధ్యయనం, పరిశీలన చాలా అవసరం.
చెప్పే విషయం చిన్నగానే ఉన్నప్పటికీ జ్యోతిష పండితుడు చాలా అధ్యయనం, పరిశీలన చేయాల్సి ఉంటుంది. పలు విషయాలను పరిశీలించి నిర్ధారణకు వచ్చి ప్రశ్నలకు సందేహాలు తీర్చాల్సి ఉంటుంది. దానికి సమయం చాలా పడుతుంది.

పాఠకులు నిరాశకు గురి కాకుండా ఎదురు చూడాలని మనవి. పాఠకుల ప్రశ్నలకు మారుతి శర్మ పండితులు తప్పకుండా సమాధానాలు ఇస్తారు. వరుసగా వాటికి ప్రశ్నలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కొద్ది రోజులు జాప్యం జరిగినా ఓపిక వహించాలని కోరుతున్నాం.
మా ఊహకు అందని రీతిలో పాఠకులు ప్రతిస్పందించడం మాకు సంతోషమే అయినప్పటికీ వారికి వెంటనే జవాబులు ఇవ్వడం వెనువెంటనే జరగడం కొద్దిగా కష్టమే. మా పాఠకులు కాస్తా ఓపిక వహిస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా మీ అందరి ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి, సందేహాలు తీరుతాయి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications